ఇందిరా గాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగల్ గర్ల్ చైల్డ్ – 2022
Scholarships

ఇందిరా గాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగల్ గర్ల్ చైల్డ్ – 2022

ఇందిరా గాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగల్ గర్ల్ చైల్డ్ పథకాన్ని దేశంలో మహిళా విద్యను ప్రోత్సహించడంతో పాటుగా, చిన్న కుటుంబాల ఆవశ్యకతను తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సింగల్ గర్ల్ చైల్డ్ ఫ్యామీలకు చెందిన పీజీ చదివే ఆడ పిల్లలకు నెలకు 3000/- రూపాయలు చెప్పున ఏడాదికి 36 వేల రూపాయల స్కాలర్షిప్ అందిస్తారు.

స్కాలర్షిప్ పేరు ఇందిరా గాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగల్ గర్ల్ చైల్డ్
ఎవరు అర్హులు సింగల్ గర్ల్ ఫ్యామిలీస్
దరఖాస్తు ముగింపు తేదీ 15-01-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 31-01-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 31-01-2022

ఈ పథకం పరిధిలో దేశవ్యాప్తంగా ఏటా మూడు వేల మంది మహిళా పీజీ విద్యార్థులకు అమలుచేస్తున్నారు. యూజీసీ గుర్తింపు పొందిన స్టేట్, సెంట్రల్, డ్రీమ్డ్ యూనివర్సిటీలతో పాటుగా నేషనల్ ఇనిస్టిట్యూట్లలో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ కేవలం పోస్టుగ్రాడ్యుయేషన్ చదివే మహిళా విద్యార్థులకు మాత్రమే అందిస్తారు. ఈ స్కాలర్షిప్ గరిష్టంగా రెండేళ్లు అందిస్తారు.

ఎవరు అర్హులు

ఈ పథకానికి ఒక ఆడపిల్ల ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలు మాత్రమే అర్హులు. విద్యార్థి వయస్సు అడ్మిషన్ సమయానికి 30 ఏళ్ళు మించకూడదు. ఈ స్కీమ్ రెగ్యులర్ పీజీ కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులకు వర్తించదు.

దరఖాస్తు విధానం

అర్హుత ఉండే మహిళా విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని సక్రమంగా ఉండే దరఖాస్తులు, పలు దశల వెరిఫికేషన్ తర్వాత విద్యార్థి వయస్సు మరియు మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్ అందిస్తారు. దరఖాస్తు చేసే ముందు మొబైల్ నెంబర్ లింక్డ్ ఆధార్ కార్డు, మొబైల్ లింక్డ్ బ్యాంకు అకౌంట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అకాడమిక్ సర్టిఫికెట్లు అందుబటులో ఉంచుకోండి. ఈ స్కీమ్ చెందిన పూర్తి సమాచారం యూజీసీ పోర్టల్ యందు అందుబాటులో ఉంటుంది.

Post Comment