రిపోర్టులు &  ర్యాంకులు | కరెంటు అఫైర్స్ మే 2022
Telugu Current Affairs

రిపోర్టులు & ర్యాంకులు | కరెంటు అఫైర్స్ మే 2022

ముంబైలో మొదటి డిజిటల్ బస్ సర్వీస్‌ ప్రారంభం

భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ బస్ సర్వీస్‌ను ప్రారంభించిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇటీవలే మహారాష్ట్ర రాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే, ముంబై యొక్క మొట్టమొదటి పూర్తి డిజిటల్ బస్సును ప్రారంభించారు. ఈ బస్సు ప్రత్యేకమైన 'ట్యాప్-ఇన్ ట్యాప్-అవుట్' ఫీచర్‌తో గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి చర్చ్‌గేట్‌ మధ్య సేవలు అందించనుంది.

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ఇండియాకు 150వ ర్యాంకు

గ్లోబల్ మీడియా వాచ్‌డాగ్ నివేదిక ప్రకారం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంకింగ్ 180 దేశాలలో 142వ ర్యాంక్ నుండి 150వ స్థానానికి పడిపోయింది. ఈ జాబితాలో భారత్ పొరుగు దేశాల ర్యాంకింగ్ కూడా దిగజారింది,  ఇందులో నేపాల్ మినహా పాకిస్తాన్ 157వ స్థానంలో, శ్రీలంక 146వ స్థానంలో, బంగ్లాదేశ్ 162వ స్థానంలో, మయన్మార్ 176వ స్థానంలో ఉన్నాయి. నేపాల్ మాత్రం గ్లోబల్ ర్యాంకింగ్‌లో 30 పాయింట్లు ఎగబాకి 76వ స్థానానికి చేరుకుంది.

ఉత్తమ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాల జాబితాలో నార్వే, ఫిన్‌లాండ్, స్వీడన్, డెన్మార్క్, కోస్టారికా, నెదర్లాండ్స్, జమైకా, న్యూజిలాండ్, ఐర్లాండ్, పోర్చుగల్ మరియు స్విట్జర్లాండ్‌ వంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి.

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ అనేది 180 దేశాల్లో జర్నలిస్టులు, వార్తా సంస్థలు మరియు నెటిజన్‌ల భావప్రకటన స్వేచ్ఛను అంచనా వేస్తుంది. పౌరుల భావప్రకటన స్వేచ్ఛను గౌరవించడానికి ఆయా ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఏటా ఈ నివేదికను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయినా మే 3వ తేదీన విడుదల చేస్తారు.

4వ అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్

ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ డెస్ కన్‌స్ట్రక్చర్స్ డి'ఆటోమొబైల్స్ (OICA) విడుదల చేసిన 2022 నివేదిక ప్రకారం, భారతదేశం జర్మనీని అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద వాహన మార్కెట్‌గా అవతరించింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత రెండు స్థానాలలో యూఎస్ మరియు జపాన్ దేశాలు ఉన్నాయి.

చెక్ రిపబ్లిక్'లో అత్యంత పొడవైన పాదచారుల సస్పెన్షన్ వంతెన ప్రారంభం

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాదచారుల సస్పెన్షన్ వంతెన  'స్కై బ్రిడ్జ్', చెక్ రిపబ్లిక్ యొక్క డోల్నీ మొరావాలోని పర్వత రిసార్ట్‌లో ప్రజల కోసం తెరవబడింది. ఇది స్థానిక జెసెనికీ పర్వతాలలోని రెండు పర్వతాల మధ్య 721 మీటర్లు (సుమారు 2,365 అడుగులు) విస్తరించి ఉంది. అలానే భూమి నుండి 300 అడుగుల ఎత్తులో నిర్మించబడింది.

Post Comment