తెలంగాణ 10th టైమ్ టేబుల్ 2023 | ఏప్రిల్ 3 నుండి పరీక్షలు
Telangana

తెలంగాణ 10th టైమ్ టేబుల్ 2023 | ఏప్రిల్ 3 నుండి పరీక్షలు

తెలంగాణ టెన్త్ క్లాస్ 2023 పరీక్షల టైమ్ టేబుల్ వెలువడింది. పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 03 నుండి ఏప్రిల్ 13 మధ్య నిర్వహిస్తున్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.30 మధ్య జరుగనున్నాయి. కోవిడ్ కారణంగా గత మూడేళ్ళలో కుదింపు సిలబసుతో నిర్వహించిన పరీక్షలను, ఈ ఏడాది పూర్తి సిలబసుతో జరుపుతున్నారు.

ఈ ఏడాది తెలంగాణ టెన్త్ పరీక్షలలో నూతన మార్పులు తీసుకొచ్చారు. గతంలో మాదిరిగా 6 సబ్జెక్టులకు 11 పేపర్లుగా కాకుండా కేవలం ఆరు పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బయోలాజికల్  సైన్స్, ఫీజికల్ సైన్స్ సబ్జెక్టులను ఒకే పేపరుగా పరీక్ష జరుపుతున్నారు.

ఒక్కో పేపరుకు గరిష్టంగా 100 మార్కులు కేటాయించారు. ఇందులో 80 మార్కులు ప్రధాన రాత పరీక్షకు, మిగిలిన 20 మార్కులను ఫార్మేటివ్ అసైన్మెంటుకు కేటాయించారు. ప్రధాన పరీక్షల ప్రశ్న పత్రాలలో వ్యాసరూప ప్రశ్నల విభాగానికి 60 మార్కులు కేటాయించగా, పార్ట్ బి లో మిగతా 20 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ఇవ్వనున్నారు. పార్ట్ బి ప్రశ్నలను చివరి 30 నిముషాల్లో మాత్రమే పూర్తిచేయాల్సి ఉంటుంది.

బయోలాజికల్  సైన్స్, ఫీజికల్ సైన్స్ సబ్జెక్టుల సంబంధించి ఈ ఏడాది ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టు నుండి గరిష్టంగా 40 మార్కులకు ప్రశ్నలు ఇవ్వబడతయి. మిగతా పరీక్షకు గరిష్టంగా 3 గంటల సమయం కేటాయించగా, సైన్స్ పరీక్షకు 3 గంటల 20 నిముషాలు కేటాయిస్తున్నారు.

టీఎస్ ఎస్‌ఎస్‌సి టైమ్ టేబుల్ 2023

సబ్జెక్టు షెడ్యూల్ 2023
ఫస్ట్ లాంగ్వేజ్ & కాంపోజిట్ కోర్సు 03 ఏప్రిల్ 2023
సెకండ్ లాంగ్వేజ్ 04 ఏప్రిల్ 2023
ఇంగ్లీష్ 06 ఏప్రిల్ 2023
గణితం 08 ఏప్రిల్ 2023
సైన్స్ (ఫీజికల్  + బయాలజీ) 10 ఏప్రిల్ 2023
సోషల్ స్టడీస్ 11 ఏప్రిల్ 2023
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
(సంస్కృతం, అరబిక్)
12 ఏప్రిల్ 2023
OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II
(సంస్కృతం, అరబిక్)
13 ఏప్రిల్ 2023
ఒకేషనల్ కోర్సు (థియరీ)

Post Comment