Advertisement
ఐటీఐ బ్లెండెడ్ లెర్నింగ్ స్కీమ్ రిజిస్ట్రేషన్ మరియు ఎలిజిబిలిటీ
Skill development schemes

ఐటీఐ బ్లెండెడ్ లెర్నింగ్ స్కీమ్ రిజిస్ట్రేషన్ మరియు ఎలిజిబిలిటీ

ఐటీఐ విద్యార్థుల ట్రైనీ శిక్షణలో దృఢమైన అవగాహన మరియు అభ్యాసాన్ని మరింత ప్రభావవంతంగా, నైపుణ్యంగా చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT) తాజా పోకడలను అమలు చేస్తుంది. ఈ ఆలోచనలో భాగంగా కొత్తగా బ్లెండెడ్ లెర్నింగ్ స్కీం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ట్రైనీ మరియు ట్రైనర్లకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మరియు ముఖాముఖి శిక్షణా పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది.

ఇందులో భాగంగా ట్రైనీ మరియు ట్రైనర్లకు ఉత్తమ శిక్షణా పద్ధతులను అవలంబించడానికి, మొదటిగా అధిక డిమాండ్ ఉన్న ఆరు CTS ట్రేడ్‌లను ఎంపిక చేసుకుని బ్లెండెడ్ లెర్నింగ్ స్కీం అమలు చేస్తుంది. కోవిడ్ 19 వంటి సంక్షోభ సమయంలో విద్యా వ్యవస్థ మరోమారు సంక్షోభంలో చిక్కుకోకుండా బ్లెండెడ్ లెర్నింగ్ మెకానిజం ఉపయోగపడనుంది.

బ్లెండెడ్ లెర్నింగ్ సంబంధించి పూర్తి మెకానిజంను నేషనల్ ఇన్‌స్ట్రక్షనల్ మీడియా ఇన్స్టిట్యూట్ ( NIMI ) రూపొందింస్తుంది. NIMI రూపొందించిన బ్లెండెడ్ కంటెంట్ బ్లెండెడ్ మోడ్‌లో శిక్షణ అందించడానికి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కోల్‌కతాలోని సెంట్రల్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSTARI) రెండు రోజుల నిడివితో భారతదేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర డైరెక్టరేట్‌లు/NSTI లు/ITOT లు/ITI ల మాస్టర్ ట్రైనర్‌లకు TT- బ్లెండెడ్ లెర్నింగ్ కోర్సులను నిర్వహిస్తోంది.

కోర్సు షెడ్యూల్ సంబంధిత NSTI ల ద్వారా నమోదు చేసుకున్న శిక్షకులకు తెలియజేయబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు DGT, MSDE మరియు న్యూఢిల్లీ కోర్సులో జాయిన్ అయ్యేందుకు ఆహ్వానించబడతారు. నామినేటెడ్ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా కోర్సు రిజిస్ట్రేషన్ కోసం రూ .100/- చెల్లించి కోర్సు కోసం నమోదు చేసుకోవచ్చు.

ఈ ప్రోగ్రాంలో కవర్ చేయబడే అంశాలు

  • Introduction to Blended Learning
  • Online Assessment Tools
  • Learning Management System
  • Online Tools for Training
  • Demonstration of Bharat skills portal
  • Demonstration of Blended Learning modules of popular CTS trades.

బ్లెండెడ్ లెర్నింగ్ ద్వారా ప్రవేశపెట్టిన 6 ట్రేడ్స్

  • ఫిట్టర్
  • ఎలక్ట్రీషియన్
  • కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)
  • బేసిక్ కాస్మెటాలజీ
  • వెల్డర్
  • మెకానిక్ డీజిల్

Post Comment