పీఎం యువ 2.0 యోజన : రైటర్స్ యువ మెంటరింగ్ స్కీమ్
Skill development schemes

పీఎం యువ 2.0 యోజన : రైటర్స్ యువ మెంటరింగ్ స్కీమ్

యువ రచయితలను ప్రోత్సాహం అందించేందుకు పీఎం యువ 2.0 యోజన ప్రారంభించబడింది. పీఎం యువ : రైటర్స్ యువ మెంటరింగ్ పేరుతొ అందిస్తున్న ఈ పథకాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న యువ రచయితలకు వర్ధమాన భారత యువ రచయితలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ మెంటార్‌షిప్‌ నిడివి 6నెలలు ఉంటుంది.

Advertisement

దేశంలో చదవడం, రాయడం మరియు పుస్తక సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఇతర ఉద్యోగ ఎంపికలతో సమానంగా పఠనం మరియు రచయితత్వాన్ని కూడా ఒక వృత్తిగా తీర్చదిద్దడానికి ఈ పథకాన్ని అభివృద్ధి పరిచారు. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద పుస్తక ప్రచురణకర్తగా ఉంది. ఈ పథకం జాతీయ మరియు అంతర్జాతీయ పుస్తక ప్రియుల కోసం కొత్త తరం రచయితలను అందించనుంది. తద్వారా భారతీయ ప్రచురణ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని అందివ్వనుంది.

ఈ పథకం ద్వారా యువ రచయితలకు సాహిత్య ఉత్సవాలు, బుక్ ఫెయిర్స్ వర్చువల్ బుక్ ఫెయిర్, కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు వంటి మొదలైన అంతర్జాతీయ ఈవెంట్‌ల ద్వారా వారి అవగాహన పరిధిని, వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాలు కల్పిస్తారు. బుక్ పబ్లిషింగ్ ఎకో-సిస్టమ్ యొక్క అన్ని రకాల అంశాలపై అవగాహన కల్పిస్తారు.

పీఎం యువ 2.0 యొక్క ముఖ్య లక్షణాలు

  • పీఎం యువ 2.0 యొక్క థీమ్ - ప్రజాస్వామ్యం (సంస్థలు, సంఘటనలు, వ్యక్తులు, రాజ్యాంగ విలువలు, వర్తమానం, భవిష్యత్తు).
  • యువ రచయతల ఎంపిక కోసం ఆల్ ఇండియా స్థాయిలో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తారు.
  • మెంటర్‌షిప్ స్కీమ్ కింద ఎంపిక అయ్యేందుకు పోటీదారులు పదివేల పదాలలో మాన్యుస్క్రిప్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
  • ఇంగ్లీష్ భాషతో పాటుగా 22 షెడ్యూల్ భాషల్లో దేని నుండైన ఈ మాన్యుస్క్రిప్ట్‌ను సమర్పించవచ్చు.
  • నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బిటి) ఏర్పాటు చేసిన కమిటీ ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది.
  • ఈ పథకం కింద ఏటా 75 మంది యువ రచయతలను ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థుల కోసం నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా రెండు వారాల రైటర్స్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది.
  • ఎంపికైన యువ రచయితల యొక్క పుస్తకాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చేందుకు మార్గదర్శకాలను నియమిస్తారు.
  • శిక్షణ మరియు మెంటర్‌షిప్ ముగింపులో ఏకీకృత స్కాలర్‌షిప్ పథకం కింద ప్రతి రచయితకు ఆరు నెలల కాలానికి, నెలకు 50,000 చెప్పున 3 లక్షలు చెల్లించబడుతుంది.
  • మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ముగింపులో విజయవంతమైన ప్రచురణలపై రచయితలకు 10% రాయల్టీ చెల్లించబడుతుంది.

పీఎం యువ 2.0 షెడ్యూల్

  • పథకం ప్రారంభ తేదీ : 2 అక్టోబర్ 2022
  • రిజిస్ట్రేషన్ వ్యవధి : 2 అక్టోబర్ నుండి 15 జనవరి 2023
  • ఎంపిక ప్రక్రియ : 16 జనవరి 2023 నుండి 31 మార్చి 2023
  • జాతీయ జ్యూరీ సమావేశం : ఏప్రిల్ 2023
  • ఎంపికైన రచయితల పేర్లు విడుదల : మే 2023
  • మెంటర్‌షిప్ వ్యవధి : 1 జూన్ 2023 నుండి - 30 నవంబర్ 2023
  • మొదటి సెట్ పుస్తకాల ప్రచురణ : 1 ఫిబ్రవరి 2024

పీఎం యువ యోజన యొక్క ముఖ్య లక్షణాలు

పీఎం యువ యోజన అనేది భారత ప్రభుత్వం యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ ప్రాయోజిత పథకం. ఇది పథకం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా అమలు చేయబడుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ కోసం అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడంతో పాటుగా వారి వ్యాపార అభివృద్ధి కోసం సరైన రీతిలో ఆర్థిక, సాంకేతిక సదుపాయాల్ని కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.

2016 లో ప్రారంభించిన ఈ పథకం గత ఐదేళ్లలో దేశంలో ఉన్న దాదాపు 3050 ఇనిస్టిట్యూట్‌ల ద్వారా 7 లక్షలకు పైగా విద్యార్థులకు వ్యవస్థాపక విద్య మరియు శిక్షణను అందించింది. శిక్షణ తర్వాత బిజినెస్ ప్రారంభించేందుకు, దాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే ఆర్థిక మరియు సాంకేతిక అవసరాలను సమకూర్చుతుంది.

పీఎం యువ యోజన వివరాలు

  • లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS) ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ సంబంధించి ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు (MOOC) అందుబాటులో ఉంచుతుంది.
  • దేశంలోని యువత తమ సొంత సంస్థలను స్థాపించడానికి మరియు స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేందుకు ప్రోత్సహిస్తుంది.
  • ప్రధాన మంత్రి యువ యోజన కింద, అన్ని వర్గాల విద్యార్థులకు శిక్షణ అందించబడుతుంది.
  • ప్రపంచ స్థాయి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లను అందించడానికి ప్రభుత్వం మొత్తం 3050 ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లను అందుబాటులో ఉంచింది. వీటితో పాటుగా యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రీమియర్ ఇనిస్టిట్యూట్లు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, 300 సీనియర్ మరియు హయ్యర్ సెకండరీ స్కూల్స్, 500 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు (ITI లు) మరియు 50 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్లు (EDC లు) సైకాహన అందిస్తున్నాయి.
  • పీర్ -టు -పీర్ నెట్‌వర్కింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూట్లు మరియు లీగల్, అకౌంటింగ్, ఇతర టెక్నాలజీ అంశాలకు సంబంధించి ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్" ను సృష్టించబడింది.
  • యువ పారిశ్రామికవేత్తల కోసం నేషనల్ మెంటర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసారు. వీటిలో ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు మరియు క్రెడిట్ ఏజెన్సీలు భాగంగా ఉండనున్నాయి.
  • అన్ని స్థాయిలలో వ్యవస్థాపక కార్యక్రమాలను సమన్వయం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి అవసరమయ్యే ప్రాంతీయ, నోడల్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హబ్‌లను అందుబాటులో ఉంచారు.
  • వ్యవస్థాపకులు, శిక్షణా సంస్థలు (ప్రాజెక్ట్ సంస్థలు), అధ్యాపకులు, విద్యార్థుల ఫలితాలను ట్రాక్ చేసే క్లౌడ్ ఆధారిత సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసారు.
  • ఈ ప్రోగ్రాం పూర్తిచేసిన వారికీ నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ (NIESBUD) ద్వారా భాగస్వామ్య ధృవీకరణ పత్రం అందించబడుతుంది.

Advertisement

One Comment

Post Comment