నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(7 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. భారత్ 2025-26 కాలానికి యూఎస్ పీస్ బిల్డింగ్ కమిషన్‌కు తిరిగి ఎన్నికైంది. దీన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
- 2005
- 2000
- 2013
- 2010
సమాధానం
1. 2005
2. భారత మాజీ ఆటగాడు సిద్ధార్థ్ కౌల్ 34 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫస్ట్ క్లాస్ అరంగేట్రంతో ఏ సంవత్సరంలో భారత క్రికెట్‌లో ప్రయాణాన్ని ప్రారంభించాడు?
- 2005
- 2002
- 2007
- 2009
సమాధానం
3. 2007
3. కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 30వ ఎడిషన్‌లో 2024లో ఫిల్మ్ ఫెస్టివల్ ఫోకస్ కంట్రీగా ఏ దేశాన్ని చేర్చారు?
- ఆస్ట్రేలియా
- ఫ్రాన్స్
- దక్షిణాఫ్రికా
- అమెరికా
సమాధానం
2. ఫ్రాన్స్
4. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ నుంచి ఇన్‌పుట్‌ల ఆధారంగా గత నవంబర్‌లో ఇండియన్ నేవీతో కలిసి యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్‌లను ఏ దేశ నావికా దళం నిర్వహించింది?
- మాల్దీవులు
- ఆస్ట్రేలియా
- బంగ్లాదేశ్
- శ్రీలంక
సమాధానం
4. శ్రీలంక
5. భారతీయ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను నౌకాదళంలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
- 2014
- 2008
- 2013
- 2012
సమాధానం
3. 2013
6. హై ఎనర్జీ స్టీరియో స్కోపిక్ సిస్టమ్ అబ్జర్వేటరీ ఏ దేశంలో ఉంది?
- నమీబియా
- జిబౌటీ
- అల్జీరియా
- కెన్యా
సమాధానం
1. నమీబియా
7. ఇటీవల వార్తల్లో నిలిచిన హండిగోడు ఎలాంటి వ్యాధి?
- శ్వాసకోశ వ్యాధి
- బొక్కలకు సంబంధించిన వ్యాధి
- గుండె లేదా రక్తనాళాలకు సంబంధించింది
- అరుదైన వ్యాధి
సమాధానం
2. బొక్కలకు సంబంధించిన వ్యాధి
8. పాముకాటు కేసులు, మరణాలను నోటిఫై చేయదగిన వ్యాధిగా ఏ మంత్రిత్వ శాఖ పేర్కొంది?
- సైన్స్ అండ్ టెక్నాలజీ
- పర్యావరణ, వాతావరణ శాఖ
- గృహ వ్యవహారాల శాఖ
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
సమాధానం
4. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
9. ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది?
- అటవీ
- హార్టీకల్చర్
- పశుపోషణ
- ఆక్వాకల్చర్
సమాధానం
2. హార్టీకల్చర్
10. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ నాలుగో ఎడిషన్ గత డిసెంబర్ 5 నుంచి 15 వరకు ఏ దేశంలో జరిగింది?
- యూఎస్ఏ
- సౌదీ అరేబియా
- యూఏఈ
- ఇండియా
సమాధానం
2. సౌదీ అరేబియా
11. గత డిసెంబర్ 4 నుంచి 6 వరకు వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌ను ఏ నగరం నిర్వహించింది?
- అహ్మదాబాద్
- ముంబయి
- చెన్నై
- హైదరాబాద్
సమాధానం
3. చెన్నై
12. ఉక్రెయిన్‌కు 725 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించిన దేశం?
- ఇజ్రాయెల్
- యూఎస్ఏ
- యూఏఈ
- ఇండియా
సమాధానం
2. యూఎస్ఏ
13. ప్రతి సబ్ డివిజన్‌కు న్యాయ సలహాదారులను ఏ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది?
- కర్ణాటక
- తెలంగాణ
- పశ్చిమబెంగాల్
- కేరళ
సమాధానం
3. పశ్చిమబెంగాల్
14. పీవీ సింధు 2024 సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల టైటిల్‌ను ఎవరిని ఓడించి గెలుచుకుంది?
- ఉ లుయో యు
- లక్ష్యసేన్
- బయో లి జింగ్ అండ్ లిక్వియన్
- జై హెంగ్ జాసొన్
సమాధానం
1. ఉ లుయో యు
15. 2024 లక్నోలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
- ప్రకాశ్
- లక్ష్యసేన్
- ప్రణయ్ ఎం.ఎస్
- చిరాగ్ శెట్టి
సమాధానం
2. లక్ష్యసేన్
16. ఒకటో ఇండో కంబోడియన్ సిస్‌బాక్స్ వ్యాయామం ఏ ప్రదేశంలో ప్రారంభించారు?
- గోవా
- విశాఖపట్నం
- ముంబయి
- పుణె
సమాధానం
4. పుణె
17. తిరుగుబాటు గ్రూపులు సిరియాలోని ఏ ప్రధాన నగరంపై దాడులు ప్రారంభించాయి?
- డమాస్కస్
- అలెప్పీ
- దరా
- మామ్స్
సమాధానం
2. అలెప్పీ
18. క్రిస్టోఫర్ వ్రే తర్వాత ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తదుపరి డైరెక్టర్‌గా ట్రంప్ ఎవరిని ప్రకటించారు?
- తులసి గబ్బార్డ్
- జాన్ రాడ్‌క్లిఫ్
- కాశ్ ప్రమోద్ పటేల్
- రామస్వామి
సమాధానం
3. కాశ్ ప్రమోద్ పటేల్
19. శతాబ్దం క్రితం ప్రారంభమైన రసాయన ఆయుధాల కన్వెన్షన్ ముగింపులో రసాయన నిరాయుధీకరణను సాధించడానికి రసాయన యుద్ధ బాధితుల జ్ఞాపకార్థ దినం ఏ రోజున నిర్వహించారు?
- నవంబర్ 12
- నవంబర్ 22
- నవంబర్ 30
- నవంబర్ 29
సమాధానం
3. నవంబర్ 30
20. ఐఎస్ఎస్ఏ గుడ్ ప్రాక్టీస్ అవార్డు ఆసియా, పసిఫిక్ 2024 గెలుచుకున్న దేశం?
- ఇండియా
- ఇండోనేషియా
- మలేషియా
- జపాన్
సమాధానం
1. ఇండియా
21. సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నమెంట్‌లో తన మొదటి టైటిల్‌ను లక్ష్యసేన్ ఎక్కడ సాధించాడు?
- కాన్పూర్
- లక్నో
- వారణాసి
- ఇండోర్
సమాధానం
2. లక్నో
22. దేశంలో మొదటి ఉబర్ షికారా సేవను ఎక్కడ ప్రారంభించారు?
- సిల్చార్
- శ్రీనగర్
- గుల్మార్గ్
- కుల్గం
సమాధానం
2. శ్రీనగర్
23. భారతదేశ మొదటి అష్టలక్ష్మి ఉత్సవాలను డిసెంబర్ 6 నుంచి 8 వరకు ఏ నగరంలో నిర్వహించారు?
- గువాహటి
- ఇండోర్
- న్యూఢిల్లీ
- షిల్లాంగ్
సమాధానం
3. న్యూఢిల్లీ
24. 2024-25 రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత?
- 7.5 శాతం
- 8.1 శాతం
- 5.4 శాతం
- 7.6 శాతం
సమాధానం
3. 5.4 శాతం
25. అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజును ఎప్పుడు నిర్వహిస్తారు?
- డిసెంబర్ 1
- డిసెంబర్ 2
- డిసెంబర్ 3
- డిసెంబర్ 5
సమాధానం
2. డిసెంబర్ 2
26. డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థలో సైబర్ భద్రతను మెరుగుపరచడానికి దేశంలో ఏ చెల్లింపులు, బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ భాగస్వామ్యం కలిగి ఉంది?
- ఫోన్ పే
- పేటీఎం
- రేజర్ పే
- భారత్ పే
సమాధానం
3. రేజర్ పే
27. 2024-25, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఎఫ్‍డిఐ వృద్ధి చెంది 13.6 బిలియన్ డాలర్లకు చేరుకున్న దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టిన దేశం ఏది?
- సింగపూర్
- ఇండియా
- యూఏఈ
- యూఎస్ఏ
సమాధానం
1. సింగపూర్
28. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సమగ్ర, స్థిరమైన భవిష్యత్తు కోసం వికలాంగుల నాయకత్వాన్ని విస్తరించడం అనే థీమ్‌తో ఏటా ఏ రోజున జరుపుకొంటారు?
- డిసెంబర్ 4
- డిసెంబర్ 2
- డిసెంబర్ 1
- డిసెంబర్ 3
సమాధానం
4. డిసెంబర్ 3
29. 2024, డిసెంబర్ 3 నాటికి భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి?
- 15
- 20
- 35
- 40
సమాధానం
4. 40
30. 'నెటుంబో నంది-న్డైత్వా' ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది?
- జాంబియా
- నమీబియా
- క్యూబా
- దక్షిణాఫ్రికా
సమాధానం
2. నమీబియా