ఐఐటీ జామ్ 2023 అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది. ఐఐటీలు మరియు ఐఐఎస్ యందు పీజీ కోర్సుల ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ పరీక్ష యొక్క దరఖాస్తు ప్రక్రియ 07 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభం కానుంది. పరీక్షను 12 ఫిబ్రవరి 2023 న నిర్వహించనున్నారు.
జామ్ అనగా జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అని అర్ధం. జామ్ పరీక్షలో అర్హుత పొందిన వారు దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) లలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం దక్కించుకుంటారు.
Exam Name | JAM 2022-23 |
Exam Type | Admission |
Admission For | M.Sc In IIT's |
Exam Date | 12 Feb 2023 |
Exam Duration | 3.00 Hours |
Exam Level | National Level |
జాయిన్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్
అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అందించే ఐఐటీల్లో పీజీ చేయడం సాధారణ విషయం కాదు. ఈ అదృష్టం దక్కించుకోవాలంటే జామ్ పరీక్షను ఛేదించాల్సిందే. ఈ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా ఐఐటీ, ఐఐఎస్ లలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (రెండేళ్లు), మాస్టర్ ఇన్ ఎకనామిక్స్ (రెండేళ్లు), జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ, ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ మరియు పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు పొందొచ్చు. 55 శాతం మార్కులతో సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
-
జామ్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్లు కల్పించే ఇనిస్టిట్యూట్లు
-
జామ్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ పొందే ఎంఎస్సీ స్పెషలైజేషన్స్
-
జామ్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ పొందే మాస్టర్ డిగ్రీలు
-
జామ్ ఎగ్జామ్ 2023 షెడ్యూల్
-
జామ్ ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు
-
జామ్ ఎగ్జామ్ దరఖాస్తు ప్రక్రియ
-
జామ్ ఎగ్జామ్ నమూనా
-
జామ్ అడ్మిషన్ ప్రక్రియ & క్వాలిఫై మార్కులు
-
జామ్ 2023 సిలబస్ & క్వశ్చన్ పేపర్లు
జామ్ 2023 ద్వారా అడ్మిషన్ పొందే ఐఐటీలు
IISc Bangalore www.iisc.ac.in IIT Bhilai www.iitbhilai.ac.in IIT Bhubaneswar www.iitbbs.ac.in IIT Bombay www.iitb.ac.in IIT Delhi www.iitd.ac.in IIT (ISM) Dhanbad www.iitism.ac.in IIT Gandhinagar www.iitgn.ac.in IIT Guwahati www.iitg.ac.in IIT Hyderabad www.iith.ac.in IIT Indore www.iiti.ac.in |
IIT Jodhpur www.iitj.ac.in IIT Kanpur www.iitk.ac.in IIT Kharagpur www.iitkgp.ac.in IIT Madras www.iitm.ac.in IIT Mandi www.iitmandi.ac.in IIT Palakkad www.iitpkd.ac.in IIT Patna www.iitp.ac.in IIT Roorkee www.iitr.ac.in IIT Ropar www.iitrpr.ac.in IIT Tirupati www.iittp.ac.in IIT (BHU) Varanasi www.iitbhu.ac |
జామ్ ద్వారా అడ్మిషన్ పొందే ఎంఎస్సీ స్పెషలైజేషన్లు
Biotechnology (BT) Chemistry (CY) Economics (EN) Geology (GG) |
Mathematics (MA) Mathematical Statistics (MS) Physics (PH) |
జామ్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ పొందే మాస్టర్ డిగ్రీలు
M.Sc. (Two years) Masters in Economics (Two years) Integrated Ph.D. |
Joint M.Sc.-Ph.D. M.Sc.-Ph.D. Dual Degree Post-Bachelors Degree Programmes |
జామ్ ఎగ్జామ్ 2023 షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 07 సెప్టెంబరు 2022 |
దరఖాస్తు తుది గడువు | 11 అక్టోబరు 2022 |
అడ్మిట్ కార్డు | 07 జనవరి 2023 |
ఎగ్జామ్ తేదీ | 12 ఫిబ్రవరి 2023 |
జామ్ ఫలితాలు | 22 మార్చి 2023 |
జామ్ అడ్మిషన్ తేదీలు | 11 -25 ఏప్రిల్ 2023 |
పరీక్ష తేదీ | సెషన్ | సమయం | పేపర్లు |
12 Feb 2023 | సెషన్ I | ఉదయం | కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ |
సెషన్ II | మధ్యాహ్నం | బయోటెక్నాలజీ, మాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ |
జామ్ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు
రిజర్వేషన్ కేటగిరి | దరఖాస్తు ఫీజు (1 పేపర్) | దరఖాస్తు ఫీజు (2 పేపర్స్) |
జనరల్ కేటగిరి | 1800/- | 2500/- |
ఎస్సీ, ఎస్టీ & దివ్యంగులు | 900/- | 1250/- |
జామ్ ఎగ్జామ్ సెంటర్లు
ఐఐటీ బెంగుళూరు జోన్హైదరాబాద్, బెంగుళూరు |
ఐఐటీ మద్రాస్ జోన్చెన్నై, తిరుపతి, వరంగల్ |
ఐఐటీ ఖరాగపూర్ జోన్విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ |
జామ్ ఎగ్జామ్ దరఖాస్తు ప్రక్రియ
జామ్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. జామ్ అధికారిక పోర్టల్ (www.jam.iitg.ac.in) నుండి ఆన్‌లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి పోర్టల్ని సందర్శించిన వారు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ వివరాలతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు జామ్ నిర్వాహకులు కోరిన విద్య, వ్యక్తిగత సమాచారం తప్పులు దొర్లకుండా దరఖాస్తులో పొందుపర్చాలి. రిజర్వేషన్ కేటగిరి, కోర్సు ఎంపిక, పరీక్షా కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు పొందుపర్చినప్పుడు మరోమారు సరిచూసుకోండి.
ప్రవేశ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మెయిల్ మరియు మొబైల్ ద్వారా అందజేస్తారు. అందువలన అభ్యర్థులు ఖచ్చితమైన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలు అందజేయాల్సి ఉంటుంది.
చివరిగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమయ్యాక సంబంధిత దరఖాస్తు ప్రింట్ తీసి మీ వద్ద భద్రపర్చుకోండి. పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్సైటు అందుబాటులో ఉంచుతారు.
జామ్ 2023 ఎగ్జామ్ నమూనా
జామ్ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో పూర్తి బిన్నంగా నిర్వహించబడుతుంది. కంప్యూటర్ స్క్రీన్ పై 7 టెస్ట్ పేపర్స్ లైవ్ లో అందుబాటులో ఉంటాయి. అందులో నుంచి రాండమ్'గా ప్రశ్నలు అభ్యర్థి కంప్యూటర్ స్క్రీన్ పై ఇవ్వబడతాయి.
క్వశ్చన్ పేపర్లో మొత్తం 60 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు (MCQ) 3 సెక్షన్లుగా 100 మార్కులకు ఇవ్వబడతయి. సెక్షన్ A లో మొత్తం 30 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 2 మార్కుల ప్రశ్నలు 20, ఒక మార్కు ప్రశ్నలు 10 ఇవ్వబడతాయి.
సెక్షన్ Bలో మొత్తం 10 మల్టిఫుల్ సెలెక్ట్ ప్రశ్నలు (MSQ) ఉంటాయి. ఇందులో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్ C యందు మొత్తం 20 న్యూమరికాల్ ఆన్సర్ ఆధారిత ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో 10 ఒక మార్కు ప్రశ్నలు మరో పది 2 మార్కులు ప్రశ్నలు ఉంటాయి.
అన్ని సెక్షన్లకు సంబంధించి అన్ని ప్రశ్నలను తప్పనిసరి సమాధానం చేయాలి. సెక్షన్ A, ఒక మార్కు ప్రశ్నలకు సంబంధించి తప్పు సమాధానం చేసిన వాటికీ 1/3 మార్కులు, 2 మార్కులకు సంబంధించి తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 2/3 మార్కులు తొలగిస్తారు. సెక్షన్ B & C ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు.
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
సెక్షన్ A : MCQ | 20 + 10 | 40 + 10 | 3.00 గంటలు |
సెక్షన్ B : MCQ | 10 | 20 | |
సెక్షన్ C : NAT | 10 + 10 | 10 + 20 |
జామ్ అడ్మిషన్ ప్రక్రియ & క్వాలిఫై మార్కులు
జామ్ అడ్మిషన్ ప్రక్రియ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ద్వారా నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే మెరిట్ జాబితా రూపొందించేందుకు పరిగణిస్తారు. యూజీసీ అడ్మిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి కోర్సులో సంబంధిత రిజర్వేషన్ కోటాలా ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్షలో సమానమైన మార్కులు సాధించిన అభ్యర్థుల విషయంలో, సెక్షన్ C లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రాధాన్యత కల్పిస్తారు. అప్పటికి సమమైతే ఎక్కువ వయసున్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
మరిన్ని వివరాలకోసం ఈ కింది నెంబర్లను సంప్రదించండి
Phone No.: (0361) 2586500
E-mail: jam2023@iitg.ac.in
జామ్ 2023 సిలబస్ & క్వశ్చన్ పేపర్లు
జామ్ బయోటెక్నాలజీ (BT) సిలబస్ | సిలబస్ 2023 క్వశ్చన్ పేపర్ 2022 క్వశ్చన్ పేపర్ 2021 క్వశ్చన్ పేపర్ 2020 |
జామ్ కెమిస్ట్రీ (CY) సిలబస్ | సిలబస్ 2023 క్వశ్చన్ పేపర్ 2022 క్వశ్చన్ పేపర్ 2021 క్వశ్చన్ పేపర్ 2020 |
జామ్ ఎకనామిక్స్ (EN) సిలబస్ | సిలబస్ 2023 క్వశ్చన్ పేపర్ 2022 క్వశ్చన్ పేపర్ 2021 |
జామ్ జియాలజి (GG) సిలబస్ | సిలబస్ 2023 క్వశ్చన్ పేపర్ 2022 క్వశ్చన్ పేపర్ 2021 క్వశ్చన్ పేపర్ 2020 |
జామ్ మ్యాథమెటిక్స్ (MA) సిలబస్ | సిలబస్ 2023 క్వశ్చన్ పేపర్ 2022 క్వశ్చన్ పేపర్ 2021 క్వశ్చన్ పేపర్ 2020 |
జామ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (MS) సిలబస్ | సిలబస్ 2023 క్వశ్చన్ పేపర్ 2022 క్వశ్చన్ పేపర్ 2021 క్వశ్చన్ పేపర్ 2020 |
జామ్ ఫిజిక్స్ (PH) సిలబస్ | సిలబస్ 2023 క్వశ్చన్ పేపర్ 2022 క్వశ్చన్ పేపర్ 2021 క్వశ్చన్ పేపర్ 2020 |