దోస్త్ నోటిఫికేషన్ 2022 – తెలంగాణ డిగ్రీ ప్రవేశాలు
Admissions University Entrance Exams

దోస్త్ నోటిఫికేషన్ 2022 – తెలంగాణ డిగ్రీ ప్రవేశాలు

తెలంగాణ యూనివర్శిటీలు మరియు వాటి అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ ప్రకటన ద్వారా 2022-23 విద్య ఏడాదికి సంబంధించి బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీబీఎం మరియు డీ.ఫార్మసీ కోర్సుల యందు అడ్మిషన్లు కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ 2022

Notification Name DOST 2022
Notification Type Admissions
Admission For UG Courses
Eligibility Intermediate
Admission Fee 200/-
Admission Level University Level
Class begins 01 Oct 2022

తెలంగాణ దోస్త్ అడ్మిషన్ సమాచారం

దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందే యూనివర్సిటీలు

దోస్త్ రిజిస్ట్రేషన్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు మరియు వాటి అనుబంధ కాలజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. గతంలో యూనివర్సిటీ వారీగా సాగె ఈ అడ్మిషన్ ప్రక్రియను, ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు.

  • ఉస్మానియా యూనివర్సిటీ & దాని అనుబంధ డిగ్రీ కళాశాలలు
  • కాకతీయ యూనివర్సిటీ & దాని అనుబంధ డిగ్రీ కళాశాలలు
  • తెలంగాణ యూనివర్సిటీ & దాని అనుబంధ డిగ్రీ కళాశాలలు
  • పాలమూరు యూనివర్సిటీ & దాని అనుబంధ డిగ్రీ కళాశాలలు
  • మహాత్మా గాంధీ యూనివర్సిటీ & దాని అనుబంధ డిగ్రీ కళాశాలలు
  • శాతవాహన యూనివర్సిటీ & దాని అనుబంధ డిగ్రీ కళాశాలలు
  • తెలంగాణ మహిళా యూనివర్సిటీ & దాని అనుబంధ డిగ్రీ కళాశాలలు

దోస్త్ ద్వారా అడ్మిషన్ పొందే డిగ్రీ కోర్సులు

బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్ (B.Sc) కోర్సులు
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ (B.A) కోర్సులు
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ (B.Com ) కోర్సులు
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ - ఒకేషనల్  (B.Com -Voc) కోర్సులు
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆనర్స్ - ఒకేషనల్  (B.Com -Hon) కోర్సులు
బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ (B.SW) కోర్సులు
బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (B.BA) కోర్సులు
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (B.BM) కోర్సులు
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (B.CA) కోర్సులు
డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharm)

దోస్త్ ఎలిజిబిలిటీ నియమాలు

  • విద్యార్థి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • విద్యార్థి ఆధార్ నెంబర్, ఫోను నెంబరుతో లింక్ చేయబడి ఉండాలి.
  • దరఖాస్తు చేసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.
  • ఇతర రాష్ట్రాల విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
  • తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పాలిటెక్నిక్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రెగ్యులర్ ఇంటర్ ఉత్తీర్ణతతో పాటుగా కంపార్టుమెంట్ పరిక్షాల్లో ఉత్తీర్ణత పొందిన వారు కూడా అర్హులు.

దోస్త్ 2022 షెడ్యూల్

దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ మూడు ఫేజులలో నిర్వహిస్తున్నారు. మొదటి విడత ప్రవేశ ప్రక్రియ జులై 1 నుండి ఆగష్టు 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అలానే రెండవ విడత ప్రవేశాలు ఆగష్టు 7వ తేదీ నుండి ఆగష్టు 27 తేదీ మధ్య, మూడవ విడత ప్రవేశాలు ఆగష్టు 29 నుండి సెప్టెంబరు 16వ తేదీల మధ్య జరపనున్నారు.

దోస్త్ షెడ్యూల్ 2022 మొదటి ఫేజ్ రెండవ ఫేజ్  మూడవ ఫేజ్ 
రిజిస్ట్రేషన్ తేదీలు 1-30 జులై 2022 7-21 ఆగష్టు 2022 29/08 -12/09 2022
వెబ్ ఆప్షన్ తేదీలు 6-30 జులై 2022 7-22 ఆగష్టు 2022 29/08 -12/09 2022
స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ 28-29 జులై 2022 18 ఆగష్టు 2022 09 సెప్టెంబరు 2022
సీట్ల కేటాయింపు 6 ఆగష్టు 2022 27 ఆగష్టు 2022 16 సెప్టెంబరు 2022
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 7-22 ఆగష్టు 2022 27/08 -10/09 2022 16/09-22/09 2022

దోస్త్ 2022 రిజిస్ట్రేషన్ ఫీజు

రిజిస్ట్రేషన్ రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి. మొదటి విడుత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ రుసుము 200/- కేటాయించారు. అలానే 2 మరియు 3వ విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ రుసుము 400/- కేటాయించారు.

అడ్మిషన్ విడత దరఖాస్తు ఫీజు పేమెంట్ తేదీలు
మొదటి విడత 200 /- 01.07.2022 to 30.07.2022
రెండవ విడత 400 /- 07.08.2022 to 21.08.2022
మూడవ విడత  400 /- 29.08.2022 to 12.09.2022

దోస్త్ 2022 రిజిస్ట్రేషన్ విధానం

దోస్త్ 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి ఆన్‌లైన్ విధానంలో, ప్రత్యేక సాంకేతికత ద్వారా విద్యార్థులు సులభంగా తమ మొబైల్ ఫోనుల ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం విద్యార్థులు ఆండ్రాయిడ్ ప్లే స్టోరు నుండి టీ యాప్ ఫోలియోను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో విద్యార్థి కేవలం సెల్ఫీ ఫోటోను అప్‌లోడ్ చేస్తే, విద్యార్థి వివరాలు ప్రత్యేక్షమయ్యేలా సాంకేతిక ఏర్పాటు చేసారు. ఈ సేవలు ఈ ఏడాది ఇంటర్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మిగతా విద్యార్థులు అధికారిక దోస్తు వెబ్‌సైట్ ద్వారా లేదా స్థానిక మీసేవ కేంద్రాలు ద్వారా దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తున్నారు. దీని కోసం విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల ఆధార్ నెంబరు, వారి ఫోను నెంబరుతో లింక్ చేసుకుని ఉండాలి.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విద్యార్థి వ్యక్తిగత, విద్య మరియు చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. అలానే విద్యార్థి ఫోటో, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్ ఐడీ వంటి వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది. చివరిగా అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే విద్యార్థికి దోస్త్ ఐడీ మరియు పిన్ వివరాలు పంపించబడతాయి. ఈ వివరాలు అడ్మిషన్ ప్రక్రియ పూర్తీయ్యే వరకు విద్యార్థులు భద్రపర్చుకోవాల్సి ఉంటుంది.

దోస్త్ సీట్ల కేటాయింపు విధానం

దోస్తు అడ్మిషన్ ప్రక్రియ, విద్యార్థి ఇంటర్ యందు సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దోస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న విద్యార్థులు, నిర్ణహించిన వెబ్ ఆప్షన్ షెడ్యూల్ ప్రకారం కాలేజీ మరియు జాయిన్ అయ్యే కోర్సుల ప్రాధాన్యత జాబితాను పొందుపర్చాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపు విద్యార్థి ఎంపిక చేసుకున్న వెబ్ ఆప్షన్ అనుచరించి ఉంటుంది. ఇందులో విద్యార్థి ఇంటర్ మెరిట్ మరియు మరియు రిజర్వేషన్ కోటా ఆధారంగా తుది కేటాయింపు ఉంటుంది.

అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటును ధృవీకరించాల్సి ఉంటుంది. అలానే సీటు నిర్దారణ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దానితో పాటుగా సంబంధిత కాలేజీని సందర్శించి, అవసరమయ్యే సర్టిఫికెట్లను ప్రిన్సిపాల్'కి అందించాల్సి ఉంటుంది. అడ్మిషన్ పొందిన కోర్సులు లేదా కాలేజీ నచ్చని విద్యార్థులు రెండవ విడుత అడ్మిషన్ ప్రక్రియలో మరోమారు వెబ్ ఆప్షన్ల ఎంపికలో పాల్గునాల్సి ఉంటుంది.

దోస్త్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివరాలు

  • రిజర్వేషన్ కేటగిరిలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు, మీసేవ ద్వారా సంబంధిత కుల ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది.
  • 1 ఏప్రిల్ 2021 తర్వాత పొందిన కుల ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
  • అలానే NCC, Ph వంటి ఇతర సర్టిఫికెట్లను అప్లోడు చేయాల్సి ఉంటుంది.
  • ప్రభుత్వ మరియు యూనివర్సిటీలో సీట్లు పొంది, ఈపాస్ రీయింబర్స్‌మెంట్ అర్హుత ఉన్న విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొంది, ఈపాస్ రీయింబర్స్‌మెంట్ అర్హుత ఉన్న విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో 500/- ఫీజు చెల్లించాలి.
  • ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొంది, ఈపాస్ రీయింబర్స్‌మెంట్ అర్హుత లేని విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో 1,000/- ఫీజు చెల్లించాలి.

దోస్త్ హెల్ప్ లైన్ సమాచారం

దోస్త్ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 40 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసారు. ఇందులో 6 సెంటర్లను ఈ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గునే యూనివర్సిటీల యందు అందుబాటులో ఉంచారు. ఇవి దోస్తు సంభందించి దరఖాస్తు ప్రక్రియ, సర్టిఫికెట్స్ అప్లోడ్ వంటి అంశాలలో సహాయం అందిస్తాయి. అలానే వాట్సాప్ (79010 02200) ద్వారా ఆటో రెస్పాండ్ చాట్ బోట్ కూడా అందుబాటులో ఉంచారు. వీటితో పాటుగా సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా దీనికి సంబంధించిన అవగాహనా సమాచారమును అందిస్తున్నారు.

Facebook: https://www.facebook.com/dost.telangana
Twitter: https://twitter.com/dost_telangana
YouTube : https://www.youtube.com/c/dost_telangana

Post Comment