Daily Current Affairs Quiz: 8 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 8 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(8 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. 2024, డిసెంబర్ 5న ఇస్రో ఏ వాహక నౌక ద్వారా అధునాతన సూర్య పరిశీలన మిషన్ ప్రోబా- 3ని విజయవంతంగా ప్రయోగించింది?

  1. పీఎస్ఎల్వీ-సీ58
  2. పీఎస్ఎల్వీ-సీ59
  3. పీఎస్ఎల్వీ-సీ60
  4. పీఎస్ఎల్వీ-సీ57
సమాధానం
2. పీఎస్ఎల్వీ-సీ59

2. ఐదో జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ విజేతగా నిలిచిన భారత్ ఏ జట్టుపై విజయం సాధించింది?

  1. బంగ్లాదేశ్
  2. పాకిస్థాన్
  3. శ్రీలంక
  4. చైనా
సమాధానం
2. పాకిస్థాన్

3. 2024 కోసం బీబీసీ వంద మంది స్ఫూర్తి దాయక మహిళల జాబితాలో దేశం నుంచి చోటు పొందిన మహిళ పేరు?

  1. పూజా శర్మ
  2. పూజా వర్మ
  3. పూజా నరవానె
  4. పూజా రెడ్డి
సమాధానం
1. పూజా శర్మ

4. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన టాప్ 100 జాబితాలో దేశం నుంచి చోటు పొందిన నగరం పేరు?

  1. అమరావతి
  2. న్యూఢిల్లీ
  3. హైదరాబాద్
  4. బెంగళూరు
సమాధానం
2. న్యూఢిల్లీ

5. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్తి స్థాయిలో కణతులను తొలగించేందుకు క్లిప్ అండ్ బ్లూ ప్లేస్‌మెంట్ అనే నూతన విధానాన్ని ఏ రాష్ట్ర శాస్త్రవేత్తలు కనుగొన్నారు?

  1. కేరళ
  2. పశ్చిమబెంగాల్
  3. మహారాష్ట్ర
  4. తెలంగాణ
సమాధానం
1. కేరళ

6. వార్తల్లో నిలిచిన డాంగ్ ఫెంగ్-100 ఏ దేశానికి చెందిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి?

  1. రష్యా
  2. ఫ్రాన్స్
  3. ఇరాన్
  4. చైనా
సమాధానం
4. చైనా

7. దేశంలో లింగ ఆధారిత హింసను రూపు మాపడానికి ప్రారంభించిన పథకం పేరు?

  1. శక్తి అభియాన్
  2. అబ్ కోయి బెహన్ నహీ
  3. నిర్భయ ఇనిషియేటివ్
  4. బేటీ బచావో
సమాధానం
2. అబ్ కోయి బెహన్ నహీ

8. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఏ రాష్ట్రంలో ఉద్భవించింది?

  1. బీహార్
  2. మహారాష్ట్ర
  3. ఒడిశా
  4. కర్ణాటక
సమాధానం
4. కర్ణాటక

9. భారత సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?

  1. డిసెంబర్ 9
  2. డిసెంబర్ 5
  3. డిసెంబర్ 7
  4. డిసెంబర్ 3
సమాధానం
3. డిసెంబర్ 7

10. పునత్సాంగు-ఐ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది?

  1. భూటాన్
  2. నేపాల్
  3. ఇండియా
  4. మయన్మార్
సమాధానం
1. భూటాన్

11. 2024 జూలైలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో పురోగతిని ప్రకటించిన ప్రముఖ టెక్ కంపెనీ ఏది?

  1. ఐబీఎం
  2. మైక్రోసాఫ్ట్
  3. యాపిల్
  4. గూగుల్
సమాధానం
4. గూగుల్

12. మంగోలియాలో భారత సైన్యం పాల్గొన్న సైనిక విన్యాసాల పేరు?

  1. ఎడారి తుఫాన్
  2. ఖాన్ క్వెస్ట్
  3. కోబ్రా గోల్డ్
  4. ఎర్రజెండా
సమాధానం
2. ఖాన్ క్వెస్ట్

13. 2024, జూలై 23న వరుసగా ఏడో బడ్జెట్‌ను సమర్పించడం ద్వారా రికార్డు సృష్టించింది ఎవరు?

  1. మొరార్జీ దేశాయ్
  2. నిర్మలా సీతారామన్
  3. మన్మోహన్ సింగ్
  4. అరుణ్ జైట్లీ
సమాధానం
2. నిర్మలా సీతారామన్

14. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం 2024-25కు అంచనా వేసిన వాస్తవ జీడీపీ వృద్ధి శాతం ఎంత

  1. 4.5- 5 శాతం
  2. 7-8 శాతం
  3. 5-6 శాతం
  4. 6.5- 7 శాతం
సమాధానం
4. 6.5- 7 శాతం

15. భారత మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేతగా అభినవ్ బింద్రా ఏ ఈవెంట్‌లో గెలుచుకున్నాడు. ఏ సంవత్సరంలో అతడు ఈ ఘనతను సాధించాడు?

  1. పురుషుల 50 మీ. ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ 2024 ఏథెన్స్ గేమ్స్
  2. పురుషుల మారథాన్-2016 రియో గేమ్స్
  3. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్- 2008 బీజింగ్ గేమ్స్
  4. పురుషుల 100 మీ. స్ప్రింట్ 2012 లండన్ గేమ్స్
సమాధానం
3. పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్- 2008 బీజింగ్ గేమ్స్

16. 1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో ఏ బిల్లు వస్తుంది?

  1. కాఫీ (ప్రమోషన్, అభివృద్ధి)
  2. బాయిలర్స్ బిల్లు
  3. ఆర్థిక బిల్లు
  4. భారతీయ వాయుయాన్ విధేయక్ 2024
సమాధానం
4. భారతీయ వాయుయాన్ విధేయక్ 2024

17. ఆసియాలో మొట్టమొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత 'ప్రీ క్లినికల్ నెట్‌వర్క్ సౌకర్యం' ఎక్కడ ఉంది?

  1. బెంగుళూరు
  2. న్యూఢిల్లీ
  3. ఫరీదాబాద్
  4. ముంబై
సమాధానం
3. ఫరీదాబాద్

18. ప్రపంచంలోని డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ఎంత శాతం వాటాను కలిగి ఉంది?

  1. 48.5
  2. 60.7
  3. 35.2
  4. 52.1
సమాధానం
1. 48.5

19. బన్వరిలాల్ పురోహిత్ స్థానంలో పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. ఓం ప్రకాష్ మాథుర్
  2. గులాబ్ చంద్ కటారియా
  3. హరిభావు కిసన్ రావ్ బాగ్దే
  4. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
సమాధానం
2. గులాబ్ చంద్ కటారియా

20. భారత ప్రభుత్వం ఏ మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ 'పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా (PARI)' ని ప్రారంభించింది?

  1. పర్యాటక శాఖ
  2. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ
  3. గృహ, పట్టణ వ్యవహారాల శాఖ
  4. సంస్కృతిక మంత్రిత్వ శాఖ
సమాధానం
4. సంస్కృతిక మంత్రిత్వ శాఖ

21. భారత ప్రభుత్వం ప్రారంభించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ అప్లికేషన్ టూల్ పేరు?

  1. అన్నా చక్ర
  2. గ్రైన్ ఫ్లో
  3. ఫుడ్ నెట్
  4. గ్రైన్ ఆప్టిమైజర్
సమాధానం
1. అన్నా చక్ర

22. సోనాయ్-రూపాయి వన్యప్రాణుల అభయారణ్యంలో రాయల్ బెంగాల్ టైగర్ మొదటి ఫొటోగ్రాఫిక్ సాక్ష్యాన్ని అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?

  1. మణిపూర్
  2. మిజోరాం
  3. అసోం
  4. నాగాలాండ్
సమాధానం
3. అసోం

23. ఆసియా ఎక్స్‌పోర్ట్స్ గేమ్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయుడు?

  1. అహ్మద్ ముహైమిన్
  2. పవన్ కాంపెల్లి
  3. పరుల్ త్యాగి
  4. అమిత్ గుప్తా
సమాధానం
2. పవన్ కాంపెల్లి

24. 1990లో నమీబియా ఏ దేశం నుంచి స్వాతంత్ర్యం పొందింది?

  1. జింబాబ్వే
  2. జాంబియా
  3. బోట్స్‌వానా
  4. దక్షిణాఫ్రికా
సమాధానం
4. దక్షిణాఫ్రికా

25. 2024, డిసెంబర్‌లో విదేశాంగ మంత్రి స్థాయిలో సహకారం కోసం జాయింట్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

  1. జోర్డాన్
  2. కువైట్
  3. బహ్రెయిన్
  4. లిబియా
సమాధానం
2. కువైట్

26. 2024, జూలైలో తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అందుకున్న రష్యా అత్యున్నత పౌర పురస్కారం పేరు?

  1. సెయింట్ ఆండ్ర్యూ ది అపోస్టల్ ఆర్డర్
  2. సెయింట్ జార్జ్ ఆర్డర్
  3. అలెగ్జాండర్ నెవ్‌స్కీ ఆర్డర్
  4. ఫ్రెండ్‌షిప్ ఆర్డర్
సమాధానం
1. సెయింట్ ఆండ్ర్యూ ది అపోస్టల్ ఆర్డర్

27. ఆదిత్య ఎల్1 వ్యోమనౌకకు ఎల్1 పాయింట్ చుట్టూ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది?

  1. 92 రోజులు
  2. 178 రోజులు
  3. 365 రోజులు
  4. 730 రోజులు
సమాధానం
2. 178 రోజులు

28. భారతదేశం-థాయిలాండ్ సంయుక్త సైనిక విన్యాసాలు మైత్రీ 13వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు?

  1. ఫోర్ట్ వచిరప్రకాన్, తక్ ప్రావిన్స్, థాయిలాండ్
  2. ఉమ్రోయ్, మేఘాలయ
  3. బ్యాంకాక్,థాయిలాండ్
  4. న్యూఢిల్లీ
సమాధానం
1. ఫోర్ట్ వచిరప్రకాన్, తక్ ప్రావిన్స్, థాయిలాండ్

29. టీ20-2024 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇద్దరు భారతీయ క్రికెట్ ఆటగాళ్లు ఎవరు

  1. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా
  2. విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని
  3. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
  4. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్
సమాధానం
3. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ

30. 2024 జూలైలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి దేశంలోని ఏ రాష్ట్రం కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది?

  1. కర్ణాటక
  2. తమిళనాడు
  3. గుజరాత్
  4. మహారాష్ట్ర
సమాధానం
2. తమిళనాడు

Post Comment