టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో 2024
March Telugu Current Affairs

టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో 2024

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో 2024ను ఏప్రిల్ 30న చేసింది. టిడిపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవణ్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ కో-కన్వీనర్ శైలేంద్రనాథ్ సింగ్‌ ఇందులో పాల్గొన్నారు.

Advertisement

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తమ మేనిఫెస్టోను ‘సూపర్‌ సిక్స్‌’గా పేర్కొంది. ఈ కూటమిలో మూడు పార్టీలు ఉన్నా, మేనిఫెస్టోలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రం కాని, ఇతర రాష్ట్ర బీజేపీ నాయకుల ఫోటోలు కాని లేవు. మ్యానిఫెస్టో కవర్ పేజీలో టీడీపీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు, నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాలు మాత్రమే ఉన్నాయి.

ఈ మూడు పార్టీల కూటమి, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు  25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటు ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ పడుతున్నాయి.

కూటమి సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, రాష్ట్ర రాజధానిగా అమరావతి, రైతులకు రూ.20వేలు పెట్టుబడి సాయం, 19-59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500, పాఠశాలకు వెళ్లే పిల్లలకు రూ.15వేలు, నిరుద్యోగ భృతి రూ.3వేలు, నెలకు ఇరవై లక్షల ఉద్యోగాల సృష్టి, రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా మరియు మహిళా గ్రూపులకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు ఉన్నాయి.

టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలు

  1. యువతకు 20 లక్షల ఉద్యోగాలు / నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి.
  2. స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం.
  3. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం.
  4. 19 నుండి 59 ఏళ్ళ లోపు ప్రతి మహిళకి నెలకు రూ. 1500 ఆర్థిక సాయం.
  5. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ.
  6. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు.

యువత సంక్షేమం

  • మెగా డిఎస్సీ నిర్వహణ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల.
  • ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ల ఏర్పాటు.
  • అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టారుకు ప్రోత్సాహకాలు.
  • మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రం పునఃప్రారంభం మరియు విస్తరణ.
  • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగా కల్పన.
  • ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా శిక్షణ.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీల స్థాపన.
  • ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు.
  • ప్రతి 5 ఏళ్లకు ఒక సారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు.

బీసీ సంక్షేమం

  • బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ.4 వేల పెన్షన్ అందజేత.
  • బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం.
  • బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు.
  • బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్.
  • చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు ప్రణాళిక.
  • బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరణ.
  • దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు.
  • స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు మంజూరు.
  • రూ.5000 కోట్లతో 'ఆదరణ' పథకం పునరుద్ధరణ.
  • బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం

  • జిల్లావారీగా ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అమలు.
  • ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు.
  • ఎస్సీ, ఎస్టీల సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు.
  • ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం, జీవో 3 పునరుద్ధరణ.
  • ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ.
  • డా. సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రూబాయ్, డా అచ్చెన్న తదితరుల హత్యలకు కారకులను కోర్టుల్లో శిక్షపడే విధంగా చర్యలు.
  • ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ.

ఇతర కులాల సంక్షేమం

  • అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపక యూనిట్ల స్థాపనకు రాయితీలు.
  • గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం.
  • చేనేత ఉత్పత్తులపై జీయస్టి రీయింబర్స్ అందజేత.
  • పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు. హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్.
  • దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ. 25 వేలు గౌరవ వేతనం.
  • నాయీబ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్.
  • గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% కేటాయింపు.
  • వడ్డెర కులాలకు క్వారీల్లో 15% రిజర్వేషన్ అమలు, రాయల్టీ, సీనరీ ఛార్జీల్లో మినహాయింపు.
  • రజకలకు దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీల రాయితీ మంజూరు.
  • మత్స్యకారులకు సముద్రంలో వేట విరామ సమయంలో రూ.20,000 ఆర్థిక సాయం, అలానే జీవో 217 రద్దు.
  • బోట్ల మరమ్మత్తులు, ఆధునిక కమ్యూనికేషన్ కొరకు ఆర్థిక సాయం.
  • స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు.
  • కాపుల సంక్షేమం కోసం రానున్న అయిదేళ్లలో రూ.15 వేల కోట్లు నిధులు కేటాయింపు.
  • కాపుల సాధికారిత, అభివృద్ధి కోసం చర్యలు. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత.
  • కాపు భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాం.
  • ఆర్యవైశ్య కార్పొరేషన్ కొరకు నిధులు కేటాయింపు.
  • చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాల సౌలభ్యం
  • స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు.
  • కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహణ.
  • భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు.

మైనారిటీల సంక్షేమం

  • ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్.
  • మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయింపు.
  • విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం.
  • నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు.
  • మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.
  • ఇమామ్, మౌజన్లకు ప్రతినెలా రూ.10 వేలు మరియు రూ.5 వేలు గౌరవ వేతనం.
  • అర్హత ఉన్న ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియామకం.
  • మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం.
  • హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.1 లక్ష సాయం.
  • క్రిష్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు.
  • చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సాయం, స్మశాన వాటికలకు స్థల కేటాయింపు.
  • జెరూసలెం యాత్రికులకు ఆర్థిక సాయం.

సామాజిక భద్రత పింఛన్లు పెంపు

  • సామాజిక భద్రత పింఛన్లు ఏప్రిల్ 2024 నుంచి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంపు.
  • దివ్యాంగుల పింఛన్ రూ.3 వేల నుంచి రూ. వేలకు పెంపు.
  • పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్.
  • కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్.

పేదలందరికీ నాణ్యమైన ఇళ్ళు

  • గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు.
  • ఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి.

వ్యవసాయం

  • 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా.
  • రాయితీతో సోలార్ పంప్‌సెట్లు పంపిణి. మిగిలిన సోలార్ విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు.
  • సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత.
  • ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
  • కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి, అన్ని సంక్షేమ పథకాలు అమలు. పంటల బీమా వర్తింపు.
  • రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు / సంక్షేమ పథకాల అమలు.
  • ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాలలో సేంద్రీయ వ్యవసాయం చేపట్టి, వారికి ఆర్థిక, సాగు, మార్కెటింగ్ అంశాల్లో తోడ్పాటు.
  • ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజి యూనిట్ల ఆధునీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటు.
  • దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీయంసీ యాక్ట్ పటిష్టంగా అమలు.
  • డ్రిప్ ఇరిగేషన్‌కు 90% సబ్సిడీ మంజూరు.
  • రాష్ట్రంలో సెరికల్చర్ ప్రోత్సహించి రైతులకు తోడ్పాటు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పన.

వైద్యం మరియు ఆరోగ్యం

  • దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా.
  • ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు.
  • అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాల ఏర్పాటు.
  • బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ.
  • చంద్రన్న బీమా పథకం కింద సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు బీమా సౌకర్యం.

విద్యారంగం

  • రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు, మూతపడిన పాఠశాలల పునఃప్రారంభం.
  • డా. అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ.
  • కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ.
  • ఎయిడెడ్ కాలేజీలు, ప్రయివేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరణ.
  • కాలేజీలకే ఫీజు రుసుము చెల్లించి, సర్టిఫికేట్లు విద్యార్థులకు అందేలా చర్యలు.

వృత్తి నిపుణుల సంక్షేమం

  • అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం.
  • న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి.
  • ఉచిత న్యాయ సేవల అందుబాటుకు లీగల్ కియోస్క్ ల స్థాపన.
  • జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టయిఫండ్ నెలకు రూ.10 వేలు.
  • జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు.
  • అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి, బాధితులకు ఆ సొమ్ము అందేలా చర్యలు.
  • గత అయిదేళ్లుగా వివిధ వ్యవస్థలు విధ్వంసమైన నేపథ్యంలో వ్యవస్థలను పటిష్టపరిచి సుపరిపాలన.
  • 5 ఏళ్లలో క్షీణించిన శాంతి భద్రతలను పునరుద్దరిస్తాం.
  • లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు అత్యంత ఎక్కువ ప్రధాన్యం.

ఇతర ముఖ్యమైన హామీలు

  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, ప్రజల ఆస్తులకు రక్షణ.
  • పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి.
  • గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార-నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల శీఘ్రుతర నిర్మాణానికి చర్యలు.
  • రాష్ట్రంలోని నదుల అనుసంధానం-ప్రతి ఎకరాకు నీరు.
  • రాయలసీమ, ఉత్తరాంద్ర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి.
  • చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష.
  • పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రన.
  • మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు.
  • అన్న క్యాంటీన్ల ఏర్పాటు/ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదలకు ఉచిత ఆహారం.
  • రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి, పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం.
  • ఉచిత ఇసుక విధానం అమలు.
  • సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం.
  • అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు.
  • డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ.4 లక్షల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ.
  • బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం.
  • జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు.
  • వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు.

దేవాలయాలు.. బ్రాహ్మణుల సంక్షేమం

  • * హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు.
  • ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమమ్ వేతనం ఉండేలా ఏర్పాటు.
  • వార్షిక ఆదాయం రూ.50 వేలకు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలకు పెంపు.
  • వార్షిక ఆదాయం రూ.50 వేలకు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
  • వైదిక, ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి.
  • తిరుపతి / ఒంటిమిట్ట వంటి పుణ్య క్షేత్రాల పవిత్రతకి మూలధారాలైన వేరు, కాళ్ల మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ.
  • దేవాలయాలకు పూర్తి రక్షణ. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారికి శిక్షపడే విధంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసి శిక్షలు అమలు.
  • పురోహితులకు, వంట బ్రాహ్మణులకు కులవృత్తి గుర్తింపు.
  • బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం.
  • తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా అపాయింట్.
  • బ్రాహ్మణులు అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తాం.
  • వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు 'యువగళం' కింద రూ.3 వేల నిరుద్యోగభృతి.

మౌలిక వసతుల కల్పన

  • ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం.
  • గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు రోడ్ల నిర్మాణం.
  • పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి.
  • విజన్ 2047 ప్రణాళిక ద్వారా వికసిత భారత్ నిర్మాణానికి సంబందించిన కార్యక్రమాలు అమలు.
  • వర్క్ ఫ్రొమ్ హోమ్ కొరకు ప్రతి మండల, జిల్లా కేంద్రాలలో వర్క్ స్టేషన్ల ఏర్పాటు.
  • ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు సరఫరా.
  • గత అయిదేళుగా విద్యంపానికి గురైన బాండ్ ఏపీని తిరిగి ప్రతిష్ఠాపన.

ఉత్తరాంధ్ర అభివృద్ధి

  • విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం.
  • వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ తో ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికీకరణకు బాటలు.
  • విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం. అవసరం అయిన, అనువైన భూమిని వెంటనే కేటాయించి జోన్ను సాకారం చేస్తాం.
  • విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షిస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళి-వంశధార నదుల అనుసంధానం.
  • తోటపల్లి రిజర్వాయర్ ఆధునీకరణ వంటి ప్రాజెక్టుల సత్వర నిర్మాణం.
  • జీడిమామిడి, కొబ్బరి ధరల స్థిరీకరణ కోసం చర్యలు.
  • కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి చర్యలు.

రాయలసీమ అభివృద్ధి

  • తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యత.
  • హార్టీకల్చర్ హబ్‌గా, విత్తన రాజధానిగా రాయలసీమ అభివృద్ధి.
  • కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు.
  • కియా, ఇసుజు లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకొచ్చి రాయలసీమను ఆటోమొబైల్ హబ్‌గా అభివృద్ధి.
  • చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ను రాయలసీమలోని కీలక పట్టణాలకు అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా అభివృద్ధి.
  • యువగళం యాత్రలో ప్రకటించిన 'మిషన్ రాయలసీమ' అమలుకు చర్యలు.

పంచాయతీరాజ్ డిక్లరేషన్

  • ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తాం.
  • పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం కల్పన, స్థానిక పాలనకు ఊతం.
  • పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అభివృద్ధికి ఒక విజన్ ఏర్పాటు.
  • పంచాయతీరాజ్ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయింపు.
  • పంచాయతీరాజ్ బడ్జెట్ ఐదేళ్లలో 10% వరకు పెంపు.
  • సర్పంచ్ నుండి జెడ్పీ ఛైర్మన్ల వరకు ప్రస్తుత గౌరవ వేతనం పెంపు.

Advertisement

Post Comment