కరెంటు అఫైర్స్ ప్రాక్టీసు ప్రశ్నలు & సమాదానాలు – ఆగస్టు 2022
Current Affairs Bits 2022

కరెంటు అఫైర్స్ ప్రాక్టీసు ప్రశ్నలు & సమాదానాలు – ఆగస్టు 2022

ఆగష్టు 2022 నెలలో చోటు చేసుకున్న వివిధ కరెంట్ అఫైర్స్ సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలకు జవాబు చేయండి. అలానే ఆగష్టు 2022 నెలకు సంబంధించి 10 విభాగాల వారీగా కరెంటు అఫైర్స్ పొందండి. పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను పరీక్షించుకోండి.

కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు & సమాదానాలు

1. తిరంగ ఉత్సవ్ సంబంధించి కింది వాటిలో సరైనది

  1. పింగళి వెంకయ్య 146వ జయంతి జ్ణాపకార్థం
  2. భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం
  3. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

2. బీహార్ ముఖ్యమంత్రి ఎవరు ?

  1. నితీష్ కుమార్
  2. తేజస్వీ యాదవ్‌
  3. హేమంత్ సోరెన్
  4. అఖిలేష్ యాదవ్
సమాధానం
1. నితీష్ కుమార్

3. ఇటీవలే తమిళనాడులో ఏర్పాటు చేసిన ఏనుగుల సంరక్షణ కేంద్రం ?

  1. శ్రీవిల్లిపుత్తూరు ఎలిఫెంట్ రిజర్వ్
  2. నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్
  3. అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్
  4. కోయంబత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్
సమాధానం
3. అగస్త్యమలై ఎలిఫెంట్ రిజర్వ్

4. ఇండియా మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతరు పేరు ఏంటి ?

  1. ఆరుద్ర
  2. రోహిణి
  3. సముద్ర
  4. ముద్రా
సమాధానం
2. రోహిణి

5. ప్రస్తుతం ఇండియాలో ఉన్న రామ్‌సర్ సైట్లు ఎన్ని ?

  1. 105 రామ్‌సర్ సైట్లు
  2. 205 రామ్‌సర్ సైట్లు
  3. 75 రామ్‌సర్ సైట్లు
  4. 54 రామ్‌సర్ సైట్లు
సమాధానం
3. 75 రామ్‌సర్ సైట్లు

6. ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2022 కి ఆతిధ్యం ఇచ్చిన నగరం ఏది ?

  1. హైదరాబాద్
  2. న్యూఢిల్లీ
  3. ముంబాయి
  4. బెంగుళూరు
సమాధానం
4. బెంగుళూరు

7. ప్రపంచ అత్యల్ప సంతానోత్పత్తి రేటు కలిగిన దేశం ఏది ?

  1. చైనా
  2. దక్షిణ కొరియా
  3. ఉత్తర కొరియా
  4. ఇండోనేషియా
సమాధానం
2. దక్షిణ కొరియా

8. యునెస్కో శాంతి బహుమతి 2022 విజేత ?

  1. మలాలా యూసఫ్‌జాయ్
  2. వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ
  3. మార్గరెట్ థాచర్
  4. ఏంజెలా మెర్కెల్‌
సమాధానం
4. ఏంజెలా మెర్కెల్‌

9. ఇటీవలే ఏ దేశంలో భారత రాయబార కార్యాలయం ప్రారంభించారు ?

  1. ఆఫ్ఘనిస్తాన్
  2. నేపాల్
  3. పరాగ్వే
  4. కొలంబియా
సమాధానం
3. పరాగ్వే

10. భారత 49వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?

  1. జస్టిస్ ఎన్వీ రమణ
  2. ఉదయ్ ఉమేష్ లలిత్
  3. రంజన్ గొగోయ్
  4. శరద్ అరవింద్ బాబ్డే
సమాధానం
2. ఉదయ్ ఉమేష్ లలిత్

11. సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టరు ఎవరు ?

  1. నల్లతంబి కలైసెల్వి
  2. తమిళిసై సౌందరరాజన్
  3. నివేదిత చౌదరి
  4. స్మృతి ఇరానీ
సమాధానం
1. నల్లతంబి కలైసెల్వి

12. జగదీప్ ధంఖర్ సంబంధించి నిజం కానిది ?

  1. భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి
  2. బెంగాల్ మాజీ గవర్నర్
  3. ద్రౌపది ముర్ము సోదరుడు
  4. న్యాయవాదిగా పనిచేసారు
సమాధానం
3. ద్రౌపది ముర్ము సోదరుడు

13. యూకేలో నూతన భారత హైకమిషనర్‌ ఎవరు ?

  1. సత్యేంద్ర ప్రకాశ్
  2. దేబాసిసా మొహంతి
  3. విక్రమ్ దొరైస్వామి
  4. విశ్వనాథన్ ఆనంద్
సమాధానం
3. విక్రమ్ దొరైస్వామి

14. డీఆర్డీవో నూతన ఛైర్మనుగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?

  1. సత్యేంద్ర ప్రకాశ్
  2. సంజయ్ అరోరా
  3. విక్రమ్ దొరైస్వామి
  4. సమీర్ వి కామత్
సమాధానం
4. సమీర్ వి కామత్

15. క్రింది వాటిలో తెలంగాణ ప్రభుత్వ పథకం కానిది ఏది ?

  1. మిషన్ కాకతీయ
  2. నేతన్న బీమా పధకం
  3. అమ్మఒడి
  4. హరితహారం
సమాధానం
3. అమ్మఒడి

16. నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు ?

  1. నరేంద్ర మోదీ
  2. వెంకయ్య నాయుడు
  3. సుమన్ బేరీ
  4. పరమేశ్వరన్ అయ్యర్
సమాధానం
1. నరేంద్ర మోదీ

17. ఆపరేషన్ యాత్రి సురక్ష సంబంధించి సరైన వాక్యం ?

  1. అమర్‌నాథ్ యాత్ర భద్రత
  2. ఢిల్లీ టూరిస్టు భద్రత
  3. రైలు ప్రయాణీకుల వస్తువుల భద్రత
  4. చార్ ధామ్ యాత్రికుల భద్రత
సమాధానం
3. రైలు ప్రయాణీకుల వస్తువుల భద్రత

18. 2022 కి సంబంధించి ఉత్తమ ఆస్పిరేషనల్ జిల్లా ఏది ?

  1. హరిద్వార్‌
  2. అయోధ్య
  3. జైసల్మేర్
  4. అన్నమయ్య
సమాధానం
1. హరిద్వార్‌

19. ఇండియాలో రైల్వే స్టేషన్ లేని రాష్ట్రం ఏది ?

  1. గోవా
  2. నాగాలాండ్
  3. సిక్కిం
  4. ఉత్తరాఖండ్
సమాధానం
3. సిక్కిం

20. దేశంలో మొదటి వర్చువల్ స్కూల్ ప్రారంభించిన రాష్ట్రం/యూటీ ఏది ?

  1. ఢిల్లీ
  2. పుదుచ్చేరి
  3. తమిళనాడు
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
1. ఢిల్లీ

 

21. డోనీ పోలో విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది ?

  1. మహారాష్ట్ర
  2. రాజస్థాన్
  3. అరుణాచల్ ప్రదేశ్
  4. జమ్మూ & కాశ్మీర్
సమాధానం
3. అరుణాచల్ ప్రదేశ్

22. అల్ నజా-IV మిలిటరీ ఎక్సర్సైజ్ యందు పాల్గున్న దేశాలు ఏవి ?

  1. భారత్ - సౌదీ అరేబియా
  2. రష్యా - భారత్
  3. భారత్ - ఒమాన్
  4. థాయిలాండ్ - ఒమాన్
సమాధానం
3. భారత్ - ఒమాన్

23. ఎక్స్ వజ్ర ప్రహార్ 2022 యందు పాల్గున్న దేశాలు ఏవి ?

  1. రష్యా - ఇండియా
  2. జపాన్ - ఇండియా
  3. యూఎస్ - ఇండియా
  4. ఆస్ట్రేలియా - ఇండియా
సమాధానం
3. యూఎస్ - ఇండియా

24. దేశంలో మొదటి హర్ ఘర్ జల్ సర్టిఫైడ్ రాష్ట్రం ఏది ?

  1. తెలంగాణ
  2. గోవా
  3. ఒడిశా
  4. కేరళ
సమాధానం
2. గోవా

25. విత్తనల పంపిణీలో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించిన రాష్ట్రం ?

  1. గుజరాత్
  2. తమిళనాడు
  3. పంజాబ్
  4. జార్ఖండ్
సమాధానం
4. జార్ఖండ్

26. లిస్బన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అందుకున్న మొదటి దక్షిణఆసియా మహిళా ?

  1. ఫహ్మిదా అజీమ్
  2. మెరీనా తబస్సుమ్
  3. షేక్ హసీనా
  4. ముష్రేఫా మిషు
సమాధానం
2. మెరీనా తబస్సుమ్

27. కామన్వెల్త్ గేమ్స్ 2022 లో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన భారతీయ అథ్లెట్ ?

  1. సునీల్ బహదూర్
  2. అచింత షెయులీ
  3. హర్మీత్ దేశాయ్
  4. అనాహత్ సింగ్
సమాధానం
4. అనాహత్ సింగ్

28. మహిళల యూరోపియన్ ఛాంపియన్‌షిప్ 2022 విజేత ?

  1. జర్మనీ
  2. ఇంగ్లాండ్
  3. ఫ్రెంచ్
  4. ఇటలీ
సమాధానం
2. ఇంగ్లాండ్

29. జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?

  1. ఆగస్టు 01
  2. ఆగస్టు 07
  3. ఆగస్టు 21
  4. ఆగస్టు 27
సమాధానం
2. ఆగస్టు 07

30. జాతీయ క్రీడా దినోత్సవంకు సంబంధించి సరైన వాక్యం   ?

  1. ఆగస్టు 29న జరుపుకుంటారు
  2. దీనిని 2012 లో ప్ర్రారంభించారు
  3. ధ్యాన్ చంద్ జన్మదిన జ్ఞాపకార్థం
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

 

Post Comment