Daily Current Affairs Quiz: 3 January 2025
Current Affairs Quiz

Daily Current Affairs Quiz: 3 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(3 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో హో భాషను చేర్చాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు?

  1. నాగాలాండ్
  2. అస్సాం
  3. మణిపూర్
  4. మిజోరాం
సమాధానం
2. అస్సాం

2. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో ద్వారా ఐఎఫ్‌సీఐ లిమిటెడ్ ఎండీ, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?

  1. రాహుల్ బేవ్
  2. అమితాబ్
  3. ప్రణవ్ చౌడా
  4. అశోక్ చౌదరి
సమాధానం
1. రాహుల్ బేవ్

3. 2024 డిసెంబర్‌ 1న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా ఎవరు భాద్యతలు స్వీకరించారు?

  1. జగ్మోహన్ దాల్మియా
  2. సచిన్ టెండూల్కర్
  3. కర్హద్కర్, అమో
  4. జై షా
సమాధానం
4. జై షా

4. 2024 ఈ ఫుట్‌బాల్ ఆసియా క్రీడలను ఎక్కడ నిర్వహించారు?

  1. బీజింగ్
  2. సింగపూర్
  3. బ్యాంకాక్
  4. కొలంబో
సమాధానం
3. బ్యాంకాక్

5. 2024 పురుషుల హాకీ జూనియర్ కప్‌ను ఏ దేశం గెలుచుకుంది?

  1. శ్రీలంక
  2. ఇండియా
  3. పాకిస్థాన్
  4. నేపాల్
సమాధానం
2. ఇండియా

6. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన విశ్వనాధ్ కార్తికేయ అంటార్కిటికాలోని అత్యంత ఎత్తైన శిఖరం విన్సన్‌ను అధిరోహించాడు, అతని వయసు ఎంత?

  1. 16 సంవత్సరాలు
  2. 17 సంవత్సరాలు
  3. 18 సంవత్సరాలు
  4. 19 సంవత్సరాలు
సమాధానం
1. 16 సంవత్సరాలు

7. సాంప్రదాయ పర్యాటకానికి సంబంధించి దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?

  1. కేరళ
  2. హర్యానా
  3. ఒడిశా
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
4. పశ్చిమ బెంగాల్

8. ఏటా ప్రపంచ మృత్తిక రోజును ఎప్పుడు నిర్వహిస్తారు?

  1. డిసెంబర్ 7
  2. డిసెంబర్ 11
  3. డిసెంబర్ 5
  4. డిసెంబర్ 15
సమాధానం
3. డిసెంబర్ 5

9. ఏటా బానిసత్వ నిర్మూలన రోజును ఎప్పుడు నిర్వహిస్తారు?

  1. డిసెంబర్ 6
  2. డిసెంబర్ 5
  3. డిసెంబర్ 9
  4. డిసెంబర్ 2
సమాధానం
4. డిసెంబర్ 2

10. ఏటా దివ్యాంగుల రోజును ఎప్పుడు నిర్వహిస్తారు?

  1. డిసెంబర్ 3
  2. డిసెంబర్ 5
  3. డిసెంబర్ 7
  4. డిసెంబర్ 9
సమాధానం
1. డిసెంబర్ 3

11. 2024, అక్టోబర్‌లో జీఎస్‌టీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యాయి?

  1. రూ.1.55 లక్షల కోట్లు
  2. రూ.1.87 లక్షల కోట్లు
  3. రూ.1.67 లక్షల కోట్లు
  4. రూ.1.07 లక్షల కోట్లు
సమాధానం
2. రూ.1.87 లక్షల కోట్లు

12. న్యూఢిల్లీలో 32వ కేంద్రీయ హిందీ సమితి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?

  1. రాజ్‌నాథ్ సింగ్
  2. జేపి నడ్డా
  3. అమిత్ షా
  4. మోడీ
సమాధానం
3. అమిత్ షా

13. డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎన్నో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

  1. 44
  2. 49
  3. 47
  4. 42
సమాధానం
3. 47

14. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో దీపం 2.0 పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?

  1. తెలంగాణ
  2. ఆంధ్రప్రదేశ్
  3. కేరళ
  4. మహారాష్ట్ర
సమాధానం
2. ఆంధ్రప్రదేశ్

15. రాష్ట్ర సర్వీసుల్లో మహిళలకు 35 శాతం ఉద్యోగ రిజర్వేషన్లను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది?

  1. తెలంగాణ
  2. మధ్యప్రదేశ్
  3. ఆంధ్రప్రదేశ్
  4. తమిళనాడు
సమాధానం
2. మధ్యప్రదేశ్

16. దేశంలో మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో ఏ రాష్ట్ర పోలీసులు రెండో స్థానంలో నిలిచారు?

  1. తెలంగాణ
  2. ఆంధ్రప్రదేశ్
  3. మహారాష్ట్ర
  4. తమిళనాడు
సమాధానం
1. తెలంగాణ

17. ఇటీవల ఏ దేశం 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఉద్దేశించిన లేఖను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం కోసం పంపింది?

  1. దక్షిణాఫ్రికా
  2. ఇండియా
  3. యూఎస్ఏ
  4. ఆస్ట్రేలియా
సమాధానం
2. ఇండియా

18. భారత్ ఏ సంవత్సరంలో నిర్వహించే ఒలింపిక్ క్రీడల కోసం అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌లో సమర్పించింది?

  1. 2026
  2. 2028
  3. 2036
  4. 2040
సమాధానం
3. 2036

19. ఇండియన్ ఓషన్ రీజియన్‌లో సముద్ర భద్రత పెంచే లక్ష్యంతో ఇటీవల నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు పేరు?

  1. మహాసాగర్ సమ్మిట్
  2. శివసాగర్ సమ్మిట్
  3. సాగరమాల సమ్మిట్
  4. సాగర్ ముక్తి సమ్మిట్
సమాధానం
1. మహాసాగర్ సమ్మిట్

20. మన్‌దీప్ జంగ్రా ఏ క్రీడా విభాగంలో ప్రపంచ టైటిల్ కైవసం చేసుకున్నాడు?

  1. ఆర్చరీ
  2. బాక్సింగ్
  3. జూడో
  4. రెజ్లింగ్
సమాధానం
2. బాక్సింగ్

21. భారతదేశ విదేశీ సంబంధాల వ్యూహాత్మక రచన ఫ్రెండ్స్-ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజి పార్ట్‌నర్స్ పుస్తకాన్ని రచించినవారు?

  1. ప్రొ. ఆనంద్ ముఖర్జీ
  2. చేతన్ భగత్
  3. ప్రొ. శ్రీరాం చౌలియా
  4. అరవింద్ పనగారియా
సమాధానం
3. ప్రొ. శ్రీరాం చౌలియా

22. డబ్ల్యూటీటీ ఫీడర్ కారకాస్ 2024లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు?

  1. ఓంబిర్లా
  2. సౌమ్యజిత్ ఘోష్
  3. శరత్ కమల్
  4. హర్మీత్ దేశాయ్
సమాధానం
4. హర్మీత్ దేశాయ్

23. 2026 వరకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన దేశం?

  1. ఫ్రాన్స్
  2. ఇండియా
  3. బ్రెజిల్
  4. ఆస్ట్రేలియా
సమాధానం
2. ఇండియా

24. గోవింద్ సాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?

  1. హిమాచల్ ప్రదేశ్
  2. గుజరాత్
  3. హర్యానా
  4. పంజాబ్
సమాధానం
1. హిమాచల్ ప్రదేశ్

25. వియాత్నం, ఇండియా ద్వైపాక్షిక ఆర్మీ ఎక్సర్‌సైజ్ 2024 ఎక్కడ నిర్వహించారు?

  1. భోపాల్ (మధ్యప్రదేశ్)
  2. వారణాసి (ఉత్తరప్రదేశ్)
  3. అంబాల (హర్యానా)
  4. జైసల్మీర్ (రాజస్థాన్)
సమాధానం
3. అంబాల (హర్యానా)

26. ఏ రెండు రాష్ట్రాల మధ్య చిరుతలు తరలించడానికి జాయింట్ కారిడార్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు?

  1. మధ్యప్రదేశ్,సి గుజరాత్
  2. మధ్యప్రదేశ్, రాజస్థాన్
  3. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర
  4. మధ్యప్రదేశ్, జార్ఖండ్
సమాధానం
2. మధ్యప్రదేశ్, రాజస్థాన్

27. ఇటీవల వార్తల్లో కనిపించిన తాబేలు వన్యప్రాణుల అభయారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?

  1. వారణాసి
  2. గోరఖ్‌పూర్
  3. ప్రయాగ్ రాజ్
  4. మీరట్
సమాధానం
1. వారణాసి

28. డుమా బోకో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

  1. నైజీరియా
  2. కెన్యా
  3. రువాండా
  4. బోట్స్‌వానా
సమాధానం
4. బోట్స్‌వానా

29. 2025, జనవరి 28 నుంచి 14 వరకు జరిగే జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం?

  1. ఉత్తరాఖండ్
  2. మధ్యప్రదేశ్
  3. కర్ణాటక
  4. గుజరాత్
సమాధానం
1. ఉత్తరాఖండ్

30. సుప్రీంకోర్టు ఇటీవల మార్గదర్శకాల ప్రకారం 2030 నాటికి ఏ రాష్ట్రంలో జరుగుతున్న బాల్య వివాహాలను నిర్మూలించాలని పేర్కొంది?

  1. కేరళ
  2. రాజస్థాన్
  3. ఆంధ్రప్రదేశ్
  4. ఒడిశా
సమాధానం
2. రాజస్థాన్

Post Comment