లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగాలు 2023
Latest Jobs

లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగాలు 2023

గత దశాబ్దకాలంగా దేశ ఆర్థిక ప్రగతిలో ముఖ్యభూమిక పోషిస్తున్న బ్యాంకింగ్ రంగం, అదే మొత్తంలో మానవ వనరుల నియామకాలు కూడా చేపట్టింది. బ్యాంకుల జాతీయం తర్వాత ప్రభుత్వ బ్యాంకులతో పాటుగా ప్రైవేట్ బ్యాంకులు కూడా తమ వ్యాపార వృద్ధిలో భాగంగా పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాలు, అటునుండి గ్రామాల వరకు తమ బ్రాంచులను విస్తరించడం మొదలుపెట్టాయి.

Advertisement
నియామక బోర్డు ప్రైవేట్ బ్యాంక్స్
నియామక పరీక్షా క్లర్కు,పీఓ, ఆఫీసర్స్ ఎగ్జామ్స్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/ఇంటర్వ్యూ
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్
వయో పరిమితి 21 - 30 ఏళ్ళ మధ్య

ఈ క్రమములో వీరికి అధికమొత్తంలో మానవ వనరుల అవసరం వచ్చిపడింది. ఈ అవసరం ఈ పదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 20 లక్షల ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలో సృష్టించగల్గింది. ప్రస్తుతం బ్యాంకుల నియామకాల వరవడి తగ్గుముఖం పడుతున్నా, అది నిరుద్యోగులు భయపడేంత ఎక్కువయితే కాదు.

2019 లో ప్రభుత్వ బ్యాంకుల విలీనం తర్వాత ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 ప్రభుత్వ బ్యాంకులతో పాటుగా 22 ప్రైవేట్ బ్యాంకులు దేశంలో ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు తమ సిబ్బందిని ఐబిపిఎస్ నియామక పరీక్షల ద్వారా చేసుకుంటుండగా, ప్రైవేట్ బ్యాంకులు వేటికి అవి తమ సొంత నియామక ప్రక్రియల ద్వారా భర్తీచేసుకుంటున్నాయి.

జీతం, అలవెన్సులు, పని ఒత్తిడి వంటి వివిధ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగాల కంటే ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగాలు సౌకర్యంగా కనిపిస్తుండంతో  బ్యాంకు ఉద్యోగ ఆశావాహులంతా ప్రైవేట్ బ్యాంకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నది వాస్తవం.

యాక్సిస్ బ్యాంకు బంధన్ బ్యాంకు , సిసిఎస్‌బి బ్యాంకు సిటీ యూనియన్ బ్యాంకు
డిసిబి బ్యాంక్ ధనలక్ష్మి బ్యాంకు ఫెడరల్ బ్యాంకు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంకు
ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు జమ్మూ & కాశ్మీర్ బ్యాంకు కర్ణాటక బ్యాంకు
కరూర్ వైశ్య బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు లక్ష్మి విలాస్ బ్యాంకు
నైనిటాల్ బ్యాంకు ఆర్‌బిఎల్ బ్యాంకు సౌత్ ఇండియా బ్యాంకు
తమిళనాడు మెర్కాంటైల్ బ్యాంకు యెస్ బ్యాంకు ఐడిబిఐ బ్యాంకు

Advertisement

Post Comment