ఇండియన్ రైల్వేలో రోజువారీ విధులు నిర్వర్తించే స్టేషన్ పరిధి సిబ్బంది నియామకాలు జరిపేందుకు ఆర్‌ఆర్‌బి ఈ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. ఈ నియామక పరీక్షా ద్వారా ఇంటర్మీడియట్ అర్హుతతో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తారు.
గ్రాడ్యుయేషన్ అర్హుతతో ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్ మరియు స్టేషన్ మాస్టర్ పోస్టులను భర్తీచేస్తుంది.
నియామక బోర్డు | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
నియామక పరీక్షా | ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఎగ్జామ్ |
ఎంపిక ప్రక్రియ | రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ |
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ | ఇంటర్/డిగ్రీ |
వయో పరిమితి | 18 - 30 ఏళ్ళ మధ్య |
సిలబస్ | క్లిక్ చేయండి |
నోటిఫికేషన్ జాతీయ స్థాయిలో విడుదల చేసేటప్పటికీ నియామక ప్రక్రియ స్థానిక రైల్వే జోన్లు వారీగా జరుగుతుంది. ఇంటర్మీడియట్ అర్హుతలో ఎంపికైన పోస్టులకు 7th పే స్కేల్ లెవెల్ 2 & 3 ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు. గ్రాడ్యుయేషన్ అర్హుతతో ఎంపికైన పోస్టులకు 7th పే స్కేల్ లెవెల్ 4,5 & 6 ఆధారంగా వేతనాలు అందిస్తారు.
ఇంటర్ అర్హుతతో భర్తీచేసే పోస్టులు | |||
---|---|---|---|
పోస్టు పేరు | 7th పే స్కేల్ లెవెల్ | ప్రారంభ వేతనం | మెడికల్ ప్రమాణాలు |
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 2 | 19900/- | C -2 |
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 2 | 19900/- | C -2 |
జూనియర్ టైమ్ కీపర్ | 2 | 19900/- | C -2 |
ట్రైన్స్ క్లర్క్ | 2 | 19900/- | A -3 |
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ | 3 | 21700/- | B -2 |
డిగ్రీ అర్హుతతో భర్తీచేసే పోస్టులు | |||
---|---|---|---|
పోస్టు పేరు | 7th పే స్కేల్ లెవెల్ | ప్రారంభ వేతనం | మెడికల్ ప్రమాణాలు |
ట్రాఫిక్ అసిస్టెంట్ | 4 | 25500/- | A - 2 |
గూడ్స్ గార్డ్ | 5 | 29200/- | A - 2 |
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ | 5 | 29200/- | B - 2 |
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 5 | 29200/- | C - 2 |
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ | 5 | 29200/- | C - 2 |
సీనియర్ టైమ్ కీపర్ | 5 | 29200/- | C - 2 |
కమర్షియల్ అప్రెంటిస్ | 6 | 35400/- | B - 2 |
స్టేషన్ మాస్టర్ | 6 | 35400/- | A - 2 |
ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఎలిజిబిలిటీ
- జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
- వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 30 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
- విద్య అర్హుత : ఇంటర్మీడియట్ / గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతయినా అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- ఫీజికల్ ప్రమాణాలు: ఆర్‌ఆర్‌బి రిక్రూట్మెంట్ బోర్డు నియామక నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.
దరఖాస్తు ఫీజు | |
---|---|
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 500/- |
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు | 250/- |
ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి దరఖాస్తు విధానం
అర్హుత ఉన్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా బోర్డు అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి.
పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.
జోన్స్ వారీగా ఆర్‌ఆర్‌బి సమాచారం | |
---|---|
Ahmedabad www.rrbahmedabad.gov.in Phone : 079-22940858 | Jammu Srinagar www.rrbjammu.nic.in Phone : 0191-2476757 |
Ajmer www.rrbajmer.gov.in Phone: 0145 – 2425230 | Kolkata www.rrbkolkata.gov.in Phone: 033 – 25430108 |
Allahabad www.rrbald.nic.in Phone : 0532-2224531 | Malda www.rrbmalda.gov.in Phone : 03512-264567 |
Bangalore www.rrbbnc.gov.in Phone: 080 – 23330378 | Mumbai www.rrbmumbai.gov.in Phone : 022-23090422 |
Bhopal www.rrbbpl.nic.in Phone : 0755-2746660 | Muzaffarpur www.rrbmuzaffarpur.gov.in Phone : 0621-2213405 |
Bhubaneswar www.rrbbbs.gov.in Phone : 0674-2303015 | Patna www.rrbpatna.gov.in Phone: 0612-2677680 |
Bilaspur www.rrbbilaspur.gov.in Phone : 07752-247291 | Ranchi www.rrbranchi.gov.in Phone : 0651-2462429 |
Chandigarh www.rrbcdg.gov.in Phone: 0172 – 2730093 | Secunderabad www.rrbsecunderabad.nic.in Phone : 040-27821663 |
Chennai www.rrbchennai.gov.in Phone : 044-28275323 G | Siliguri www.rrbsiliguri.org Phone : 0353-2663840 |
orakhpur www.rrbgkp.gov.in Phone : 0551-2201209 | Guwahati www.rrbguwahati.gov.in Phone: 0361 – 2540815 |
Thiruvanthapuram www.rrbthiruvananthapuram.gov.in Phone : 0471-2323357 |
ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఎగ్జామ్ నమూనా
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిస్ పోస్టుల నియామక ప్రక్రియ ఈ కింది చూపించిన విదంగా 4 దశల్లో జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన తేదీ, సమయం, పరీక్షా కేంద్రం మరియు ఇతర వివరాలను అర్హుత ఉన్న అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బి నేరుగా అందజేస్తుంది
- ఫస్ట్ స్టేజ్ సీబీటీ
- సెకండ్ స్టేజ్ సీబీటీ
- టైపింగ్ స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి ఫస్ట్ స్టేజ్ సీబీటీ
పరీక్షా ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్దతిలో జరుగుతుంది. జనరల్ అవెర్నెస్, మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ అంశాలకు సంబంధించి 100 మల్టిబుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. పరీక్షా నిడివి 90 నిముషాలు ఉంటుంది.
సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 0.25 మార్కులు కోత విధిస్తారు. ఫస్ట్ స్టేజ్ సీబీటీ స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు సెకండ్ స్టేజ్ సీబీటీ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
ఈ పరీక్షలో కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
జనరల్ అవెర్నెస్ | 40 | 40 | 90 నిముషాలు |
మ్యాథమెటిక్స్ | 30 | 30 | |
జనరల్ ఇంటిలిజెన్స్-రీజనింగ్ | 30 | 30 |
ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపిసి సెకండ్ స్టేజ్ సీబీటీ
ఫస్ట్ స్టేజ్ సీబీటీ లో మెరిట్ సాధించిన అభ్యర్థులను కేటగిరి వారి రిజర్వేషన్ ఆధారంగా ఖాళీ ఉండే పోస్టుల సంఖ్యకు 14 రేట్లు మంది అభ్యర్థులను సెకండ్ స్టేజ్ సీబీటీ కోసం ఎంపిక చేస్తారు. సెకండ్ స్టేజి సీబీటీ ప్రశ్నల సంఖ్యా, పరీక్షా వ్యవధి మినహాయిస్తే పరీక్షా మొత్తం ఫస్ట్ స్టేజ్ సీబీటీని పోలిఉంటుంది. కాకుంటే పరీక్షా ప్రశ్నల స్థాయి 7th వేతన స్కేల్ లెవెల్ 2 నుండి 3,4,5,6 పరంగా పెరుగుతూ ఉంటుంది.
ఈ పరీక్షలో కూడా కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
జనరల్ అవెర్నెస్ | 50 | 50 | 90 నిముషాలు |
మ్యాథమెటిక్స్ | 35 | 35 | |
జనరల్ ఇంటిలిజెన్స్-రీజనింగ్ | 35 | 35 |
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ మరియు స్టేషన్ మాస్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. సెకండ్ స్టేజ్ సీబీటీ లో మెరిట్ సాధించిన ట్రాఫిక్ అసిస్టెంట్ మరియు స్టేషన్ మాస్టర్ అభ్యర్థులను ఆప్టిట్యూడ్ టెస్ట్ కోసం ఎంపిక చేస్తారు.
ఖాళీ ఉన్న ట్రాఫిక్ అసిస్టెంట్ మరియు స్టేషన్ మాస్టర్ పోస్టుల సంఖ్యకు 8 రేట్లు మంది అభ్యర్థులను ఆప్టిట్యూడ్ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్టు ప్రతి టెస్ట్ బ్యాటరీలో అభ్యర్థి కనీసం 42 మార్కులు సాధించాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో అందుబాటులో ఉంటుంది.
ఆప్టిట్యూడ్ టెస్ట్ | |
---|---|
1 | Memory Test – Aptitude Test for Measuring Memory |
2 | Following Directions – Aptitude Test to Measure the Ability to Follow Directions |
3 | Depth Perception – Aptitude Test to Measure Depth Perception |
4 | Concentration Test – Aptitude Test to Measure Concentration |
5 | Perceptual Speed Test – Aptitude Test to Measure Perceptual Speed |
టైపింగ్ స్కిల్ టెస్ట్
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ టైమ్ కీపర్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది తప్పనిసరి అర్హుత సాధించాల్సిన పరీక్షా. దీనికి ఎటువంటి అర్హుత మార్కులు కేటాయించారు. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు ప్రతి నిముషానికి 30 ఇంగ్లీష్ పదాలు లేదా 25 హిందీ పదాలు కంప్యూటర్ కీబోర్డ్ ద్వారా టైపు చేయాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్
తుది ఎంపికలో సెకండ్ స్టేజ్ సీబీటీలో సాధించిన మార్కులకు 70% వెయిటేజీ ఉంటుంది. మిగతా 30 % వెయిటేజీ ఆప్టిట్యూడ్ టెస్టులో సాధించిన మార్కులకు కల్పిస్తారు. అన్ని టెస్టుల్లో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపికైన అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తారు. వారికీ ట్రైనింగ్ అందించి విధుల్లోకి తీసుకుంటారు.