Advertisement
నీట్ యూజీ 2023 : ఎగ్జామ్ తేదీ, ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్
Admissions NTA Exams

నీట్ యూజీ 2023 : ఎగ్జామ్ తేదీ, ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించే నీట్ యూజీ 2023 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి/ఏప్రిల్ నెలలలో చేపట్టనున్నట్లు తెలుస్తుంది. నీట్ పరీక్షను మే 7వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

నీట్ (యూజీ) అనగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేషన్) అని అర్ధం. నీట్ (యూజీ) పరీక్షను దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో మొదటి ఏడాది ఎంబీబీస్ మరియు బీడీఎస్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు గవర్నమెంట్ అఫ్ ఇండియా కనుసన్నలల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులు ఎయిమ్స్ మరియు జిప్మెర్ సహా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ లేదా డెంటల్ కౌన్సిల్ అనుమతితో నడుస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. కెరీర్ పరంగా వైద్యరంగంలో స్థిరపడాలనే ఆశయాన్ని చేరువ చేసే ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

నీట్ యూజీ 2023

Exam Name NEET (UG) 2023
Exam Type Entrance Exam
Admission For MBBS/BDS
Exam Date 07/05/2023
Exam Duration 3.20 Hours
Exam Level National Level

నీట్ యూజీ 2023 ఎలిజిబిలిటీ

  • అడ్మిషన్ సమయానికి  లేదా అడ్మిషన్ పొందే ఏడాది డిసెంబర్ 31వ తేదికి అభ్యర్థుల వయసు 17 ఏళ్ళు నిండి ఉండాలి. SC/ST/OBC/PWD అభ్యర్థులకు 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. ఈ అభ్యర్థుల గరిష్ట వయసు 25 ఏళ్లకు మించకూడదు.
  • 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సంబంధిత గ్రూపులతో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయిఉండాలి. SC/ST/OBC/PWD అభ్యర్థులకు 40 శాతం మార్కులు తప్పనిసరి.
  • విదేశాల్లో ఎంబీబీస్ పూర్తిచేసి ఇండియాలో ఉద్యోగం చేసేందుకు సిద్ధమయ్యే భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కూడా నీట్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి.
  • జనరల్ కేటగిరి విద్యార్థులు వరుసగా 9 ఏళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు గరిష్టంగా 15 ఏళ్లు హాజరవ్వొచ్చు.

నీట్ యూజీ 2023 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం 06 మార్చి 2023
దరఖాస్తు చివరి తేదీ 06 ఏప్రిల్ 2023
చేర్పులు మార్పులు 10 ఏప్రిల్ 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 01 మే 2023
పరీక్ష తేదీ 07 మే 2023
ఫలితాలు జూన్ 2023
కౌన్సిలింగ్ జులై 2023

నీట్ యూజీ 2023 దరఖాస్తు ఫీజు

నీట్ దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

  • జనరల్ కేటగిరి అభ్యర్థులు : 1700/-
  • ఓబీసీ కేటగిరి విద్యార్థులు : 1600/-
  • ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు మరియు ట్రాన్స్ జండర్లు : 1000/-
  • విదేశీయలకు - 9500/-

నీట్ యూజీ 2023 రిజిస్ట్రేషన్

నీట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. నీట్ చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దశలో అభ్యర్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. రెండవ దశలో పరీక్ష వివరాలు, ఎగ్జామ్ సెంటర్, మీడియం వంటి వివరాలు నింపాల్సి ఉంటుంది. చివరిగా ఎగ్జామ్ ఫీజు చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది.

ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో  మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా  చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో  ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

నీట్ యూజీ ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
గుంటూరు
నెల్లూరు
కర్నూలు
తిరుపతి
విజయవాడ
విశాఖపట్నం
హైదరాబాద్
కరీంనగర్
ఖమ్మం
రంగారెడ్డి
వరంగల్

నీట్ యూజీ ఎగ్జామ్ నమూనా

నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్ & పేపర్) విధానంలో నిర్వహించబడుతుంది. మూడు గంటల 20 నిముషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.

ఒకో సబ్జెక్టు నుండి రెండు సెక్షన్ వారీగా 50 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ A యందు 35 ప్రశ్నలు, సెక్షన్ B యందు 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ B లోని 15 ప్రశ్నలలో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.

ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.

మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ & జూవాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు పేరు ప్రశ్నల సంఖ్య మార్కులు
ఫిజిక్స్ సెక్షన్ A  : 35 ప్రశ్నలు 140 మార్కులు
సెక్షన్ B : 15 ప్రశ్నలు 40 మార్కులు
కెమిస్ట్రీ సెక్షన్ A  : 35 ప్రశ్నలు 140 మార్కులు
సెక్షన్ B : 15 ప్రశ్నలు 40 మార్కులు
బోటనీ సెక్షన్ A : 35 ప్రశ్నలు 140 మార్కులు
సెక్షన్ B  : 15 ప్రశ్నలు 40 మార్కులు
జూవాలాజీ సెక్షన్ A  : 35 ప్రశ్నలు 140 మార్కులు
సెక్షన్ B : 15 ప్రశ్నలు 40 మార్కులు
మొత్తం 180 ప్రశ్నలు 720 మార్కులు
పరీక్ష సమయం 3 గంటలు (మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.20 గంటల వరకు)

నీట్ యూజీ అడ్మిషన్ విధానం

నీట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేసి ఆల్ ఇండియా వారీగా ర్యాంకులు విడుదల చేస్తారు. అడ్మిషన్ సమయంలో కేటగిరి వారి రిజర్వేషన్ వాటా ప్రకారం సీట్లు భర్తీచేస్తారు. 15% ఆల్ ఇండియా కోటా కింద గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల శాతం కింది విదంగా ఉంటుంది.

  • ఎస్సీ లకు 15 శాతం సీట్లు
  • ఎస్టీ లకు 7.5 శాతం సీట్లు
  • ఓబీసీ లకు 27 శాతం సీట్లు
  • వికలాంగుల కోటాలో 5 శాతం సీట్లు

సెంట్రల్ యూనివర్సిటీలు, డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు లలో ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ నియమాల అనుసారం కేటగిర్ల వారీగా, ఇనిస్టిట్యూట్ల వారీగా, ప్రాంతీయత ఆదరంగా సీట్లు భర్తీచేస్తారు.

నీట్ యూజీ ముఖ్యమైన వెబ్‌సైట్లు

Post Comment