క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ (CITS) అనేది క్రాఫ్ట్‌మెన్లకు ట్రైనింగ్ అందించే ఇన్‌స్ట్రక్టర్ల (వృత్తి బోధకుల) శిక్షణ కార్యక్రమం. ఇది క్రాఫ్ట్‌మెన్స్ ట్రైనింగ్ స్కీమ్ (CTS) కు అనుబంధంగా పనిచేస్తుంది. దీనిలో భాగంగా NTC / NAC / డిప్లొమా / డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు 27 ఇంజనీరింగ్ ట్రేడ్‌లు మరియు 9 నాన్-ఇంజనీరింగ్ ట్రేడ్‌లలో ఒక ఏడాది నిడివితో క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ శిక్షణ ఇవ్వబడుతోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ట్రేడ్ టెక్నాలజీ (టిటి), ఇంజనీరింగ్ టెక్నాలజీ (ఇటి) మరియు ట్రైనింగ్ మెథడాలజీ (టిఎమ్) వంటి వివిధ ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమకు అవసరమయ్యే నాణ్యమైన మానవ వనరులను అందించే వృత్తి బోధకులను తయారు చేస్తుంది.
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ ఎలిజిబిలిటీ & రిజిస్ట్రేషన్
- క్రాఫ్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం.
- మొత్తం సీటింగ్ సామర్థ్యం 7776 సీట్లు
- కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి లేదు.
- విద్యాసంవత్సరం ఆగస్టు లో ప్రారంభమవుతుంది.
- DGT HQ నిర్వహించే ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ జరుగుతుంది.
- సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సివిటి సర్టిఫికెట్ లేదా గుర్తింపు పొందిన టెక్నికల్ ఎడ్యుకేషన్/యూనివర్సిటీ లేదా సమానమైన డిప్లొమా/డిగ్రీ. ప్రభుత్వం/ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అభ్యర్థులు అర్హులు.
- శిక్షణ సమయంలో నిర్వహించే థియరీ మరియు ప్రాక్టికల్స్‌లో 60% మార్కులు తప్పనిసరి సాదించాలి.
- కోర్సు చివరిలో జరిగే తుది ట్రేడ్ టెస్ట్‌లో హాజరు కావడానికి కనీసం 80% హాజరు అవసరం.
- NCVT, న్యూఢిల్లీ నిర్వహించే నేషనల్ ట్రేడ్ టెస్ట్ ఏటా జూన్/జూలైలో ఉంటుంది.
- ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన ట్రైనీలకు NCVT నుండి ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ శిక్షణా సంస్థలు
- NSTI లు హైదరాబాద్ (విద్యా నగర్), హైదరాబాద్ (రామంతపూర్), ముంబై, చెన్నై, కోల్‌కతా, కాన్పూర్, లుధియానా, డెహ్రాడూన్, బెంగళూరు, చౌద్వార్, కాలికట్, హల్ద్వానీ, జోధ్‌పూర్ మరియు జంషెడ్‌పూర్.
- మహిళల NSTI లు నోయిడా, పానిపట్, ఇండోర్, జైపూర్, అలహాబాద్, తిరువనంతపురం, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, వడోదర, తురా, మొహాలీ, సిమ్లా, పాట్నా, అగర్తలా, తిరుచిరాపల్లి, హైదరాబాద్, గోవా మరియు జమ్మూ & కాశ్మీర్.
- ప్రభుత్వ ITOT లు : లక్నో (యుపి), తల్చేర్ (ఒరిస్సా), భోపాల్ (మధ్యప్రదేశ్), రోహ్‌తక్ (హర్యానా), దావంగెరె (కర్ణాటక) మరియు మాలవల్లి (కర్ణాటక).