డిజాబిలిటీ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకంను 40 శాతం అంగవైకుల్యం (డిజాబిలిటీ) కలిగిన క్లాస్ IX మరియు X విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఫైనాన్సియల్, మెంటల్ ,సైకాలాజికల్ కారణాలతో 50 శాతం డిజాబిలిటీ విద్యార్థులు క్లాస్ IX, X లమధ్య స్కూల్ ఎడ్యుకేషన్ నుండి డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈ శాతాన్ని తగ్గించి వారందరికి గౌరవప్రదమైన పాఠశాల విద్యను అందించేందుకు ఈ స్కాలర్షిప్ ప్రవేశపెట్టింది.
స్కాలర్షిప్ పేరు | ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్ |
ఎవరు అర్హులు | 40% డిజాబిలిటీ కలిగిన క్లాస్ IX & X విద్యార్థులు |
దరఖాస్తు ముగింపు తేదీ | 15-10-2022 |
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ | 31-10-2022 |
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ | 31-10-2022 |
ఈ పథకం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయబడువుతుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 50 వేల వరకు డిజాబిలిటీ విద్యార్థులు ఏటా ఈ స్కాలర్షిప్ వలన లబ్ది పొందుతున్నారు. ఈ పథకం కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే అందిస్తారు. ఈ స్కాలర్షిప్'కు అర్హుత పొందిన విద్యార్థులకు మైంటెనెన్సు అలోవెన్సు, బుక్ గ్రాంట్ అమౌంట్ మరియు డిజాబిలిటీ అలోవెన్సు కింద ఏడాదికి 10,000 నుండి 15 వేల వరకు, విద్యార్థి డిజాబిలిటీ టైప్ ఆధారంగా అందిస్తారు.
అలోవెన్సు టైపు | హాస్టలర్స్ | డేస్ స్కాలర్స్ |
మైంటెనెన్సు అలోవెన్సు | 800/- | 500/- |
బుక్ గ్రాంట్ | 1000/- | 1000/- |
డిజాబిలిటీ టైప్ | డిజాబిలిటీ అలోవెన్సు (ఏడాదికి) |
దృష్టి లోపం (visually impaired) | 4,000/- |
వినికిడి లోపం (hearing impaired) | 2,000/- |
శారీరక వైకుల్యం (physically disabled) | 2,000/- |
మానసిక వైకుల్యం (intellectual disabilities) | 4,000/- |
ఇతర వైకుల్యాలు (Other disabilities) | 2,000/- |
ఎవరు అర్హులు
40 శాతం కనీస డిజాబిలిటీ కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలలు మరియు సెంట్రల్, స్టేట్ సెకండరీ బోర్డు స్కూళ్లలో క్లాస్ IX, క్లాస్ X చదివే విద్యార్థులు, ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసే ముందు విద్యార్థి, డిజాబిలిటీ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, అకాడమిక్ సర్టిఫికెట్, ఫొటోగ్రాఫ్, స్కూల్ ఫీజు రిసిప్ట్స్ మరియు ఆధార్ కార్డు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
ఈ స్కాలర్షిప్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎంపవర్మెంటు ఆఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించి దరఖాస్తు నోటిఫికేషన్ స్థానిక వార్తాపత్రికల్లో మరియు న్యూస్ ఛానెళ్లలో పబ్లిష్ చేస్తారు. అర్హుత ఉండే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ అనంతరం, అర్హుత ఉండే విద్యార్థులకు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రభుత్వాల సిపార్సు మరియు అకాడమిక్ మెరిట్, డిజాబిలిటీ వాయిటేజ్ అనుసారం, విద్యార్థి బ్యాంకు అకౌంట్లలో స్కాలర్షిప్ జమ చేస్తారు.
అందుబాటులో ఉండే స్కాలర్షిప్'లలో 30 శాతం బాలికలకు రిజర్వ్ చేయబడి ఉంటాయి. అలానే ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అందిస్తారు. ఈ పథకం పరిధిలో గరిష్టంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి టాప్ 25 వేల మందికి స్కాలర్షిప్ జమ చేస్తారు.