డీయూఈటీ పరీక్షను ఢిల్లీ యూనివర్సిటీలో యూజీ, పీజీ మరియు పీహెచ్డీ/ఎంఫిల్ అడ్మషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఢిల్లీ యూనివర్సిటీ ఉమ్మడిగా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తాయి. ఢిల్లీ యూనివర్సిటీలో యందు అందుబాటులో ఉండే సీట్లలో దాదాపు 50% శాతం ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. మిగతా 50 శాతం సీట్లు అకాడమిక్ మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు.
ఢిల్లీ యూనివర్సిటీ దేశంలో ఎందరో రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, బాలీవుడ్ నటులను అందించింది. ఢిల్లీ యూనివర్సిటీకి హస్తిన నగర వ్యాప్తంగా 16 ఫాకల్టీ డిపార్టుమెంట్స్, 86 అకాడమిక్ డిపార్టుమెంట్స్, 77 అనుబంధ కాలేజీలు మరో ఐదు ఇతర ఇనిస్టిట్యూట్లు కలిగి ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఏటా దాదాపు లక్షా ముప్పైవేల మంది విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులు పూర్తిచేస్తున్నారు.
డీయూఈటీ 2023
Exam Name | DUET 2023 |
Exam Type | Admission |
Admission For | UG, PG, RP |
Exam Date | - |
Exam Duration | 120 Minutes |
Exam Level | National Level |
డీయూఈటీ సమాచారం
డీయూఈటీ ఎలిజిబిలిటీ
- అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి
- యూజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్/10+2 పూర్తిచేసి ఉండాలి
- పీజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి పూర్తిచేసి ఉండాలి
- పీహెచ్డీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో సంబంధిత పీజీ కోర్సులు పూర్తిచేసి ఉండాలి
డీయూఈటీ 2023 షెడ్యూల్
దరఖాస్తు తేదీ | - |
అడ్మిట్ కార్డు | - |
ఎగ్జామ్ | - |
రిజల్ట్స్ | - |
డీయూఈటీ దరఖాస్తు ఫీజు
రిజర్వేషన్ కేటగిరి | యూజీ కోర్సులు | పీజీ కోర్సులు | పీహెచ్డీ /ఎంఫిల్ |
జనరల్ కేటగిరి | 750/- | 750/- | 750/- |
ఎస్సీ, ఎస్టీ | 300/- | 300/- | 300/- |
డీయూఈటీ ప్రవేశ పరీక్షా ద్వారా కాకుండా మెరిట్ ఆధారిత అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే జనరల్ అభ్యర్థులు 250/-, షెడ్యూల్ కులాల విద్యార్థులు 100/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అలానే పీజీ డిప్లొమా డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ లా కోర్సుకు దరఖాస్తు చేసే ఓబీసీ విద్యార్థులు 2000/-, షెడ్యూల్ కులాల విద్యార్థులు 1500/- రూపాల దరఖాస్తు పీజు చెల్లించాల్సి ఉంటుంది.
డీయూఈటీ పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్ | చెన్నై |
ఢిల్లీ | భువనేశ్వర్ |
డీయూఈటీ దరఖాస్తు ప్రక్రియ
డీయూఈటీ దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతయి. ఢిల్లీ యూనివర్సిటీ పోర్టల్ (www.du.ac.in) నుండి ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి. మొదటిసారి పోర్టల్ని సందర్శించిన వారు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ రిజిస్టర్ ఐడీ వివరాలతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షా ద్వారా కాకుండా అకాడమిక్ మెరిట్ ఆధారంగా యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆ సంబంధిత దరఖాస్తూ ఫీజు చెల్లించి మెరిట్ ఆధారిత అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కోరిన విద్య, వ్యక్తిగత సమాచారం తప్పులు దొర్లకుండా దరఖాస్తులో పొందుపర్చాలి. రిజర్వేషన్ కేటగిరి, కోర్సు ఎంపిక, పరీక్షా కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు పొందుపర్చినప్పుడు మరోమారు సరిచూసుకోండి. ప్రవేశ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మెయిల్ మరియు మొబైల్ ద్వారా అందజేస్తారు.
అందువలన అభ్యర్థులు ఖచ్చితమైన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలు అందజేయాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమయ్యాక సంబంధిత దరఖాస్తు ప్రింట్ తీసి మీ వద్ద భద్రపర్చుకోండి.
డీయూఈటీ ఎగ్జామ్ నమూనా
డీయూఈటీ యూజీ మరియు పీజీ, పీహెచ్డీ కోర్సులకు సంబంధించి పరీక్షా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. క్వశ్చన్ పేపర్లో 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు రెండు పార్టులుగా ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్న 4 ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు తొలగిస్తారు.
డీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నమూనా
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
యూజీ పేపర్ | 100 | 400 | 120 నిముషాలు |
డీయూఈటీ పీజీ ప్రవేశ పరీక్ష నమూనా
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
జనరల్ అవెర్నెస్ రీజనింగ్ లాంగ్వేజ్ కంప్రెహెన్షన్ (H/E) ఆప్షనల్ స్పెషలైజషన్ |
18 17 20 45 |
72 68 80 180 |
120 నిముషాలు |
డీయూఈటీ పీహెచ్డీ, ఎంఫిల్ ప్రవేశ పరీక్ష నమూనా
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
రీసెర్చ్ మెథడాలజీ | 50 % | 200 | 120 నిముషాలు |
ఆప్షనల్ స్పెషలైజషన్ | 50% | 200 | |
100 | 400 |
డీయూఈటీ అడ్మిషన్ ప్రక్రియ
డీయూఈటీ అడ్మిషన్ ప్రక్రియ యూజీసీ నియమాలకు లోబడి జరుగుతుంది. అడ్మిషన్ ప్రక్రియ అకాడమిక్ లేదా ప్రవేశ పరీక్షా మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. 50 శాతం కనీస అర్హుత మార్కులు సాధించిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి కోర్సులో అందుబాటులో ఉండే సీట్లలో రిజర్వేషన్ కోటాల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
యూజీ మరియు పీజీ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ రెండు విధాలుగా నిర్వహిస్తారు. కోర్సుకు సంబందించిన 50 శాతం సీట్లు అకాడమిక్ మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు. మిగతా 50 శాతం సీట్లు ప్రవేశ పరీక్షా ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
పరిశోధన కోర్సులకు (పీహెచ్డీ/ఎంఫిల్) సంబంధించి అడ్మిషన్లు ప్రవేశ పరీక్షా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండింటిలో కనీసం 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షా ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. కానీ రూపొందించిన మెరిట్ జాబితా ఆధారంగా అవసరాన్ని బట్టి ఏడాదిలో రెండు సార్లు ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది.
నెట్, గేట్ మరియు ఇతర ఫెలోషిప్స్ ఎంపికైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పరిశోధ ప్రోగ్రామ్స్ నిడివి 1 నుండి రెండేళ్లు ఉంటుంది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అడ్మిషన్ బ్రోచుర్ తిలకించండి.