గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం ఇండియా పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ తపాలా కార్యాలయాల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్ పోస్టులు భర్తీ చేయనుంది. ఎంపిక టెన్త్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.
టెన్త్ పూర్తి చేసిన గ్రామీణ నిరుద్యోగులు ఇది గొప్ప అవకాశం. గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల సాధించడం ద్వారా స్థానికంగా ఉంటూనే తమ ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుంది. బ్రాంచ్ పోస్టు మాస్టరుగా ఎంపికైన అభ్యర్థులకు 12 వేల నుండి 30వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టరుగా ఎంపికైన అభ్యర్థులకు 10 వేల నుండి 25 వేలు జీతం అందిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 16 ఫిబ్రవరి 2023 లోపు దరఖాస్తు చేసుకోండి.
గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు 2023
గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు | 40,889 పోస్టులు |
ఆంధ్రప్రదేశ్ | 2,480 పోస్టులు |
తెలంగాణ | 1,266 పోస్టులు |
గ్రామీణ డాక్ సేవక్ ఎలిజిబిలిటీ
- ఎడ్యుకేషన్ : గుర్తింపు పొందిన పాఠశాల నుండి బ్యాచిలర్ టెన్త్ పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి : 18 నుండి 40 ఏళ్ళు లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- స్థానిక భాష మాట్లాడం, వ్రాయడం, చదవడం తెలిసి ఉండాలి.
- బేసిక్ కంప్యూటర్ పరిజ్ఙానం ఉండాలి.
- అభ్యర్థులకు సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి.
గ్రామీణ డాక్ సేవక్ ఎంపిక ప్రక్రియ
ఎంపిక టెన్త్ క్లాస్ యందు సాధించిన మార్కుల ఆధారితంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్లు ఆటోమేటిక్ సాంకేతిక ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతాయి. గ్రేడ్స్ సమానమైన అభ్యర్థులను పుట్టిన తేదీల ఆధారంగా షార్ట్ లిస్టు రూపొందిస్తారు. చివరిగా వివిధ రిజర్వేషన్లు, స్థానిక ఖాళీల సంఖ్యా ఆధారంగా తుది జాబితా రూపొందించి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక చేపడతారు.
గ్రామీణ డాక్ సేవక్ దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ వారి తుడుగడువు లోపు https://indiapostgdsonline.gov.in/Reg_validation.aspx వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ వెరిఫై చేసుకోవడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
తర్వాత దశలో అభ్యర్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు నింపాల్సి ఉంటుంది. చివరిగా కమ్యూనిటీ వివరాలు, టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత పొందిన ఏడాది వివరాలు పొందుపరచడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.