స్కిల్ లోన్ స్కీమ్ : టెక్నికల్ కోర్సులకు సంస్థాగత క్రెడిట్
Skill development schemes

స్కిల్ లోన్ స్కీమ్ : టెక్నికల్ కోర్సులకు సంస్థాగత క్రెడిట్

నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) పరిధిలో సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ వంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో చేరే విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించేందుకు 2015 కేంద్ర ప్రభుత్వం ఈ స్కిల్ లోన్ స్కీమ్ ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నైపుణ్యాభివృద్ధి కోర్సులలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు సంస్థాగత క్రెడిట్ (ఇనిస్టిట్యూషనల్ క్రెడిట్) అందిస్తారు.

Advertisement

ఈ రుణాలను నేరుగా విద్యార్థి అడ్మిషన్ పొందిన ఇనిస్టిట్యూట్లకు అందజేస్తారు. ఈ రుణాలను భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (IBA) లోని అన్ని సభ్య బ్యాంకుల ద్వారా మరియు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచించిన ఇతర బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించి నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ కంపెనీ (NCGTC) బ్యాంకులకు విస్తృత మార్గదర్శకాలను జారీచేసింది.

స్కిల్ లోన్ స్కీమ్ యొక్క ముఖ్య లక్షణాలు

  • ఈ పథకం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ (ఐటీఐలు), పాలిటెక్నిక్‌లు లేదా సెంట్రల్ లేదా స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్‌ల ద్వారా గుర్తింపు పొందిన పాఠశాలు, యూనివర్సిటీ అనుబంధం కళాశాలు, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ అనుబంధ శిక్షణ సంస్థలు మరియు సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్, స్టేట్ స్కిల్ మిషన్, స్టేట్ స్కిల్ కార్పొరేషన్ పరిధిలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.
  • పథకం నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ (NSQF) సంబంధిత కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది.
  • ఈ పథకం పరిధిలో 5వేల నుండి 1.5 లక్షల వరకు లోను అందిస్తారు.
  • కనీస కోర్సు వ్యవధి లేదు.
  • కోర్సు పూర్తీయ్యేవరకు మారటోరియం వర్తింపజేస్తారు.
  • లోను  మొత్తం ఆధారంగా తిరిగి చెల్లించే కాలం - 3 నుండి 7 సంవత్సరాల మధ్య ఉంటుంది.
  • 50,000 వరకు రుణాలు - కోర్సు పూర్తిఅయినా నుండి 3 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది.
  • 50,000 నుండి లక్ష లోపు రుణాలు - కోర్సు పూర్తిఅయినా నుండి 5 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది.
  • లక్ష దాటే రుణాలు - కోర్సు పూర్తిఅయినా నుండి 7 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది.
  • లోన్ కవరేజ్ - కోర్సు ఫీజు (నేరుగా శిక్షణా సంస్థకు) తో పాటు అసెస్‌మెంట్, పరీక్ష, స్టడీ మెటీరియల్ మొదలైనవి.
  • నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్ట్ కంపెనీ (NCGTC), విద్యార్థి తీసుకునే లోన్లకు 75శాతం వరకు బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తుంది.
  • ఈ పథకం సంబంధించి మరన్ని వివరాల కోసం మీ బ్యాంకు శాఖలకు సంప్రదించండి.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవెర్సెస్ బ్యాంకు
బ్యాంకు ఆఫ్ బరోడా సౌత్ ఇండియా బ్యాంకు 
బ్యాంకు ఆఫ్ ఇండియా  సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా 
కర్ణాటక బ్యాంకు  బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర 

Advertisement

Post Comment