The 10X Rule
గ్రాంట్ కార్డోన్ రచించిన "10 ఎక్స్ రూల్" బుక్ వ్యక్తుల మానసిక పరిధి గురించి చర్చిస్తుంది. ఒక పరిమిత ఆలోచన పరిధిలో చిక్కుకుపోయే వారు తాము ఉండే స్థితికి మించి పది రేట్లు గొప్పగా ఎలా ఆలోచించాలో ఈ బుక్ తెలియజేస్తుంది. వ్యక్తిగత జీవితంలో లేదా వృత్తిపరమైన జీవితంలో కొత్త పని ప్రారంభించే ముందు కొన్ని భయాలు మనల్ని వెనక్కి లాగుతాయి. వాటిని ఎలా అధిగమించాలో ఈ పుస్తకం గైడ్ చేస్తుంది. కొందరు విఫలం కావడానికి మరికొందరు విజయవంతం కావడానికి గల ఖచ్చితమైన కారణాలను ఈ పుస్తకం వివరిస్తుంది. ప్రభవంతమైన ఫలితాలు పొందేందుకు మానసికంగా ఎలా తయారవ్వలో ఈ బుక్ చదివి మీరు తెలుసుకోవచ్చు.
Rework
డేవిడ్ హీన్మీయర్ హాన్సన్ రచించిన "రీవర్క్" పుస్తకం స్టార్టప్ ప్రారంభ మెళకువలు గురించి గైడ్ చేస్తుంది. విజయవంతమైన వ్యాపారం నిర్మించేందుకు మెరుగైన, వేగవంతమైన, సులభమైన సక్సెస్ మార్గాన్ని ఏవిధంగా నిర్మించుకోవాలో ఈ బుక్ వివరిస్తుంది. పాత బిజినెస్ పుస్తకాల సోది చదివి విసిగెత్తిన వారికీ ఈ ఆధునిక వ్యాపార ప్రణాళిక పొందుపర్చిన పుస్తకం గొప్ప నూతన ఉత్సాహం కల్గిస్తుంది. కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించే వారు మార్కెట్ పోటీతత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో, పెట్టుబడిదారులను ఎలా ఆకర్షించాలో, గొప్ప వ్యాపార ప్రణాళిక ఎలా రూపొందించాలో వంటి అంశాలను ఈ బుక్ చక్కగా వివరిస్తుంది.
Crushing It
2009 లో అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లర్ గా రికార్డు దక్కించుకున్న "క్రషింగ్ ఇట్" పుస్తకం గ్యారీ వాయర్‌న్‌చుక్ రచించారు. ఈయన ఈ పుస్తకంలో వ్యవస్థాపక బ్రాండింగ్ గురించి చేర్చించారు. ఒక విజయవంతమైన వ్యవస్థాపకతలో వ్యక్తిగత బ్రాండింగ్ యెంత కీలకపాత్ర పోషిస్తుందో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. వృత్తిపరమైన ఆర్థిక విజయానికి మీ సొంత మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలో ఈ పుస్తకం గైడ్ చేస్తుంది. కుప్పలు తెప్పలుగా ఉన్నా సోషల్ మీడియా వేదికల ద్వారా మీ సొంత బ్రాండింగ్ ఎలా ప్రభవవంతంగా ఆవిష్కరించాలో ఈ బుక్ మీకు చక్కగా వివరిస్తుంది.
Before You Start Up
పంకజ్ గోయల్ తొలిరచన "బిఫోర్ యు స్టార్ట్ అప్" వ్యవస్థాపకత సంబంధించిన సమస్త సమాచారం అందిస్తుంది. ఈ పుస్తకం మీ సొంత ఉత్పత్తిని లేదా సంస్థను ఒక ఐడియా స్థాయి నుండి విజయవంతమైన బిజినెస్ వెంచర్ గా ఎలా మలచుకోవాలో గైడ్ చేస్తుంది. వ్యవస్థాపకత ప్రారంభించే ముందు దాన్ని అంచనా వేయడం, పెట్టుబడులు సమకూర్చడం, మానవ వనురులను నియమించుకోవడం మరియు ఆచరణాకు సాధ్యంకాని వాటిని రియాలిటీగా మార్చేందుకు అవసరమైన విలువైన అంశాలు ఈ బుక్ చదవడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
The Lean Startup
ఎరిక్ రైస్ రచించిన "ది లీన్ స్టార్టప్" పుస్తకం వ్యవస్థాపకత రూపకల్పన గురించి చేర్చిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికీ ఈ పుస్తకం సంపూర్ణ మార్గనిర్దేశం చేస్తుంది. ఒక విజయవంతమైన వ్యాపారం సృష్టించేందుకు అవసరమయ్యే విస్తృత ప్రణాళిక ఈ పుస్తకంలో పొందుపర్చారు. కొత్తగా ప్రారంభించే స్టార్టప్'లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇదివరకు ఉన్న ఉత్పత్తులు కొత్తగా మార్కెట్ చేసేందుకు అవసరమయ్యే ప్రణాళికలు. మార్కెట్టులో ఆకస్మాతుగా దాపరించే అనిశ్చితి ఎదుర్కునే చిట్కాలు. కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌కు ప్రతిస్పందనగా చురుకైన ప్రత్యామ్నాయాలు రూపొందించడం వంటి ఎన్నో విలువైన విషయాలు ఈ బుక్ మీకు అందిస్తుంది.
Founders At Work
జెస్సికా లివింగ్'స్టన్ రాసిన "ఫౌండర్స్ ఎట్ వర్క్" పుస్తకంలో కొందరు విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్స్ ఇంటర్వ్యూలు పొందుపర్చారు. స్టీవ్ వోజ్నియాక్ (ఆపిల్), కాటెరినా ఫేక్ (ఫ్లికర్), మిచ్ కపూర్ (లోటస్), మాక్స్ లెవ్చిన్ (పేపాల్), మరియు సబీర్ భాటియా (హాట్ మెయిల్) వంటి కొందరు వ్యవస్థాపకులు తమ వ్యాపార అనుభవాలను తమ మాటల్లో ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ కథలు వర్ధమాన వ్యవస్థాపకులను గైడ్ చేయడమే కాకుండా వారిలో గెలుపు కాంక్షను, ఎంట్రప్రెన్యూర్ స్ఫూర్తిని పెంపొందిస్తాయి.
The Effective Executive
అమెజాన్ వ్యవస్థపుకుడు జెఫ్ బెజోస్ మరియు తన సీనియర్ మేనేజర్లను రోజంతా బుక్ క్లబ్‌లో కూర్చుని చదివేలా చేసిన మూడు పుస్తకాల్లో “ఎఫెక్టివ్ ఎగ్జిక్యూటివ్” ఒకటి. కాబట్టి ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉపయోగపడే అంశాలు ఉన్నాయని చెప్పల్సిన అవసరంలేదు. పీటర్ ఎఫ్. డ్రక్కర్ రచించిన ఈ పుస్తకం ప్రధానంగా వ్యాపార నిర్వహణ, పెట్టుబడులు గురించి చర్చిస్తుంది. ఒక సమర్ధవంతమైన కార్యనిర్వాహకుడు ఏవిధంగా వ్యాపారం నిర్వహించాలో, మార్కెట్ పరిస్థితిలకు అనుగుణంగా ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఈ పుస్తకం బోధిస్తుంది.
The E-Myth revisited
మైఖేల్ ఇ గెర్బెర్ రాసిన "ది ఇ - మిత్ రివిజిటెడ్" పుస్తకం ఒక చిన్న బిజినెస్ ఐడియా నుండి విజయవంతమైన బిజినెస్ వెంచర్ ఎలా రూపొందించాలో గైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కరిలో ఒక వ్యవస్థాపకుడు, ఒక మేనేజర్, ఒక సాంకేతిక నిపుణుడు ఉంటారని మైఖేల్ ఇ. గెర్బెర్ బలంగా నమ్ముతారు. వారిని విజయవంతమైన వ్యక్తులుగా ఎలా బయటకు తీయాలో ఈయన ఇందులో వివరించారు. చాల చిన్న వ్యాపారాలు పెద్ద బిజినెస్ వెంచర్లుగా ఎదగలేకపోవడానికి గల కారణాలను ఈయన ఈ పుస్తకంలో పొందుపర్చారు.
Discover your True North
బిల్ జార్జ్ మరియు పీటర్ సిమ్స్ రచించిన "డిస్కవర్ యువర్ ట్రూ నార్త్" పుస్తకం ప్రామాణిక నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం ఎలా అను అంశానికి సంబంధించి రాయబడింది. దాదాపు 125 మంది ప్రముఖుల వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా గ్రహించిన అమూల్యమైన జ్ణానాన్ని ఈ పుస్తకంలో పొందుపర్చడం జరిగింది. చాలామంది యువ వ్యాపారవేత్తలు సరైన నాయకత్వ లక్షణాలు లేకపోవడం వలన వ్యాపార నిర్వహణలో విఫలమౌతుంటారు. అలాంటి వారికీ ఈ పుస్తకం సరైన మార్గనిర్దేశం చేస్తుంది. ఒక పెద్ద సంస్థను నిర్వహించేందుకు నాయకుడికి కావాల్సిన ఉత్తమ నాయకత్వ లక్షణాలను ఈ పుస్తకం బోధిస్తుంది.
Start With Why
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు రచయత అయినా సైమన్ సినెక్ ఈ "స్టార్ట్ విత్ వై" పుస్తకం రచించారు. ఈ బుక్ ప్రధానంగా ప్రభావంతమైన లీడర్షిప్ గురించి చర్చించారు. ఒక పని ప్రారంభించే ముందు ఎందుకు, ఎలా, ఏమిటి వంటి ఆలోచనలు ఎంత గొప్ప నిర్మాణాత్మక మార్గాన్ని చూపిస్తాయో అనే అంశాన్ని ఈయన ఈ పుస్తకంలో క్షుణ్ణంగా వివరించారు. సమర్ధవంతమైన కమ్యూనికేషన్ అంటే మాట్లాడం కాదు చక్కగా వినడం అనే అంశాన్ని కూడా ఇందులో చేర్చించారు. ఎక్కువ మాట్లాడే నాయకుడు కొంటె ఎక్కువ వినే నాయకుడు వ్యూహాత్మక ఆలోచనలు చేయగలడని ఈ పుస్తకం ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
How to win friends and influence people
డేల్ కార్నెగీ రాసిన "హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్" పుస్తకం స్నేహితులను ఎలా గెలవాలి, ప్రజలను ఎలా ప్రభావితం చేయాలి అను అంశానికి సంబంధించి రాయబడింది. ప్రతి వ్యాపారవేత్తకు ఉండాల్సిన ఈ రెండు గొప్ప అంశాల గురించి డేల్ కార్నెగీ లోతుగా వివరించారు. తమని తాము ఎంట్రప్రెన్యూర్స్ గా భావించే ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన పుస్తకమిది. స్నేహితులను సంపాదించుకోవడం, మానవ సంబంధాలు మెరుగుపర్చుకోవడమే కాకుండా మీ ఆలోచనలు వ్యతిరేకించే వారిని, మిమ్మల్ని నమ్మని వారిని కూడా ఎలా గెలుచుకోవాలో చెప్పే పుస్తకమిది. ప్రతి ఏటా అత్యధికంగా అమ్ముడయ్యే బిజినెస్ సంబంధిత పుస్తకాలలో ఈ పుస్తకం తప్పక ఉంటుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడుకుపోయింది. 2011 లో టైమ్ మ్యాగజైన్ యొక్క 100 అత్యంత ప్రభావవంతమైన పుస్తకాల జాబితాలో ఇది 19 వ స్థానం దక్కించుకుంది.
The Intelligent Investor
బెంజమిన్ గ్రాహం రాసిన "ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్" 1949 లో తొలిసారి ప్రచురించ బడింది. ఈ బుక్ ప్రధానంగా వ్యూహాత్మక పెట్టుబడులు గురించి రాయబడింది. విజయవంతమైన ఆర్థిక ఫలితాలు పొందేందుకు అనుచరించాల్సిన వ్యూహాలు మరియు వివేకాన్ని ఈ బుక్ అందిస్తుంది. పెట్టుబడిదారులు బైబిల్ గా భావించే ఈ బుక్ ఎందరో ఆర్థికవేత్తల ప్రసంశలు గెలుచుకుంది. ఇన్వెస్టుమెంట్ వ్యూహాలు గురించి పూర్తిస్థాయి అధ్యయనం చేయాలనుకునే వారు తప్పక చదవాల్సిన బుక్ ఇది.
The Richest Man In Babylon
జార్జ్ ఎస్. క్లాసన్ రాసిన "ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్" 1926 లో మొదటి సారి ప్రచురించబడింది. ఇది 4,000 సంవత్సరాల క్రితం పురాతన బాబిలోన్ కాలం నాటి ఆర్కాడ్ అనే ధనవంతుడి దృక్కోణం నుండి రచయిత అమూల్యమైన ఆర్థిక పాఠాలను ఈ పుస్తకం ద్వారా వివరించారు. డబ్బు సంపాదన, పొదుపు మరియు పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక జ్ఞానాన్ని 7 ప్రాథమిక సూత్రాలలో ఈ బుక్ వివరిస్తుంది.
Click Millionaires
ఈ కామర్స్ నిపుణుడు స్కాట్ ఫాక్స్ రాసిన "క్లిక్ మిలియనీర్స్" విప్లవాత్మక వ్యాపార డిజైన్ సూత్రాలను బోధిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారం ప్రారంభించే యువ పారిశ్రామికవేత్తలకు ఈ బుక్ దిక్సూచి గా నిలుస్తుంది. ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించే అన్ని మార్గాలను ఈ బుక్ చర్చిస్తుంది. 9-5 వృత్తి జీవితానికి స్వప్తి పలికి చక్కని ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాన్ని ఎంచుకోవడం ద్వారా తక్కువ సమయం పని చేసి ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో ఈ బుక్ గైడ్ చేస్తుంది. ఆన్‌లైన్ ద్వారా సంపాదన మార్గాలను వెతికేవారు తప్పక చదవాల్సిన పుస్తకమిది.
The Star-tup of You
లింక్డ్ఇన్ సహా వ్యవస్థాపకుడు & ఛైర్మన్ మరియు రచయత బెన్ కాస్నోచా ఈ "స్టార్ట్-అప్ ఆఫ్ యు" బుక్ రాశారు. సిలికాన్ వ్యాలీ కథలు తెలుసుకోవాలనుకునే వారు ఈ బుక్ తప్పక చదివి తీరాలి. వృత్తి, వ్యాపార జీవితం ప్రారంభించే ముందు అవసరమయ్యే ముడిసరుకు గురించి ఈ బుక్ వివరిస్తుంది. కెరీర్ పరంగా వ్యూహాత్మకంగా ఎదిగేందుకు అవసరమయ్యే గైడెన్స్ ఈ బుక్ అందిస్తుంది. 21వ శతాబ్దపు వ్యాపార, కెరీర్ ప్రణాళికలు తెలుసుకోవాలంటే ఈ బుక్ తప్పక చదవల్సిందే.
The 4 Hours Workweek
తిమోతి ఫెర్రిస్ రచించిన "ది ఫోర్ అవర్ వర్క్‌వీక్" ప్రతి ఎంట్రప్రెన్యూర్ బుక్ సెల్ఫ్ లో తప్పక ఉండల్సిన పుస్తకం. ఎవరైతే 9-5 వృత్తి జీవితం సంబంధించి విరక్తి చెంది ఉన్నారో, ఎవరైతే ఎంట్రపెన్యూర్ ఆలోచనలతో సతమతమౌతున్నారో వారంతా తప్పక చదవాల్సిన బుక్ ఇది. ఈ బుక్ ప్రధానంగా వారానికి నాలుగు గంటలు పనిచేసే వృత్తి జీవితం ఎలా నిర్మించుకోవాలో వివరిస్తుంది. మిగతా సమయాన్ని వ్యక్తిగత అభిరుచులకు ఏవిధంగా ఉపయోగించుకోవచ్చో గైడ్ చేస్తుంది. వ్యవస్థాపక స్పూర్తితో పనిచేయాలనుకునే వారికీ, సమయం విలువ తెలుసుకోవాలనుకునే వారికి ఈ బుక్ చక్కని మార్గనిర్దేశం చేస్తుంది.
Factfullness
హన్స్ రోస్లింగ్ రచించిన ఫ్యాక్టఫుల్'నెస్ పుస్తకం మనిషి ప్రపంచాన్ని చూస్తున్న, చూడల్సినదృక్పథం గూర్చి చర్చిస్తుంది. 2018 లో ప్రచురించబడిన ఈ బుక్ పుస్తక ప్రియలను అమితంగా ఆకట్టుకుంది. బిల్ గేట్స్ యువ గ్రాడ్యుయేట్స్'కి సిపార్సు చేసిన 5 పుస్తకాలలో ఇది ఒకటి. ప్రజల వక్రీకృత ప్రపంచ దృక్పథాన్ని, వారికుండే తీవ్రమైన అభిప్రాయాలను అధిగమించడం ఎంత ముఖ్యమో రచయిత ఈ బుక్ ద్వారా స్పష్టంగా వివరించారు. ఇప్పటివరకు చేసిన మానవ పురోగతి ప్రయాణం గురించి తెలుసుకోవాలనుకునే వారు తప్పక చదవవలసిన పుస్తకమిది. ప్రజలకు పాజిటివ్ దృక్పథం ఎంత అవసరమో ఈ బుక్ బల్లగుద్ది చెప్తుంది.
You Can Win
శివ ఖేరా రచించిన "యు కెన్ విన్" పుస్తకం ఆచరణాత్మక వ్యక్తిగత లక్ష్యాలు ఎలా సాధించాలో చెప్తుంది. రోజువారీ వ్యక్తిగత, వృత్తి పరమైన గందరగోళం నుండి బయటపడి స్పష్టమైన వ్యక్తిగత లక్ష్యాలు ఎలా ఏర్పర్చుకోవాలో ఈ బుక్ వివరిస్తుంది. వ్యక్తిగత వికాసానికి సంబంధించిన పుస్తకాలలో ఇదో ఒక ఉత్తమ పుస్తకం. మీ జీవితంపై మీకు ఏవిధమైన స్పష్టత లేకుంటే ఈ బుక్ మీరు తప్పక చదివి తీరాలి.
Zero to One
ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ మరియు ఇన్వెస్టర్ పీటర్ థీల్ రచించిన "జీరో టూ వన్" పుస్తకం వ్యవస్థాపకత ప్రారంభించే ముందు చేయకూడని, చేయాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చేర్చిస్తుంది. కొత్త బిజినెస్ ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉన్న బిజినెస్ ఎలా వృద్ధి పర్చాలో వివరిస్తుంది. పీటర్ థీల్ ఒక వ్యవస్థాపకుడుగా తన వ్యాపార అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.
The Entrepreneur Roller Coaster
డారెన్ హార్డీ రాసిన ఎంటర్‌ప్రెన్యూర్ రోలర్ కోస్టర్ పుస్తకం ఎంటర్‌ప్రెన్యూర్స్ సాధకబాధకాలు గురించి రాయబడింది. ఎంటర్‌ప్రెన్యూర్ జీవితంలో ఉండే మలుపులు, ట్విస్టులు, హెచ్చు తగ్గులు, ఆ ప్రయాణంలో ఉండే కన్ఫ్యూషన్స్ గురించి ఈ బుక్ కళ్ళకు అద్దెల చూపిస్తుంది. అనుకున్నది సాధించిన ఎంటర్‌ప్రెన్యూర్స్ కథలు ఎంత గొప్పగా ఉంటాయో ఆ స్థాయికి చేరుకునేందుకు వారు ప్రయాణించిన పధంలో అన్ని ట్విస్టులు ఉంటాయి..నిజంగానే అదో రోలర్ కోస్టర్ రైడ్. ఎంటర్‌ప్రెన్యూర్ ఆలోచన ఒక వ్యక్తిలో మొదలయ్యాక అది వారిని ఎంతలా హింసిస్తుందో అది వారికీ మాత్రమే తెలుస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్ గా మారేందుకు తపనపడే ప్రతి ఒక్కరు తప్పక చవల్సిన పుస్తకమిది .