Advertisement
టీఎస్ ఇంటర్ 2022 ఫలితాలు విడుదల | టీఎస్ ఇంటర్ ఫలితాలు తెలుసుకోండి
Telangana

టీఎస్ ఇంటర్ 2022 ఫలితాలు విడుదల | టీఎస్ ఇంటర్ ఫలితాలు తెలుసుకోండి

తెలంగాణ ఇంటర్మీడియట్ 2022 ఫలితాలు

తెలంగాణ ఇంటర్ మొదటి మరియు ద్వితీయ ఏడాది ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసారు. ఈ ఏడాది మే 6 నుండి 25 మధ్య జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సుమారు 9.07 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలకు 4,64,890 మంది హాజరవ్వగా 2,94,378 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ద్వితీయ ఏడాది పరీక్షలకు 4,42,768 హాజరవ్వగా 2,95,949 మంది ఉత్తీర్ణత పొందారు.

టీఎస్ ఇంటర్ 2022 ఫలితాలు

టీఎస్  ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2022

Link 1

Link 2

టీఎస్ ద్వితీయ ఏడాది ఫలితాలు 2022

Link 1

Link 2

టీఎస్ ఒకేషనల్ మొదటి ఏడాది ఫలితాలు

Link 1

Link 2

టీఎస్ ఒకేషనల్ ద్వితీయ ఏడాది ఫలితాలు

Link 1

Link 2

ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల్లో 63.32 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వగా, ద్వితీయ ఏడాదిలో 67.96 శాతం నమోదు అయ్యింది. మొదటి ఏడాదిలో 54.25 శాతం  బాలురులు ఉత్తీర్ణత పొందగా, 72.33 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు. అలానే ద్వితీయ ఏడాదిలో 60 శాతం బాలురులు పాస్ కాగా, 75.28 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాల వారిగా చూసుకుంటే మేడ్చల్ జిల్లా నుండి అత్యధికంగా 75 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అత్యల్పంగా మెదక్  జిల్లా నుండి 40 శాతం ఉత్తీర్ణత నమోదు కాబడింది. మొత్తంగా చూసుకుంటే ఇంటర్ మొదటి మరియు ద్వితీయ ఏడాదిలో బాలికలు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు.

రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్

రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం జూన్ 30 నుండి జులై 5 వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. అలానే ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను ఆగష్టు 1 నుండి నిర్వహించనున్నారు. ఫలితాలు ఆగష్టు నెలాఖరుకు విడుదల చేయనున్నారు.

ఇంటర్ మొదటి ఏడాది పరీక్షకు హాజరైన వారు 4,64,290
ఇంటర్ మొదటి ఏడాదిలో ఉత్తీర్ణత పొందినవారు 2,94,890
ఇంటర్ ద్వితీయ ఏడాది పరీక్షకు హాజరైన వారు 4,42,768
ఇంటర్ ద్వితీయ ఏడాదిలో ఉత్తీర్ణత పొందినవారు 2,95,949
మొదటి ఏడాది ఉత్తీర్ణత శాతం 63.32 శాతం
ద్వితీయ ఏడాది ఉత్తీర్ణత శాతం 67.96 శాతం
అత్యధిక ఉత్తీర్ణత సాధించిన జిల్లా మేడ్చల్ (75%)
అత్యల్ప ఉత్తీర్ణత సాధించిన జిల్లా మెదక్ (40%)
బాలికల ఉత్తీర్ణత శాతం
బాలురుల ఉత్తీర్ణత శాతం
మొదటి ఏడాది 72.33 శాతం
మొదటి ఏడాది 54.25 శాతం
బాలికల ఉత్తీర్ణత శాతం
బాలురుల ఉత్తీర్ణత శాతం
ద్వితీయ ఏడాది 75.86 శాతం
ద్వితీయ ఏడాది 60 శాతం

Post Comment