జంతురాజ్యం వర్గీకరణ – ప్రాక్టీస్ ప్రశ్నలు
Study Material

జంతురాజ్యం వర్గీకరణ – ప్రాక్టీస్ ప్రశ్నలు

జంతువుల కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని జంతుశాస్త్రం లేదా జూవాలాజీ అంటారు. అరిస్టాటిల్'ను జంతుశాస్త్ర పితామహుడిగా భావిస్తారు. జంతుశాస్త్రంలో ప్రధానంగా యానిమలియా రాజ్యం యొక్క జీవుల కోసం అధ్యయనం చేస్తారు. వీటిని వెన్నెముక (పృష్ఠవంశం) ఆధారంగా అకశేరుకాలు మరియు సకశేరుకాలుగా విభజించారు.

Advertisement

అకశేరుకాలలో తిరిగి 10 జంతు వర్గాలు ఉన్నాయి. అవి ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంటెరాటా, ప్లాటిహెల్మింథెస్. నెమటోడా, అనెలిడా, ఆర్థ్రోపోడ, మొలస్కా, ఇఖైనోడెర్మాటా, హేమీకార్డేటా. సకశేరుకాలలో తిరిగి 7 జంతు వర్గాలు ఉన్నాయి. అవి ప్రోటోకార్డేటా, సైక్లో స్టోమేటా, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. వీటికి సంబంధించి వివిధ రకాల ప్రాక్టీస్ ప్రశ్నలను ప్రయత్నించండి.

1. ఈ క్రింది వాటిలో ఏసీలోమేట్ జీవులు ఏవి ?

  1. టేప్‌వార్మ్‌లు & లివర్ ఫ్లూక్
  2. అస్కారియాసిస్ & ట్రిచురియాసిస్
  3. వానపాములు & జలగలు
  4. సెంటిపెడెస్ &మిల్లిపెడెస్
సమాధానం
1. టేప్‌వార్మ్‌లు & లివర్ ఫ్లూక్

2. ఈ క్రింది వాటిలో సూడోసీలోమేట్ జీవులు ఏవి ?

  1. టేప్‌వార్మ్‌లు & లివర్ ఫ్లూక్
  2. అస్కారియాసిస్ & ట్రిచురియాసిస్
  3. వానపాములు & జలగలు
  4. సెంటిపెడెస్ &మిల్లిపెడెస్
సమాధానం
2. అస్కారియాసిస్ & ట్రిచురియాసిస్

3. బ్లాస్టోఫోర్ నోరుగా మార్పు చెందే జీవులను ఏమంటారు ?

  1. హెటెరోట్రోఫ్
  2. ఆటోట్రోప్
  3. ప్రోటిరోస్టోమ్
  4. డ్యూటిరోస్టోమ్
సమాధానం
3. ప్రోటిరోస్టోమ్

4. కింది వాటిలో డ్యూటిరోస్టోమ్ జీవులను గుర్తించండి ?

  1.  ప్లాటిహెల్మింథెస్
  2. అనెలిడా
  3. మొలస్కా
  4. ఇఖైనోడెర్మాటా
సమాధానం
4. ఇఖైనోడెర్మాటా

5. కింది వాటిలో ఫోటోజోవాకు సంబంధించి నిజం కానిది ఏది ?

  1.  ఏక కణ యూకారియాటిక్ జీవులు
  2. ఈ జీవులు గమనం కోసం కశాభాలు, శైలికలు, మిథ్యాపాదాలు కలిగి ఉంటాయి
  3. ద్రవాభిసరణ ద్వారా విసర్జన క్రియ జరుపుకుంటాయి
  4. ఫోటోజోవాలలో పరాన్నజీవులు లేవు
సమాధానం
4. ఫోటోజోవాలలో పరాన్నజీవులు లేవు

6. కింది వాటిలో కైటిన్ నిర్మిత తొడుగు కలిగిన జీవులు ఏవి ?

  1. డయాటమ్‌లు
  2. క్రస్టేసియన్లు
  3. సెఫలోపాడ్స్
  4. మిరియాపోడ్స్
సమాధానం
1. డయాటమ్‌లు

7. ఆహారనాళంలో రాడ్యులా అనే ప్రత్యేక అవయవం కలిగిన జీవులు ఏవి ?

  1.  ప్లాటిహెల్మింథెస్
  2. అనెలిడా
  3. మొలస్కా
  4. ఇఖైనోడెర్మాటా
సమాధానం
3. మొలస్కా

8. ఆస్ఫ్రాడియం జ్ఞానాంగం కనిపించే జీవులు ఏవి ?

  1. ప్లాటిహెల్మింథెస్
  2. అనెలిడా
  3. మొలస్కా
  4. ఇఖైనోడెర్మాటా
సమాధానం
3. మొలస్కా

9. అస్కోనాయిడ్, సైకోనాయిడ్, ల్యుకోనాయిడ్ ఏ వర్గానికి చెందిన జీవులు ?

  1. ప్లాటిహెల్మింథెస్
  2. అనెలిడా
  3. మొలస్కా
  4. పోరిఫెరా
సమాధానం
4. పోరిఫెరా

10. క్రింది వాటిలో నిడోబ్లాస్ట్‌లు కలిగిన జీవులు ఏవి ?

  1. ప్లాటిహెల్మింథెస్
  2. అనెలిడా
  3. నెమటోడా
  4. పోరిఫెరా
సమాధానం
3. నెమటోడా

11. క్రింది వాటిలో కోనోసైట్లు కలిగిన జీవులు ఏవి ?

  1. ప్లాటిహెల్మింథెస్
  2. అనెలిడా
  3. నెమటోడా
  4. పోరిఫెరా
సమాధానం
4. పోరిఫెరా

12. క్రింది వాటిలో స్పాంజ్‌లలో గుర్తించేవి ఏవి ?

  1. మెసోగ్లియా
  2. నాడీకణాలు
  3. ప్రోటీన్ కణ కవచం
  4. కంటకాలు
సమాధానం
4. కంటకాలు

13. కింది వాటిలో మెడుసా స్టేజ్ లేనిది ఏది ?

  1. హైడ్రా
  2. జెల్లీఫిష్
  3. కోరల్స్
  4. ఒబెలియా
సమాధానం
1. హైడ్రా

14. ఒబెలియా జీవితచక్రంలో కనిపించే ఒక దశ ?

  1. రూపాంతరం
  2. నియోటెనీ
  3. మెటాజెనిసిస్
  4. పైవి అన్నీ
సమాధానం
3. మెటాజెనిసిస్

15. నియోటెనీ పదానికి సరైన వాక్యాన్ని గుర్తించండి ?

  1. లైంగిక మరియు అలైంగిక దశలను ప్రదర్శించడం
  2. వయోజన జంతువులో బాల్య లక్షణాలను నిలుపుకోవడం
  3. వయోజన జంతువులో పూర్తిరూపం మారిపోవడం
  4. పైవి అన్నీ
సమాధానం
2. వయోజన జంతువులో బాల్య లక్షణాలను నిలుపుకోవడం

16. నెఫ్రిడియా అనే విసర్జన అవయవాలు కలిగిన జీవులు ?

  1. ప్లాటిహెల్మింథెస్
  2. అనెలిడా
  3. నెమటోడా
  4. పోరిఫెరా
సమాధానం
2. అనెలిడా

17. మాల్పిజియన్ ట్యూబుల్స్ అనే విసర్జన అవయవాలు కలిగిన జీవులు ?

  1. ఆర్థోఫోడా
  2. అనెలిడా
  3. నెమటోడా
  4. పోరిఫెరా
సమాధానం
1. ఆర్థోఫోడా

18. రక్తంలో హేమోసైనిన్‌ వర్ణద్రవ్యం కలిగిన జీవులు ?

  1. పొరిపేర
  2. అనెలిడా
  3. నెమటోడా
  4. మొలస్కా
సమాధానం
4. మొలస్కా

19. రక్తంలో క్లోరోక్రూరిన్ వర్ణద్రవ్యం కలిగిన జీవులు ?

  1. ఆర్థోఫోడా
  2. అనెలిడా
  3. నెమటోడా
  4. మొలస్కా
సమాధానం
2. అనెలిడా

20. క్రింది వాటిలో రక్తంలో హీమోఎరిత్రిన్ వర్ణద్రవ్యం కలిగిన జీవులు ?

  1. బ్రాచియోపాడ్స్
  2. సిపున్‌కులిడ్‌లు
  3. హైడ్రా
  4. 1 మరియు 2
సమాధానం
4. 1 మరియు 2

21. హైడ్రా జీవికి సంబంధించి నిజం కానిది ఏది ?

  1. స్థూపాకార, రేడియల్ సౌష్టవ శరీరాన్ని కలిగి ఉంటుంది
  2. నిడారియా వర్గంలో హైడ్రోజోవా తరగతికి చెందినది
  3. హైడ్రా సకశేరుక మంచినీటి & సముద్ర జీవి
  4. హైడ్రా తన శరీరం భాగాలను పునరుత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది
సమాధానం
3. హైడ్రా సకశేరుక మంచినీటి & సముద్ర జీవి

22. ఆక్టోపస్ & జెల్లీ ఫిష్ సంబంధించి నిజం కానిది ఏది ?

  1. ఆక్టోపస్ మొలస్కాకు వర్గానికి చెందిన జీవి
  2. ఆక్టోపస్ & జెల్లీఫిష్ నిడారియా వర్గానికి చెందిన జీవులు
  3. జెల్లీఫిష్ టెంటకిల్స్‌పై స్టింగింగ్ నెమటోసిస్ట్‌ కలిగి ఉంటుంది.
  4. ఆక్టోపస్ సెఫలోపాడ్స్ తరగతికి చెందిన జీవి
సమాధానం
2. ఆక్టోపస్ & జెల్లీఫిష్ నిడారియా వర్గానికి చెందిన జీవులు

23. క్రింది వాటిలో అనెలిడా వర్గానికి సంబంధించి నిజం కానిది ?

  1. నెఫ్రిడియా అనే విసర్జన అవయవాలు కలిగి ఉంటాయి
  2. అనెలిడా జీవులు మెటామెరిజం శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి
  3. అనెలిడా జీవులకు ఊపిరితిత్తులు లేవు
  4. అనెలిడా జీవులు కాల్షియం కార్బోనేట్ తొడుగును కలిగి ఉంటాయి
సమాధానం
4. అనెలిడా జీవులు కాల్షియం కార్బోనేట్ తొడుగును కలిగి ఉంటాయి

24. పక్షులకు సంబంధించి కింది వాటిలో నిజం కానిది ఏది ?

  1. పక్షుల కాళ్లపై ఎపిడెర్మల్ స్కేల్స్ ఉంటాయి
  2. పక్షులు ఎండోథెర్మిక్ జీవులు
  3. పక్షులు నాలుగు గదుల గుండెను కలిగి ఉంటాయి
  4. పక్షులు సోడియం క్లోరైడ్ కవచంతో గుడ్లు పెడతాయి
సమాధానం
4. పక్షులు సోడియం క్లోరైడ్ కవచంతో గుడ్లు పెడతాయి

25. సరీసృపాలు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?

  1. సరీసృపాలు మూడు-గదుల హృదయాలను కలిగి ఉంటాయి.
  2. సరీసృపాలలో విసర్జక వ్యవస్థ లేదు
  3. సరీసృపాలు పొలుసులు, అస్థి పలకలతో కూడిన శరీరాన్ని కలిగి ఉంటాయి
  4.  1 మరియు 3 మాత్రమే సరైనవి
సమాధానం
4. 1 మరియు 3 మాత్రమే సరైనవి

26. ఇఖైనోడెర్మాటా సంబంధించి నిజం కానిది ఏది ?

  1. ఇఖైనోడెర్మాటా జీవులు 2 గదుల గుండెను కలిగి ఉంటాయి.
  2. రేడియల్‌గా అమర్చబడిన, పెంటామెరస్ శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటాయి
  3. ట్రిప్లోబ్లాస్టిక్ మరియు సీఈలోమిక్ కుహరం కలిగి ఉంటాయి
  4. అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్‌తో రూపొందించబడి ఉంటుంది.
సమాధానం
1. ఇఖైనోడెర్మాటా జీవులు 2 గదుల గుండెను కలిగి ఉంటాయి

27. సెఫాలోకార్డేట సంబంధించి నిజం కానిది ?

  1. ప్రోటోనెఫ్రిడియా విసర్జక అవయవాలు కలిగి ఉంటాయి
  2. వీటిని సాధారణంగా లాన్స్‌లెట్స్ అంటారు
  3. సెఫాలోకార్డేట్‌లు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి
  4. సెఫాలోకార్డేట్‌లు అకశేరుక డ్యూటిరోస్టోములు
సమాధానం
4. సెఫాలోకార్డేట్‌లు అకశేరుక డ్యూటిరోస్టోములు

28. ఉభయచరాలకు సంబంధించి నిజం కానిది ఏది ?

  1. ఉభయచరాలు లార్వా మరియు వయోజన దశలను కలిగి ఉంటాయి
  2. ఉభయచరాలు ఎక్టోథెర్మిక్ జంతువులు
  3. ఉభయచరల జీవిత చక్రంలో టాడ్‌పోల్ లార్వా దశ ఉంటుంది
  4. ఉభయచరాలు 4 గదుల గుండెను కలిగి ఉంటాయి
సమాధానం
4. మొలస్కా

29. టాడ్‌పోల్ మరియు చేపల మధ్య ఉండే ఒక సాధారణ లక్షణం ?

  1. పొలుసులు
  2. లాటరల్ లైన్ ఆర్గాన్ (పార్శ్వ రేఖ)
  3. మొప్పలు
  4. 2 మరియు 3
సమాధానం
4. 2 మరియు 3

30. క్రింది వాటిలో సరైన జతను ఎంపిక చేయండి ?

  1. సూడోసీలోమేట్ - అస్కారియాసిస్
  2. మొలస్కా - డ్యూటిరోస్టోమ్
  3. ఇఖైనోడెర్మాటా - రాడ్యులా
  4. పోరిఫెరా - నిడోబ్లాస్ట్‌లు
సమాధానం
1. సూడోసీలోమేట్ - అస్కారియాసిస్

Advertisement

Post Comment