బీఆర్‌ఏఓయూ యూజీ కోర్సులు | డిస్టెన్స్ ఎడ్యుకేషన్
Distance Education

బీఆర్‌ఏఓయూ యూజీ కోర్సులు | డిస్టెన్స్ ఎడ్యుకేషన్

బీఆర్‌ఏఓయూ 3 ఏళ్ళ వ్యవధితో బీఏ, బీకామ్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులు బీఆర్‌ఏఓయూ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఆఫర్ చేస్తున్నారు. డిగ్రీ కోర్సులు సెమిస్టరు & ఛాయస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం విధానంలో అందిస్తున్నారు.

Advertisement

బ్యాచిలర్ డిగ్రీని ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు ఆరు ఏళ్ళ లోపు ఆ కోర్సును పూర్తిచేసే అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ పొందిన వారికి కోర్సుకు సంబంధించి పూర్తి స్టడీ మెటీరియల్ అందిస్తారు. విద్యార్థులకు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ద్వారా ఆడియో క్లాసులు ప్రచారం చేస్తారు. ఆవిధంగా తెలంగాణ ప్రభుత్వ టీశాట్ చానల్స్ ద్వారా వీడియో క్లాసులు అందుబాటులో ఉంచారు. ఉన్నత విద్యను పూర్తిచేయాలనుకునే ఉద్యోగస్తులకు, గృహాణిలకు ఇది మంచి అవకాశం.

బీఆర్‌ఏఓయూ బీఏ డిగ్రీ & ట్యూషన్ ఫీజు

బీఆర్‌ఏఓయూ 3 ఏళ్ళ నిడివితో విభిన్న ఆర్ట్ సబ్జెక్టుల సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సులను అందిస్తుంది. ఇందులో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, లిటరేచర్, మీడియా & మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, సైకాలజీ వంటి సబ్జెక్టు కాంభినేషన్స్ ఉన్నాయి. ఈ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు ఏటా జులై/ఆగష్టు నెలల యందు నిర్వహిస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ)
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు (గరిష్టంగా 6 ఏళ్ళు)
కోర్సు మీడియం తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ
కోర్సు ఫీజు 7,700/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

బీఆర్‌ఏఓయూ బీకామ్ డిగ్రీ & ట్యూషన్ ఫీజు

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా 3 ఏళ్ళ నిడివితో విభిన్న బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ కోర్సులను అందిస్తుంది. ఇందులో 3 సబ్జెక్టు కాంబినేషన్ల వారీగా మొత్తం మూడు కామర్స్ గ్రూపులు ఆఫర్ చేస్తుంది. ఇందులో ఇన్‌కమ్ ట్యాక్స్, సేల్స్ డిస్టిబ్యూషన్, కాస్ట్ అకౌంటింగ్, మానేజ్మెంట్ అకౌంటింగ్, బిజినెస్ ఎన్విరాన్మెంట్, కంపెనీ లా, ఫైనాన్స్ మార్కింగ్, ఈకామర్స్, ఫైనాన్స్ సర్వీస్ వంటి సబ్జెక్టు కాంభినేషన్స్ ఉన్నాయి. ఈ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు ఏటా జులై/ఆగష్టు నెలల యందు నిర్వహిస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్)
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు (గరిష్టంగా 6 ఏళ్ళు)
కోర్సు మీడియం తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ
కోర్సు ఫీజు 7,700/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

బీఆర్‌ఏఓయూ బీఎస్సీ డిగ్రీ & ట్యూషన్ ఫీజు

బీఆర్‌ఏఓయూ దూరవిద్య ద్వారా 3 ఏళ్ళ నిడివితో విభిన్న బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సులను అందిస్తుంది. ఇందులో 3 సబ్జెక్టు కాంబినేషన్ల వారీగా మొత్తం రెండు సైన్స్ గ్రూపులు ఆఫర్ చేస్తుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూవాలజీ, జియాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి సబ్జెక్టు కాంభినేషన్స్ ఉన్నాయి. ఈ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు ఏటా జులై/ఆగష్టు నెలల యందు నిర్వహిస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ)
ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ (బైపీసీ/ఎంపీసీ)
కోర్సు వ్యవధి 3 ఏళ్ళు (గరిష్టంగా 6 ఏళ్ళు)
కోర్సు మీడియం తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ
కోర్సు ఫీజు 7,700/-
అడ్మిషన్ లింక్ వెబ్‌సైట్
కోర్సు సిలబస్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ క్లాసులు వెబ్‌సైట్

Advertisement

Post Comment