సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్ | జనవరి 2022
Telugu Current Affairs

సైన్స్ & టెక్నాలజీ అఫైర్స్ | జనవరి 2022

మొదటి డ్యూయల్-మోడ్ వాహనాన్ని ఆవిష్కరించిన జపాన్

రైలు మరియు రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే ప్రపంచ మొట్టమొదటి డ్యూయల్ - మోడ్ వాహనాన్ని జపాన్‌లోని కైయో పట్టణంలో ఆవిష్కరించారు. మినీ బస్సు ఆకారంలో ఉండే ఈ వాహనం 21 మంది ప్రయాణికులతో రైలు పట్టాలపై 37 mph మరియు పేవ్‌మెంట్‌లో 62 mph వేగంతో గమ్యాన్ని చేరుకోగలదు.

Advertisement

ఫ్రాన్స్‌లో కొత్త కోవిడ్-19 వేరియంట్ 'IHU

ఫ్రాన్స్‌లోని  వైద్య శాస్త్రవేత్తలు మరియు నిపుణులు ' IHU లేదా B.1.640.2 ' అని పిలవబడే కోవిడ్ -19 యొక్క కొత్త రూపాంతరాన్ని గుర్తించారు. ఈ కొత్త వేరియంట్‌'కు సంబంధించి దాదాపు 12 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. ఆఫ్రీకా నుండి వచ్చే ప్రయాణికులతో ఈ వేరియెంట్ గుర్తించినట్లు తెలిపారు.

ఈ కొత్త రూపాంతరంలో ప్రధాన స్పైక్ ప్రోటీన్‌లో "N501Y మరియు E484Kతో సహా పద్నాలుగు అమైనో ఆమ్ల ప్రత్యామ్నాయాలు మరియు 9 తొలగింపులు గుర్తించారు. ఈ జన్యురూప నమూనా B.1.640.2 అనే కొత్త పాంగోలిన్ వంశాన్ని సృష్టించడానికి దారితీసింది.

ఓమిక్రాన్‌ను గుర్తించేందుకు మేడ్-ఇన్-ఇండియా ఓమిసూర్ కిట్‌

ఓమిసూర్ అనేది RT-PCR పరీక్ష ద్వారా ఓమిక్రాన్‌ను గుర్తించడానికి భారతదేశంలో తయారు చేయబడి ICMRచే ఆమోదించబడిన మొదటి టెస్టింగ్ కిట్, ఇది ఒకే ట్యూబ్‌తో మూడు జన్యువులను లక్ష్యంగా చేసుకుంటుంది, ఏకకాలంలో S-జీన్ టార్గెట్ వైఫల్యం మరియు S-జీన్ మ్యుటేషన్ యాంప్లిఫికేషన్‌ను గుర్తించే ఏకైక డిజైన్‌ టెస్ట్. దీనిని టాటా మెడికల్ డయాగ్నోస్టిక్స్ రూపొందించింది.

సైప్రస్'లో కోవిడ్ కొత్త వేరియంట్ 'డెల్టాక్రాన్'

మధ్యధరా సముద్రంలో మూడవ అతిపెద్ద ఇటాలియన్ ద్వీపమైన సైప్రస్'లో కోవిడ్ కొత్త వేరియంట్ గుర్తించారు. డెల్టా మరియు ఓమిక్రాన్ కు సంబంధించిన ఉమ్మడి జన్యు నేపథ్యాన్ని కలిగిన ఈ నూతన కరోనావైరస్ వేరియంట్‌కు 'డెల్టాక్రాన్' అని నామకరణం చేశారు.

పంది నుండి మనిషికి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

అమెరికా వైద్యులు తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన పంది గుండెను విజయవంతంగా మనిషికి అమర్చారు. సర్జరీ అయిన పేషెంట్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, త్వరలో అతడు పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు నమ్ముతున్నారు. అవయవ మార్పిడిపై జరుగుతున్న ప్రయోగాలలో ఈ సర్జరీ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని వైద్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర జాతుల అవయవాలను మనుషులకు అమర్చే ప్రక్రియను జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. అలాంటి ఒక ప్రయోగం గత ఏడాది అమెరికాలో జరిగింది. న్యూయార్క్‌ శస్ర్తచికిత్స నిపుణులు పంది కిడ్నీని మనిషికి మార్చారు. ఐతే, సర్జరీకి ముందే పేషెంట్‌ బ్రెయిన్‌డెడ్‌తో అపస్మారక స్థితికి వెళ్లారు. కోలుకునే అవకాశాలు లేవని నిర్ధారణ అయ్యాకే ప్రయోగాత్మక శస్ర్త చికిత్సకు పూనుకున్నారు.

దక్షిణాఫ్రికా గబ్బిలాలలో కొత్త రకమైన కరోనావైరస్ 'నియోకోవ్‌'

దక్షిణాఫ్రికాలో గబ్బిలాల మధ్య వ్యాపించే ఒక రకమైన కొత్త కరోనావైరస్, 'నియోకోవ్' ను గుర్తించినట్లు చైనా వుహాన్ ల్యాబ్'కు చెందిన పరిశోధికులు ప్రకటించారు. ఇది మరింత ఉత్పరివర్తన చెందితే భవిష్యత్తులో మానవులకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ వైరస్ వ్యాధిని ఇదివరకే  2012 లో సౌదీ అరేబియాలో గుర్తించినట్లు చెబుతున్నారు.

Advertisement

Post Comment