ఏఐఈఈఏ పీజీ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions Agriculture Exams NTA Exams

ఏఐఈఈఏ పీజీ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

ఐసీఏఆర్ ఏఐఈఈఏ పీజీ 2022 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. అగ్రికల్చర్ యూజీ కోర్సులలో అడ్మిషన్లు కల్పించే ఈ పరీక్ష యొక్క దరఖాస్తు ప్రక్రియ 20 జులై 2022 నుండి 19 ఆగష్టు 2022 మధ్య నిర్వహించనున్నారు.

ఐసీఏఆర్-ఏఐఈఈఏ పీజీ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులలో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిరవహిస్తారు. ఐసీఏఆర్-ఏఐఈఈఏ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్ అని అర్ధం.

జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి. దేశంలో ఉన్నా అగ్రికల్చర్ యూనివర్సిటీలన్ని ఐసీఏఆర్ కనుసన్నలలో పనిచేస్తాయి.

ఐసీఏఆర్-ఏఐఈఈఏ ఏయూ పరిధిలో దేశంలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మరియు ఫిషరీ యూనివర్సిటీలు కాగా 4 ఐసీఏఆర్  డ్రీమ్డ్ యూనివర్సిటీలు (IARI, IVRI, NDRI & CIFE,), 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇంకో 4 సెంట్రల్ యూనివెర్సిటీలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియా ఏటా దాదాపు 27 వేలకు పైగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లును, 14 వేల మంది  పోస్ట్ గ్రాడ్యుయేట్లను మరో 4700 మంది పీహెచ్డీలను అందిస్తుంది.

ఏఐఈఈఏ పీజీ పరీక్ష ద్వారా 3075 సీట్లను భర్తీచేయనున్నారు. ఇందులో 2586 సీట్లు 64 ఐసీఏఆర్-ఏఐఈఈఏ అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో భర్తీచేస్తారు. మిగతా 25 సీట్లు స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో (RLB CAU Jhansi, NDRI Karnal and Dr. RP CAU Pusa, Bihar 100% seats) ఏఐఈఈఏ పీజీ పరీక్షా ఆధారంగా భర్తీచేస్తాయి. ఐసీఏఆర్-ఏయూ పరిధిలో 2 ఏళ్ళ నిడివితో దాదాపు 20 రకాల ప్రధాన అగ్రికల్చర్ సబ్జెక్టులతో పాటుగా 96 సబ్ సబ్జెక్టులలో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఏఐఈఈఏ పీజీ 2022

Exam Name ICAR AIEEA PG 2022
Exam Type Admission
Admission For Agriculture PG Courses
Exam Date NA
Exam Duration 2 Hours
Exam Level National Level

ఐసీఏఆర్-ఏఐఈఈఏ పీజీ సమాచారం

ఏఐఈఈఏ పీజీ ద్వారా అడ్మిషన్ పొందే అగ్రికల్చర్ పీజీ కోర్సులు

Plant Biotechnology
Plant Sciences
Phisical Sciences
Entomology & Nemotology
Argonomy
Social Sciences
Statistical Sciences
Horticulture
Forestry Agroforestry and Silviculture
Agriculture Engineering & Technology
Water Science & Technology
Home Science (Community Science)
Animal Biotechnology
Veterinary Science
Animal Sciences
Fisheries Science
Dairy Science
Dairy Technology
Food Science & Technology
Agri Business Management

ICAR ప్రవేశ పరీక్షా ద్వారా అగ్రికల్చర్ డిగ్రీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ (NTS) అందిస్తుంది. అడ్మిషన్ పొందిన ఏడాది తర్వాత బ్యాంకు ద్వారా బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు 2000/-, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు 3000/- చెప్పున ప్రతి నెల అందజేస్తారు. దీనితో పాటుగా ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన టాప్ 600 మందికి ICAR పీజీ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తుంది. పీజీ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత రీసెర్చ్ కోర్సులలో చేరేందుకు ఆసక్తి చూపే అభ్యర్థులకు దీన్ని అందజేస్తారు. పీజీ కోర్సులో చేరిన మొదటి ఏడాదిలో దరఖాస్తు చేసుకుంటే రీసెర్చ్ ప్రోగ్రాంలో చేరే సమయానికి ఇది అందుబాటులోకి వస్తుంది. ఈ స్కాలర్షిప్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా 12,640 /- రూపాయలు అందజేస్తారు. దీనితో పాటుగా విద్యార్థి అకాడమిక్ అవసరాల కోసం ఏడాదికి 6,000/- రూపాయలు కంటైన్జెంట్ గ్రాంట్ అంజేస్తారు.

ఏఐఈఈఏ పీజీ 2022 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 20 జులై 2022
దరఖాస్తు తుది గడువు 19 ఆగష్టు 2022
ఎగ్జామ్ తేదీ -
ఫలితాలు -

ఏఐఈఈఏ పీజీ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి
  • 50 శాతం మార్కులతో సంబంధిత అగ్రికల్చర్ యూజీ కోర్సుల్లో ఉత్తీర్ణతయి ఉండాలి. షెడ్యూల్ కులాల వారికీ 10శాతం మార్కుల సడలింపు ఉంటుంది
  • దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల కనీస వయస్సు 19 ఏళ్ళు నిండి ఉండాలి

ఏఐఈఈఏ పీజీ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి 1150/- (OBC & Other : 1120/-)
ఎస్సీ, ఎస్టీ పీడీ అభ్యర్థులు 570/-

ఏఐఈఈఏ పీజీ పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్, సికిందరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్

ఏఐఈఈఏ పీజీ దరఖాస్తు ప్రక్రియ

ఏఐఈఈఏ  పీజీ పరీక్ష రాసేందుకు ఆసక్తి అర్హుత ఉన్న అభ్యర్థులు NTA ICAR అధికారిక (www.icar.nta.nic.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి.

అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఏఐఈఈఏ పీజీ ఎగ్జామ్ నమూనా

ఏఐఈఈఏ పీజీ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 2 గంటల నిడివితో జరుగుతుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు -1 మార్కు తొలగిస్తారు. సమాధానం గుర్తించని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించారు.

క్వశ్చన్ పేపర్లో మొత్తం 120 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ స్థాయి సిలబస్ నుండి ఇవ్వబడతయి.

 పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
ఆప్షనల్ సబ్జెక్టు 120 480 2.00 గంటలు

ఎగ్జామ్ పూర్తియిన 10 నుండి 15 రోజుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైటులో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. పరీక్షా వివిధ షిఫ్టులలో జరిగితే నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి తుది ఫలితాలు విడుదల చేస్తారు. మార్కుల సమమైనప్పుడు తక్కువ నెగిటివ్ మార్కులు వచ్చేవారికి ప్రధాన్యత ఇస్తారు. అప్పటికి తేలకుంటే ఎక్కువ వయస్సున్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటురు.

Post Comment