యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ప్రిలిమినరీ నోటిఫికేషన్ వెలువడింది. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా మూడు రకాల అఖిల భారత సర్వీసులతో పాటుగా గ్రూపు A, గ్రూపు B కేటగిరికి సంబంధించి వివిధ సివిల్ సర్వీస్ అధికారులను నియమిస్తారు.
సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 నోటిఫికేషన్ ద్వారా సుమారు 1105 పోస్టులను భర్తీ చేసేందుకు యూపీఎస్‌సీ నోటిఫై చేసింది. సివిల్ సర్వెంట్ల నియామక ప్రక్రియ రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా చేపడతారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2023 షెడ్యూల్
నోటిఫికేషన్ నెంబర్ | 05/2023-CSP |
పోస్టుల సంఖ్యా | 1105 పోస్టులు |
దరఖాస్తు ప్రారంభం | 1 ఫిబ్రవరి 2023 |
దరఖాస్తు తుది గడువు | 21 ఫిబ్రవరి 2023 |
పరీక్ష ఫీజు | 100/- |
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ | 28 మే 2023 |
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మూడు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత పొందిన అభ్యర్థులకు రెండవ దశలో జరిగే సివిల్ సర్వీస్ మెయిన్ పరీక్షను జరుపుతారు. మెయిన్ పరీక్ష యందు మెరిట్ సాధించిన అభ్యర్థులను మూడవ దశలో వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు.
సివిల్ సర్వీసెస్ మెయిన్ మరియు ఇంటర్వ్యూ యందు సాధించిన ప్రతిభ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఏటా మే లేదా జూన్ నెలలో నిర్వహించి, ఆగస్టులో ఫలితాలు విడుదల చేస్తారు.
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించి డిసెంబర్ నెలలో ఫలితాలు విడుదల చేస్తారు. ఫిబ్రవరి, మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించి మే లో తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ పోస్టుల రకాలు
అఖిల భారత సివిల్ సర్వీసు పోస్టులు |
---|
|
కేంద్ర సివిల్ సర్వీసు పోస్టులు (గ్రూపు ఏ ) |
|
కేంద్ర సివిల్ సర్వీసు పోస్టులు (గ్రూపు బి) |
|
సివిల్ సర్వీస్ పరీక్ష ఎలిజిబిలిటీ
- జాతీయత: ఐఏఎస్, ఐపిఎస్ మరియు ఐఎఫ్ఎస్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు తప్పనిసరి భారతీయ పౌరులయి ఉండాలి.
- ఇతర సివిల్ సర్వీసు పోస్టులకు ఇండియా, నేపాల్, భూటాన్ పాటుగా 1962కు ముందు భారతదేశంకు వలస వచ్చిన టిబెటన్ అభ్యర్థులు కూడా అర్హులు.
- విద్య అర్హుత: సెంట్రల్, స్టేట్, డ్రీమ్డ్, కరెస్పాండన్స్, డిస్టెన్స్ మరియు ఓపెన్ యూనివర్సిటీలలో ఏదొక దాని నుండి అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- చివరి ఏడాది పరీక్ష ఉత్తీర్ణతయి ఇంటెర్షిప్ పూర్తిచేయని ఎంబిబిఎస్ విద్యార్థులు, అలానే చివరి ఏడాది పూర్తిచేసిన ఐసిఏఐ, ఐసిఎస్ఐ, ఐసిడబ్ల్యూఏఐ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులు. కాకుంటే ఇంటర్వ్యూ సమయంలో వీరంతా తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరవ్వాల్సి ఉంటుంది.
- వయోపరిమితి: దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు కేటగిరి వారీగా 3 నుండి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది.
- ప్రయత్నాల సంఖ్యా: జనరల్ కేటగిరి అభ్యర్థులు గరిష్టంగా 6 సార్లు సివిల్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు, ఓబీసీ అభ్యర్థులకు 9 ప్రయత్నాల వరకు అనుమతి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 37 ఏళ్ళ వయసు వరకు ఎటువంటి హాజరు పరిమితి లేదు.
సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఫీజు
కేటగిరి | ప్రిలిమినరీ ఫీజు | మెయిన్ ఎగ్జామ్ ఫీజు |
---|---|---|
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 100/- | 200/- |
ఎస్సి, ఎస్టి, మహిళలు, వికలాంగులు | ఎటువంటి ఫీజు లేదు | ఎటువంటి ఫీజు లేదు |
సివిల్ సర్వీస్ పరీక్షకు దరఖాస్తు చేయండి
సివిల్ సర్వీస్ పరీక్షకు పోటీపడే అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇదివరకే యూపీఎస్‌సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వారు మీ ఓటీఆర్ ఐడీ ద్వారా లాగిన్ అయ్యి పరీక్షకు సంబంధించిన ఎంపికలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ప్రధానంగా పోస్టుల ఎంపిక, పరీక్ష కేంద్రాల ఎంపిక, పరీక్ష మీడియం ఎంపికను నమోదు చేసుకోవాలి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం సిద్ధమయ్యే వారు ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసే సందర్భంలోనే ఆ ఎంపికను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అలానే సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు సంబంధించి కూడా ఎగ్జామ్ సెంటర్, ఆప్షనల్ సబ్జెక్టు ఎంపిక, లాంగ్వేజ్ ఎంపిక, ఆప్షనల్ లాంగ్వేజ్ ఎంపిక (రాజ్యాంగ బాషల నుండి) వివరాలను ప్రిలిమ్స్ దరఖాస్తులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
యూపీఎస్‌సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు చేసుకొని అభ్యర్థులు కొత్తగా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఉపయోగించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థి ప్రాథమిక వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీ మరియు తెలంగాణాలో సివిల్ సర్వీస్ పరీక్ష కేంద్రాలు
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు | |
---|---|
హైదరాబాద్ | వరంగల్ |
తిరుపతి | అనంతపూర్ |
విజయవాడ | విశాఖపట్నం |
సివిల్స్ మెయిన్ పరీక్ష కేంద్రాలు | |
విజయవాడ (ఆంధ్రప్రదేశ్) | హైదరాబాద్ (తెలంగాణ) |
చెన్నై (తమిళనాడు) | బెంగుళూర్ (కర్ణాటక) |
కటక్ (ఒడిశా) | ఢిల్లీ |
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నమూనా
సివిల్ సర్వీసెస్ పరీక్షను రెండు దశలలో నిర్వహిస్తారు. మొదటి దశలో ఆబ్జెక్టివ్ విధానంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో పొందిన వారికీ రెండవ దశలో డిస్క్రిప్టివ్ విధానంలో సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష జరుపుతారు. ఇందులో మెరిట్ సాధించిన వారికి వివిధ సివిల్ సర్వీసెస్ పోస్టుల వారీగా ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక పూర్తి చేస్తారు.
- సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్
- సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్
- సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నమూనా
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను కేవలం స్క్రీనింగ్ టెస్ట్‌గా మాత్రమే పరిగణిస్తారు. ఇందులో పొందిన మెరిట్ కేవలం సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు అర్హుత పొందేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణలోకి తీసుకోరు. ఉద్యోగ ఖాళీలు ఆధారంగా ప్రతి పోస్టుకు గరిష్టంగా 10 నుండి 13 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.
- సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను రెండు పేపర్లుగా జరుపుతారు. వీటిని జనరల్ స్టడీస్ (పేపర్ I) మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్ II) పేర్లతో నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లను మొత్తం 400 (200+200) మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో 100 ముల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.
- ఈ వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలుకు 2 గంటల సమయంలో సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1/3 వంతు మార్కులు తొలగిస్తారు.
- సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పేపరు - I లో కరెంటు అఫైర్స్, భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమం, భారతీయ మరియు ప్రపంచ భౌగోళికం, భారత రాజకీయ వ్యవస్థ, పంచాయతీ రాజ్ వ్యవస్థ, పాలిటీ, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి, పర్యావరణం, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు, ఆర్ట్ అండ్ కల్చర్ మరియు జనరల్ సైన్స్ సంబంధిత అంశాలలో అభ్యర్థి పరిజ్ణానం పరిశీలిస్తారు.
- సివిల్స్ ప్రిలిమినరీ పేపర్ - II లో లాజికల్ రీజనింగ్, అనలాటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లెమ్ సొల్వింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మరియు మెంటల్ ఎబిలిటీ సంబంధిత అంశాల యందు అభ్యర్థి పరిజ్ఞానం పరీక్షిస్తారు. పేపర్ II ను క్వాలిఫై పేపర్‌గా పరిగణిస్తారు. ఈ పేపర్లో 33% కనీస మార్కులు సాధించిన అభ్యర్థులు ప్రిలిమ్స్ ఉత్తీర్ణతులుగా పరిగణిస్తారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పేపర్లు | ప్రశ్నలు | మార్కులు | సమయం | |
---|---|---|---|---|
1 | జనరల్ స్టడీస్ (పేపర్ I) | 100 | 200 | 2 గంటలు |
2 | ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్ II) | 100 | 200 | 2 గంటలు |
సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ నమూనా
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హుత పొందిన వారు మరోసారి యూపీఎస్‌సీ వెబ్సైటు ద్వారా మెయిన్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష పూర్తి రాతపరీక్ష విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఇందులో రెండు క్వాలిఫై అవ్వాల్సిన పేపర్లు, మిగతా 7 తప్పనిసరి స్కోరు చేయాల్సిన పేపర్లు ఉంటాయి.
క్వాలిఫై పేపర్ A లో రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ B ఇంగ్లీష్ భాషకు సంబంధించి ఉంటుంది. ఒక్కో క్వాలిఫై పేపర్ 300 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో కనీసం 25% మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మిగతా 7 పేపర్లలో, పేపర్ I యందు వెయ్యి నుండి 12 వందల పదాలతో 2 వ్యాసాలు (Essay) రాయాల్సి ఉంటుంది. పేపర్ II నుండి పేపర్ V వరకు జనరల్ స్టడీస్ సంబంధిత పేపర్లు ఉంటాయి. మిగతా 2 పేపర్ల కోసం ఆప్షనల్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పేపర్ 250 మార్కులకు జరుగుతుంది. ఒక్కో పేపర్ కోసం 3 గంటల నిర్ణయిత సమయం కేటయిస్తారు.
పేపర్ | సిలబస్ | సమయం | మార్కులు |
---|---|---|---|
క్వాలిఫైయింగ్ పేపర్లు | |||
పేపర్ A | లాంగ్వేజ్ టెస్ట్ (రాజ్యాంగం గుర్తించిన బాషల నుండి ఆప్షనల్ ) | 3 గంటలు | 300 |
పేపర్ B | ఇంగ్లీష్ | 3 గంటలు | 300 |
మార్కులు లెక్కించే పేపర్లు | |||
పేపర్ I | వ్యాసం (Essay ) | 3 గంటలు | 250 |
పేపర్ II | జీఎస్ 1 : భారత వారసత్వం-సంస్కృతీ, చరిత్ర etc | 3 గంటలు | 250 |
పేపర్ III | జీఎస్ 2 : పాలన, రాజ్యాంగం, రాజకీయలు etc | 3 గంటలు | 250 |
పేపర్ IV | జీఎస్ 3 : టెక్నాలజీ, పర్యావరణం, విపత్తు నిర్వహణ etc | 3 గంటలు | 250 |
పేపర్ V | జీఎస్ 4 : ఎథిక్స్, ఇంటిగ్రిటీ & ఆప్టిట్యూడ్ | 3 గంటలు | 250 |
పేపర్ VI | ఆప్షనల్ సబ్జెక్టు - పేపర్ 1 | 3 గంటలు | 250 |
పేపర్ VII | ఆప్షనల్ సబ్జెక్టు - పేపర్ 2 | 3 గంటలు | 250 |
సివిల్ సర్వీసెస్ మెయిన్ రాతపరీక్ష మొత్తం మార్కులు | 1750 | ||
సివిల్ సర్వీసెస్ మెయిన్ ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ మార్కులు | 275 | ||
సివిల్ సర్వీసెస్ మెయిన్ మొత్తం మార్కులు | 2025 |
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షను మొత్తం 2025 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రాతపరీక్ష కోసం 1750 మార్కులు, ఇంటర్వ్యూ కోసం 275 మార్కులు కేటాయిస్తారు. ఈ 2025 మార్కులలో అభ్యర్థి సాధించిన స్కోరు ఆధారంగా చేసుకుని సివిల్స్ సర్వీస్ పోస్టులు కేటాయిస్తారు.
సివిల్ సర్వీసెస్ మెయిన్ పేపర్ A లాంగ్వేజ్ ఎంపికలు | ||
---|---|---|
అస్సామీ | మలయాళం | సింధీ |
బెంగాలీ | మణిపూరి | తమిళ్ |
గుజరాతీ | మరాఠీ | తెలుగు |
హిందీ | నేపాలీ | ఉర్దూ |
కన్నడ | ఒడియా | బోడో |
కాశ్మీరీ | పంజాబీ | డోంగ్రి |
కొంకణి | సంస్కృత | మైత్లి & సంతాలీ |
సివిల్ సర్వీసెస్ పేపర్ VI 6 & పేపర్ VII 7 ఆప్షనల్ సబ్జెక్టులు | ||
అగ్రికల్చర్ | జియోగ్రఫీ | ఫిజిక్స్ |
అనిమల్ హుస్బెండరీ & వెటర్నరీ సైన్స్ | జియాలజి | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ |
ఆంథ్రోపాలజీ | హిస్టరీ | సైకాలజీ |
బోటనీ | లా | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ |
కెమిస్ట్రీ | మానేజ్మెంట్ | సోషియాలజీ |
సివిల్ ఇంజనీరింగ్ | మ్యాథమెటిక్స్ | స్టాటిస్టిక్స్ |
కామర్స్ & అకౌంటెన్సీ | మెకానికల్ ఇంజనీరింగ్ | జూలోజి |
ఎకనామిక్స్ | మెడికల్ సైన్సెస్ | ఫిలాసఫీ |
పొలిటికల్ సైన్స్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్ | ||
లిటరేచర్ (ఇంగ్లీష్ తో పాటుగా రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు) |
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో గరిష్ట మెరిట్ సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం ఆహ్వానిస్తారు. యూపీఎస్‌సీ నోటిఫై చేసిన సివిల్ సర్వీసెస్ పోస్టుల ఖాళీలు ఆధారంగా, ప్రతి పోస్టుకు ఇద్దరూ లేదా ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు.
సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలో సమాధానాలు చెప్పే అవకాశంను యూపీఎస్‌సీ బోర్డు కల్పిస్తుంది. ప్రతి అభ్యర్థికి ఒక ఇంటర్వ్యూ బోర్డు కేటాయించబడి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ బోర్డుకు ఒక చైర్మనుతో పాటుగా నలుగురు బోర్డు సభ్యులను కేటాయిస్తారు.
ఇంటర్వ్యూ బోర్డుకు సదురు అభ్యర్థికి సంబంధించిన పూర్తి వ్యక్తిగత, విద్యా, తాజా పరీక్షలలో ఫలితాల సమాచారం అందిస్తారు. ఇంటర్వ్యూ బోర్డు ప్రధానంగా వ్యక్తిగత, సామజిక, మానసిక, విద్యా, మేధో, నైతిక, తార్కిక, నాయకత్వ సమర్థత అంశాలలో అభ్యర్థి బల, బలహీనతలను వెలికితీసే దిశలో జరుగుతుంది.
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకు ఎటువంటి కనీస అర్హుత మార్కులు లేవు. ఇంటర్వ్యూకు గరిష్టంగా 275 మార్కులలు కేటాయిస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు 1 నుండి 275 వరకు మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన స్కోరు, సాంకేతికంగా అభ్యర్థి తుది ఫలితాలను ప్రభావితం చేస్తుంది.