ఏటా విస్తరిస్తున్న వినోదరంగ అభివృద్ధి చూసి ఈ తరం యువతలో సంగీతం, నృత్యం వంటి కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంగీతం, నృత్య కోర్సులు, వాటిని అందించే యూనివర్సిటీల కోసం వెతికే వారి సంఖ్యా కూడా పెరుగుతుంది. వినోధ రంగంలో స్థిరపడాలనే కోరిక, పాపులర్ అవ్వాలనే ఆకాంక్షను నెరవేర్చే ఈ సంగీత, నృత్య కోర్సుల గూర్చి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సంగీతం, నృత్యం అనేవి ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగాలు. కళని, సంస్కృతిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. మన పూర్వీకుల జీవన విధానంలో కళ ఒక భాగంగా ఉండేది. ఈ తరం వాటికి దూరమైనా, వాటిని ఆస్వాదించడంలో ముందుంటున్నారు. కళలు జీవన ఉపాధి కోసం మాత్రమే కాదు, వ్యక్తత్వ నిర్మాణానికి కూడా దోహదపడతాయి.
ఈనాటి ఆధునిక తరం, ఉరుకుల పరుగుల జీవన విధానంలో ఉక్కిరిబిక్కిరైయి, వ్యక్తిగతంగా తమని తాము కోల్పోతున్నారు. ప్రతి వ్యక్తికి రెండు వ్యాపకాలు ఉండాలి అంటారు. అందులో ఒకటి ఉపాధి కల్పించేది అయితే, మరొకటి వినోదాన్ని అందించేది. ఈ రెండో జాబితాలో కళలకు చోటు కల్పించాలి. వినోదానికి మించిన ఆసక్తి కళపై ఉంటె, వాటిని ఉపాధి వ్యాపకంగా మార్చుకోవాలి.
సంగీతం & నృత్య కోర్సుల సమాచారం
-
సంగీతం & నృత్య కోర్సులు
-
ఏపీలో సంగీతం & నృత్య కోర్సులు & యూనివర్సిటీలు
-
తెలంగాణాలో సంగీతం & నృత్య కోర్సులు & యూనివర్సిటీలు
-
సంగీతం & నృత్య కోర్సుల కెరీర్ అవకాశాలు
సంగీతం & నృత్య కోర్సులు
సంగీతం, నృత్య కోర్సులు కొన్ని నెలలలో పూర్తియ్యే సర్టిఫికేటెడ్ కోర్సులతో సహా, రెండేళ్ల డిప్లొమా నుండి నాలుగేళ్ళ గ్రాడ్యుయేషన్ వరకు, ఎం.ఫిల్ నుండి పీహెచ్డీ స్థాయి వరకు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి ఆసక్తి, అభిరుచి మేరకు వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈ కోర్సులు కొన్ని పరిమిత యూనివర్సిటీలు యందు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
సంగీతం, నృత్యం అంశాలలో గ్రాడ్యూయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ చేయాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్ అర్హుతలో ఇటువైపు కెరీర్ నిర్మించుకోవచ్చు. డిప్లొమా కోర్సులలో చేరేందుకు కనీసం టెన్త్ లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇతర సర్టిఫికేటెడ్ కోర్సులు చేసేందుకు కనీసం 5 నుండి 8వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
భారతీయ సంగీతం
భారతీయ సంగీతంను శాస్త్రీయ మరియు జానపద సంగీతంగా విభజిస్తారు. శాస్త్రీయ సంగీతం తిరిగి కర్ణాటక, హిందుస్థానీ సంగీతంగా విభజించబడి ఉంది. కర్ణాటక సంగీతంను దక్షిణ భారత దేశ సంగీతంగా, హిందుస్థానీ సంగీతంను ఉత్తర భారత దేశ సంగీతంగా భావిస్తారు.
కర్ణాటక సంగీతంలో గాత్రం మాత్రమే కాకుండా వీణ, వేణువు, వయోలిన్, మృదంగం, నాదస్వరం మొదలైన వాయిద్యాలు ఉపయోగిస్తారు. హిందుస్థానీ సంగీతంలో సితార్, తబలా, సారంగి, హార్మోనియం, బీన్ వంటి వాయిద్యాలు ఉపయోగిస్తారు.
భారతీయ నృత్యం
భారతీయ శాస్త్రీయ నృత్యం మూడు ప్రాథమిక భాగాలుగా విభజించబడి ఉంది. అవి నృత్త నాట్య నృత్య. భారతీయ శాస్త్రీయ నృత్యం అనేది మతపరమైన హిందూ సంగీత, నృత్య వేదికల్లో ప్రదర్శించే ఒక కళ. పండితుడిని బట్టి ఎనిమిది శాస్త్రీయ నృత్యలను సంగీత నాటక అకాడమీ గుర్తించింది.
భారతీయ శాస్త్రీయ నృత్యలలో ప్రధానంగా భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, సత్త్రియ, మణిపురి మరియు మోహినియాట్టంలను గుర్తిస్తారు. ఈ నృత్యాలు సాంప్రదాయకంగా ప్రాంతీయంగా విభిన్నత కలిగి ఉంటాయి. వీటి శైలి, దుస్తులు మరియు వ్యక్తీకరణలలో కూడా భిన్నత్వం ఉంటుంది.
ఏపీలో సంగీతం & నృత్య కోర్సులు & యూనివర్సిటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంగీతం మరియు నృత్యం కోర్సులను కొన్ని యూనివర్సిటీలు మాత్రమే అందిస్తున్నాయి. అందులో ఆంధ్ర యూనివర్సిటీ, మహారాజ సంగీత, నృత్య కళాశాల, శ్రీ పద్మావతి యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలు ఉన్నాయి.
ఆంధ్ర యూనివర్సిటీలో సంగీతం & నృత్య కోర్సులు
ఆంధ్ర యూనివర్సిటీ 1989 నుండి ఎంఏ మ్యూజిక్ కోర్సును అందిస్తుంది. 2004లో డాన్స్ కోర్సును ప్రవేశపెట్టింది. 2014లో సంగీతం & నృత్య కోర్సులను విలీనం చేసారు. అదేవిధంగా వీటికోసం ప్రత్యేకంగా సంగీతం & నృత్య విభాగం ఏర్పాటు చేసారు. ఈ డిప్లొమా కోర్సులు ఇంటర్మీడియట్ అర్హుతతో అడ్మిషన్ కల్పిస్తారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.
ప్రొ. ఎ. అనురాధ (మ్యూజిక్ డిపార్టుమెంట్ హెడ్ ) : 0891-2844393, head.music@andhrauniversity.edu.in
కోర్సు పేరు | సీట్ల సంఖ్యా | కోర్సు వ్యవధి |
---|---|---|
ఎంఏ సంగీతం | 10 | 2 ఏళ్ళు |
ఎంఏ డాన్స్ | 10 | 2 ఏళ్ళు |
ఎం.ఫిల్ (డాన్స్ & మ్యూజిక్) | - | - |
పీహెచ్డీ (డాన్స్ & మ్యూజిక్) | - | - |
డిప్లొమా ఇన్ కర్ణాటక సంగీత్ | - | 12 నెలలు |
డిప్లొమా ఇన్ డ్యాన్స్ (కూచిపూడి) | - | 12 నెలలు |
డిప్లొమా ఇన్ లైట్ మ్యూజిక్ | - | 12 నెలలు |
డిప్లొమా ఇన్ డివోషనల్ సాంగ్స్ | - | 12 నెలలు |
డిప్లొమా ఇన్ తాళవద్యస్ | - | 12 నెలలు |
సౌండ్ రికార్డింగ్ & ఎడిటింగులో సర్టిఫికెట్ కోర్సు | - | 12 నెలలు |
జానపద సంగీతం (పాటలు) | - | 30 రోజులు |
వాగ్గేయకారుల భక్తి గీతాలు | - | 90 రోజులు |
మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సంగీతం & నృత్య కోర్సులు
విజయనగరంలో ఉన్న మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల యందు సాంప్రదాయ సంగీత వాయిధ్యాలకు సంభందించి సర్టిఫికెట్ మరియు డిప్లొమా కోర్సులను అందిస్తుంది. డిప్లొమా కోర్సులలో చేరేందుకు సర్టిఫికెట్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. ప్రవేశాలు ఏటా జులై మొదటి వారంలో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం సంప్రదించండి ; ఫోన్ : 2008922-223751 ఇమెయిల్ : mrgcmdvzm@yahoo.com
కోర్సు పేరు | కోర్సు వివరాలు |
---|---|
డోలు | ఈ కోర్సులో చేరేందుకు 10 ఏళ్ళు పూర్తయి ఉండాలి విద్యార్థికి చదవడం & వ్రాయటం తెలిసి ఉండాలి ప్రవేశాలు ఏటా జులై మొదటి వారంలో నిర్వహిస్తారు |
మృదంగం | మృదంగం లో సర్టిఫికెట్ & డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి కోర్సులు ఏడాది & రెండేళ్ల నిడివితో అందిస్తారు. |
బొబ్బిలి వీణ | ఈ కోర్సు యందు గాత్రం, వీణ, వయోలిన్, నాదస్వరం, మృదంగం, డోలు మరియు భరతనాట్యం స్పెషలైజషన్స్ కలవు. కోర్సుల నిడివి రెండేళ్లు ఉంటాయి |
వయోలిన్ | వయోలిన్ యందు సర్టిఫికేటెడ్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. |
నట్టువాంగం | నట్టువాంగం పార్టుటైం & ఫుల్ టైమ్ కోర్సులుగా అందిస్తున్నారు. అభ్యర్థుల వీలు బట్టి ఉదయం లేదా సాయంత్రం లేదా రెండు పూట్ల తరగతులకు హాజరు కావొచ్చు. |
శ్రీ పద్మావతి యూనివర్సిటీ అందిస్తున్న సంగీత, నృత్య కోర్సులు
కోర్సు పేరు | కోర్సు వివరాలు |
---|---|
ఎంఏ మ్యూజిక్ (వీణ & గాత్రం) | కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 సెమిస్టర్లు బ్యాచిలర్/ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి అందుబాటులో ఉండే రెగ్యులర్ సీట్లు - 10 |
ఎం.ఏ భరతనాట్యం | కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 సెమిస్టర్లు బ్యాచిలర్/ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి అందుబాటులో ఉండే రెగ్యులర్ సీట్లు - 10 |
ఎంఏ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ | ఇంటిగ్రేటెడ్ డిగ్రీ - 4 ఏళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి అందుబాటులో ఉండే రెగ్యులర్ సీట్లు - 10 |
వోకల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్వీణ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ భరతనాట్యం సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూచిపూడి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ జానపద సంగీతంలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫౌండేషన్ కోర్సు ఇన్ కీర్తనలు ఫౌండేషన్ కోర్సు ఇన్ భరతనాట్యం ఫౌండేషన్ కోర్సు ఇన్ ఇన్‌స్ట్రుమెంట్స్ |
కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 సెమిస్టర్లు ఈ కోర్సులు ఈవెనింగ్ సమయంలో బోధిస్తారు ఒక సెమిస్టరుకు 50 గంటలు బోధిస్తారు |
పీహెచ్డీ | ఎథ్నోమ్యూజికాలజీ ప్రాక్టికల్ మ్యూజిక్ & డాన్స్ సంగీతం & నృత్య గ్రంథాలు ఎయిర్ మ్యూజిక్ టీవీ మ్యూజిక్ టీటీడీ - ఆలయ ఆచారా సంగీతం డిజిటల్ రికార్డింగ్ సిస్టమ్స్ కల్చరల్ టెంపుల్ డాన్స్ డ్యాన్స్ - క్లాసికల్, ఫోక్, థియేటర్, కాస్ట్యూమ్, లైటింగ్ మరియు డాక్యుమెంటేషన్ |
తెలంగాణలో సంగీతం & నృత్య కోర్సులు & యూనివర్సిటీలు
తెలంగాణ రాష్ట్రంలో సంగీతం మరియు నృత్యం కోర్సులను కొన్ని యూనివర్సిటీలు మాత్రమే అందిస్తున్నాయి. అందులో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, శ్రీ త్యాగరాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల మరియు విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు ఉన్నాయి.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సంగీతం మరియు నృత్యం కోర్సులు
కోర్సు పేరు | కోర్సు వివరాలు |
---|---|
ఎంఏ కర్ణాటక సంగీతం (మృదంగం, వయోలిన్, వీణ) | బీఏ కర్ణాటక సంగీతం పూర్తిచేసి ఉండాలి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 సెమిస్టర్లు కోర్సు సీట్లు - 40 |
ఎంపీఏ నృత్యం (కూచిపూడి & ఆంధ్ర నృత్యం) | బీఏ నృత్యం పూర్తిచేసి ఉండాలి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 సెమిస్టర్లు కోర్సు సీట్లు - 40 |
ఎంపీఏ జానపద కళలు | బీఏ జానపద కళలు పూర్తిచేసి ఉండాలి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 సెమిస్టర్లు కోర్సు సీట్లు - 70 |
ఎంపీఏ రంగస్థల కళలు | బీఏ రంగస్థల కళలు పూర్తిచేసి ఉండాలి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు - 4 సెమిస్టర్లు కోర్సు సీట్లు - 40 |
పీజీ డిప్లొమా ఇన్ భరతనాట్యం పీజీ డిప్లొమా ఇన్ కథక్ ఆంధ్ర నాట్యం & గొల్లకలాపం కూచిపూడి యక్షగానం రంగస్థల కళలు జానపద సంగీతం జానపద నృత్యం |
బ్యాచిలర్ డిగ్రీ & మ్యూజిక్ సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి కోర్సు వ్యవధి 12 నెలలు - 2 సెమిస్టర్లు ఒక్కో కోర్సు సీట్లు - 20 |
డిప్లొమా ఇన్ లలిత సంగీతం కూచిపూడి & ఆంధ్ర నాట్యం |
పది పాస్ అయ్యి ఉండాలి కోర్సు వ్యవధి 2 ఏళ్ళు 16 నుండి 60 ఏళ్ళ లోపు వారు అర్హులు ఒక్కో కోర్సు సీట్లు - 20 |
సర్టిఫికెట్ కోర్సు ఇన్ జానపద సంగీతం సర్టిఫికెట్ కోర్సు ఇన్ జానపద నృత్యం సర్టిఫికెట్ కోర్సు ఇన్ జానపద పద్యం |
చదవడం & వ్రాయడం వచ్చి ఉండాలి కోర్సు వ్యవధి 6 నెలలు ఒక్కో కోర్సు సీట్లు - 20 |
ఫౌండేషన్ కోర్సు ఇన్ కర్ణాటక సంగీతం భక్తి సంగీతం కూచిపూడి నృత్యం రామదాసు కీర్తనలు వాగ్దేయకారుల కీర్తనలు |
10 ఉత్తీర్ణత కోర్సు వ్యవధి 6 నెలలు ఇంగ్లీష్ & తెలుగు తెలిసి ఉండాలి ఒక్కో కోర్సు సీట్లు - 20 |
శ్రీ త్యాగరాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల మ్యూజిక్ కోర్సులు
వెబ్సైటు : www.stgcmd.com
సెర్టిఫికేటెడ్ కోర్సులు | డిప్లొమా కోర్సులు |
---|---|
వయస్సు పది ఏళ్ళు నిండి ఉండాలి ప్రవేశాలు ఏటా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు కోర్సు నిడివి 4 ఏళ్ళు ఏడాదికి కోర్సు ఫీజు - 1,100/- |
వయస్సు పది ఏళ్ళు నిండి ఉండాలి ప్రవేశాలు ఏటా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు కోర్సు నిడివి 2 ఏళ్ళు ఏడాదికి కోర్సు ఫీజు - 1,500/- |
కర్నాటిక్ ఓయోలిన్ కర్నాటిక్ వోకల్ వీణా ఫ్లూట్ మృదంగం సితార్ పేరిణి డాన్స్ హిందుస్తానీ వోకల్ హిందుస్తానీ వొయిలిన్ తబలా డోలు కథక్ కూచిపూడి భరతనాట్యం |
కర్నాటిక్ ఓయోలిన్ కర్నాటిక్ వోకల్ వీణా ఫ్లూట్ మృదంగం సితార్ పేరిణి డాన్స్ హిందుస్తానీ వోకల్ హిందుస్తానీ వొయిలిన్ తబలా డోలు కథక్ కూచిపూడి భరతనాట్యం |
శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల మ్యూజిక్ కోర్సులు
వెబ్సైటు : www.sancgcmd.com
సెర్టిఫికేటెడ్ కోర్సులు | డిప్లొమా కోర్సులు |
---|---|
వయస్సు పది ఏళ్ళు నిండి ఉండాలి ప్రవేశాలు ఏటా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు కోర్సు నిడివి 4 ఏళ్ళు |
వయస్సు పది ఏళ్ళు నిండి ఉండాలి ప్రవేశాలు ఏటా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు కోర్సు నిడివి 2 ఏళ్ళు |
కర్ణాటక గాత్రం హిందుస్తానీ గాత్రం కర్ణాటక వయోలిన్ మృదంగం తబలా కూచిపూడి నృత్యం పేరిణి నృత్యం |
కర్ణాటక గాత్రం హిందుస్తానీ గాత్రం కర్ణాటక వయోలిన్ మృదంగం తబలా కూచిపూడి నృత్యం పేరిణి నృత్యం |
శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల మ్యూజిక్ కోర్సులు
వెబ్సైటు : www.sbrgcmd.com
సెర్టిఫికేటెడ్ కోర్సులు | డిప్లొమా కోర్సులు |
---|---|
వయస్సు పది ఏళ్ళు నిండి ఉండాలి ప్రవేశాలు ఏటా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు కోర్సు నిడివి 4 ఏళ్ళు |
వయస్సు పది ఏళ్ళు నిండి ఉండాలి ప్రవేశాలు ఏటా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు కోర్సు నిడివి 2 ఏళ్ళు |
కర్ణాటక గాత్రం వీణా హిందుస్తానీ గాత్రం కర్ణాటక వయోలిన్ మృదంగం తబలా సితార్ కూచిపూడి నృత్యం భరతనాట్యం పేరిణి నృత్యం |
కర్ణాటక గాత్రం వీణా హిందుస్తానీ గాత్రం కర్ణాటక వయోలిన్ మృదంగం తబలా సితార్ కూచిపూడి నృత్యం భరతనాట్యం పేరిణి నృత్యం |
విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల మ్యూజిక్ కోర్సులు
వెబ్సైటు : www .vgcmdwgl.com
సెర్టిఫికేటెడ్ కోర్సులు | డిప్లొమా కోర్సులు |
---|---|
వయస్సు పది ఏళ్ళు నిండి ఉండాలి ప్రవేశాలు ఏటా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు కోర్సు నిడివి 4 ఏళ్ళు |
వయస్సు పది ఏళ్ళు నిండి ఉండాలి ప్రవేశాలు ఏటా జూన్ మొదటి వారంలో నిర్వహిస్తారు కోర్సు నిడివి 2 ఏళ్ళు |
కర్ణాటక గాత్రం వీణా హిందుస్తానీ గాత్రం కర్ణాటక వయోలిన్ మృదంగం సితార్ కూచిపూడి నృత్యం |
కర్ణాటక గాత్రం వీణా హిందుస్తానీ గాత్రం కర్ణాటక వయోలిన్ మృదంగం సితార్ కూచిపూడి నృత్యం |
సంగీతం & నృత్య కోర్సుల కెరీర్ అవకాశాలు
శాస్త్రీయ సంగీత & నృత్య కోర్సులను మెజారిటీ మంది వ్యక్తిగత అభిరుచి, ఆసక్తి మేరకు చేస్తున్నారు. అలా అని ఉపాధికి పనికిరావు అని కాదు. ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. నేర్చుకున్న విద్యను మరొకరికి నేర్పడం ద్వారా ఉపాధి పొందొచ్చు. లేదా వ్యక్తిగత ప్రదర్శనలు ద్వారా ఉపాధిని ఆశించవచ్చు. అదే విధంగా సంగీత, నృత్య యూనివర్సిటీల యందు అధ్యాపక ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. సంగీత, నాట్య అకాడమీల యందు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
శాస్త్రీయ సంగీత సంగీతం నేర్చుకున్న వారు వినోద రంగంలో గాయకులుగా ప్రయత్నించవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్లుగా రాణించవచ్చు. సంగీత కచేరీల ద్వారా ఉపాధి పొందొచ్చు. అలానే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వారు నాట్య ప్రదర్శనల ద్వారా ఉపాధి పొందొచ్చు. డాన్స్ మస్టర్లుగా, డాన్సర్లుగా ప్రయత్నించవచ్చు. అలానే నటులుగా, నాట్య కళాకారులుగా రాణించవచ్చు.