Advertisement
ఇండియన్ నేవీలో సెయిలర్ జాబ్స్ | AA & SSR  Recruitment
Career Guidance Career Options

ఇండియన్ నేవీలో సెయిలర్ జాబ్స్ | AA & SSR Recruitment

ఇండియన్ నేవీ సెయిలర్ రిక్రూట్‌మెంట్ ఏడాదికో ఒకేసారి తప్పక నిర్వహిస్తుంది. ఇండియన్ నౌకాదళంలో చెఫ్, స్టివార్డ్, హైజినిస్ట్, మ్యూజిషన్స్, టెక్నిషన్స్, అప్రెంటీస్, ఇంజనీర్, ఆఫీసర్, సఫాయివాలా, ఫైర్ ఇంజన్ డ్రైవర్, ఛార్జ్‌మెన్ వంటి పోస్టులను నేవి సెయిలర్స్ పేరున భర్తీచేస్తారు. ఈ నియామక ప్రక్రియ ఐదు రకాల పరీక్షల ద్వారా నిర్వహిస్తారు.

శాంతికి ప్రతిరూపమైన ధవళ వస్త్రాలను ధరించి దేశం కోసం సేవచేసే అవకాశం పొందేందుకు ఇదే మంచి అవకాశం. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్లో పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక ప్రక్రియ వ్రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎంప్లాయిమెంట్ న్యూస్ యందు మరియు స్థానిక వార్త పత్రికల ద్వారా విడుదల చేస్తారు.

ఇండియన్ నేవీ మెట్రిక్ రిక్రూట్ (MR)

భారతీయ నౌకాదళంలో చెఫ్,స్టివార్డ్, హైజినిస్ట్స్ పోస్టులను భర్తీచేసేందుకు నౌకదలం మెట్రిక్ రిక్రూట్ (MR) పరీక్షను నిర్వహిస్తుంది. పది తరగతి ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 17 నుండి 21 ఏళ్ళ లోపు వారు అర్హులు.

ఎంఆర్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫీజికల్ ఫిట్నెస్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజవంతమైన వారికి  ఐఎన్ఎస్ చిల్కాలో 14 వారల పాటు ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఇది విజయవంతంగా పూర్తిచేసిన వారికి దేశవ్యాప్తంగా ఉన్న నేవల్ యూనిట్స్ , షిప్స్ లలో ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు. రెండు దశలలో శిక్షణ పూర్తియ్యాక వారివారి స్పెషలైజేషన్స్ యందు విధులు నిర్వర్తిస్తారు.

  • చెఫ్: నౌకాదళానికి చెందిన షిప్స్, హోటల్స్ లో చెఫ్ గా విధులు నిర్వర్తిస్తారు.
  • స్టీవార్డ్:  వైటర్స్ గా, స్టోర్ కీపర్లు గా, ఫుడ్ సర్వర్ గా విధులు నిర్వర్తిస్తారు.
  • హైజినిస్ట్: వాష్ రూములు, వంటగదిలు, ఇతర పరిసరాలు శుబ్రపరిచే హైజినిస్టులుగా విధులు నిర్వర్తిస్తారు.

ఇండియన్ నేవీ ఆర్టిఫిషర్ అప్రెంటీస్

నౌకాదళంలో యాంత్రిక సమస్యలను చక్కదిద్దే సెయిలర్స్ ని ఆర్టిఫిషర్ అప్రెంటీస్ ద్వారా భర్తీచేస్తారు. స్టీమ్ పవర్ మిషనరీ, డీజిల్ మరియు గ్యాస్ టుర్బన్స్ ఇంకా ఇతర మిస్సైల్ సంబంధించే పనులు నిర్వహిస్తారు.

ఇంటర్ ఫిజిక్స్ తో కెమిస్ట్రీ, బయాలజీ  సైన్స్ లలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఈ సబ్జెక్టులో 60శాతం మార్కులు సాధించటం తప్పనిసరి . వయసు 17 నుండి 20 ఏళ్ళలోపు ఉండాలి.

ఆర్టిఫిషర్ అప్రెంటీస్లుగా ఎంపికైన వారికీ  ఫీజికల్ ఫిట్నెస్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజవంతమైన వారికి ఐఎన్ఎస్ చిల్కాలో 9 వారల పాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ప్రాథమిక శిక్షణ తర్వాత వివిధ నేవల్ యూనిట్స్ , షిప్స్ యందు ప్రొఫిషినల్ ట్రైనింగ్ ఇస్తారు.

ఇండియన్ నేవీ సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR)

నౌకాదళానికి చెందే రాడార్లు, సోనార్లు, క్షిపణులు, యుద్ధ ఆయుధాల ఆపరేటింగ్ వంటి  అనేక విధులు నిర్వర్తించే సెయిలర్స్ కోసం SSR పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ లో మాథ్స్, ఫిజిక్స్ తో పాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ లలో ఏదో ఒకటి చదివినవారు SSR పరీక్షకు అర్హులు. వయసు 17 నుండి 21 ఏళ్ళ లోపు ఉండాలి.

ఎంపికైన వారికీ  ఫీజికల్ ఫిట్నెస్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజవంతమైన వారికి INS చిల్కా లో 22 వారాల పాటు ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఆతర్వాత దేశవ్యాప్తంగా ఉన్న నేవెల్ యూనిట్స్, షిప్స్ లలో ప్రొఫిషినల్ ట్రైనింగ్ అందిస్తారు.

ఇండియన్ నేవీ మ్యూజిషియన్స్

నౌకాదళ మ్యూజిక్ టీంలలో, బ్యాండ్ గ్రూపులలో పని చేసేందుకు సంగీత వాయిద్యాలు వాయించే అనుభవం ఉన్నవారికి ఇండియన్ నేవీ అవకాశం కల్పిస్తుంది. పది పాసై 17 నుండి 25 ఏళ్ళ మధ్య ఉన్నవారు అర్హులు.

ఎంపికైన వారికీ  ఫీజికల్ ఫిట్నెస్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజవంతమైన వారికి INS చిల్కా లో 14 వారాల పాటు ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఇది పూర్తియ్యాక INS కుంజలిలో ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు.

ఇవన్నీ విజయవంతంగా పూర్తిచేసినవారు ఇండియన్ నేవీ మ్యూజిక్ బ్యాండ్ లో ఒక సభ్యుడుగా నేవీ కి సంబంధించే వేడుకలలో మ్యూజిషియన్ గా విధులు నిర్వర్తిస్తారు.

ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కోటా ఎంట్రీ

పది పాసై జాతీయ స్థాయి లో ఏదైనా క్రీడలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన వారికీ  ఫీజికల్ ఫిట్నెస్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజవంతమైన వారికి INS చిల్కా లో 14 వారాల పాటు ప్రాథమిక శిక్షణ అందిస్తారు.

ప్రాధమిక శిక్షణ పూర్తియ్యాక INS కుంజలిలో ప్రోఫిసినల్ ట్రైనింగ్ అందిస్తారు. ఎంపికైనా వారు నౌకాదళం తరుపున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా ఈవెంట్స్ లలో ప్రాతినిధ్యం వహిస్తారు.