కాంగ్రెస్ మేనిఫెస్టో 2024 : కాంగ్రెస్ న్యాయ్ పాత్ర కీ పాయింట్స్
March Telugu Current Affairs

కాంగ్రెస్ మేనిఫెస్టో 2024 : కాంగ్రెస్ న్యాయ్ పాత్ర కీ పాయింట్స్

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ఏప్రిల్ 5న విడుదల చేసింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కెసి వేణుగోపాల్ మరియు పి చిదంబరం తదితర పార్టీల అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘న్యాయ్ పాత్ర : పాంచ్ న్యాయ్ మరియు పచీస్ గ్యారెంటీ పేరుతొ ఈ మేనిఫెస్టో విడుదల చేసింది.

Advertisement

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణన నిర్వహిస్తుందని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీలకు రిజర్వేషన్లపై 50% పరిమితిని పెంచడానికి రాజ్యాంగ సవరణను ఆమోదిస్తామని హామీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ స్థాయిల్లో మంజూరైన పోస్టుల్లో దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించింది.

అలానే సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్ మోడల్‌లో రూ. 25 లక్షల వరకు నగదు రహిత బీమాను అవలంబిస్తామని ఈ మేనిఫెస్టో యందు పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌కు తక్షణమే పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని పేర్కొంది. ప్రతి పేద భారతీయ కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష అందించేలా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది.

సామాజిక న్యాయం

గత ఏడు దశాబ్దాలుగా వెనుకబడిన మరియు అణగారిన తరగతులు మరియు కులాల పురోగతికి కాంగ్రెస్ మొదటి ప్రాధన్యత ఇస్తున్నట్లు పేర్కొంది.  భారతదేశ జనాభాలో దాదాపు 70 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వెనకబడిన వర్గాల అభివృద్ధి కృషి చేస్తున్నట్లు పేర్కొంది.

  • కులాలు మరియు ఉపకులాలు మరియు వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను లెక్కించడానికి కాంగ్రెస్ దేశవ్యాప్త సామాజిక-ఆర్థిక మరియు కుల గణనన నిర్వహణ.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పెంచేందుకు రాజ్యాంగ సవరణ హామీ.
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) ఉద్యోగాలు మరియు విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వు చేసిన పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీలన్నింటినీ ఏడాది వ్యవధిలో భర్తీ.
  • ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో రెగ్యులర్ ఉద్యోగాల కాంట్రాక్టు రద్దు.
  • గృహనిర్మాణం, వ్యాపారాలు ప్రారంభించడం మరియు ఆస్తుల కొనుగోలు కోసం ఎస్సీ మరియు ఎస్టీలకు సంస్థాగత క్రెడిట్‌ సదుపాయం.
  • భూ పరిమితి చట్టాల ప్రకారం పేదలకు ప్రభుత్వ భూమి మరియు మిగులు భూముల పంపిణీని.
  • విద్య కోసం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల నిధులను రెట్టింపు, వారి విదేశీ విద్యకు సహాయం.
  • పేదలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలల నెట్‌వర్క్‌ ఏర్పాటు.
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5)కి సంబంధించి చట్టం అందుబాటులోకి.
  • షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అట్రాసిటీల నిరోధక) చట్టం, 1989 పూర్తిస్థాయిలో అమలు.
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16, 25, 26, 28, 29 మరియు 30 ప్రకారం మతపరమైన మైనారిటీల ప్రాథమిక, భాష, విద్యా హక్కులు అమలు.
  • మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి మౌలానా ఆజాద్ స్కాలర్‌షిప్‌ పునరుద్ధరణ.
  • రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో మరిన్ని భాషలను చేర్చాలనే దీర్ఘకాలిక డిమాండ్లు పరిగణలోకి.
  • తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 పై సమీక్షా.
  • నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద సీనియర్ సిటిజన్లు, వితంతువులు మరియు వికలాంగుల అందించే పెన్షన్‌లు రూ. 1000 కి పెంపు.
  • వికలాంగుల హక్కుల చట్టం, 2016 ఖచ్చితంగా అమలు.
  • LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన జంటల మధ్య పౌర సంఘాలను గుర్తించడానికి చట్టం.
  • సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం రాజస్థాన్ మోడల్ ₹25 లక్షల వరకు నగదు రహిత బీమా అమలు.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్.
  • ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వ రంగంలో ఆరోగ్య బీమా పథకాలకు ప్రోత్సహం.
  • ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల-కమ్-హాస్పిటలు ఏర్పాటు.
  • 2,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రెండవ ఆశా కార్యకర్త నియామకం.
  • ఇమ్యునైజేషన్‌పై జాతీయ మిషన్‌ పూర్తిస్థాయిలో అమలు. 5 సంవత్సరాలలోపు 100 శాతం పిల్లలకు పూర్తి టీకాలు.

యువత కోసం పథకాలు

  • 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా హోల్డర్ లేదా కళాశాల గ్రాడ్యుయేట్‌కు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం.
  • దీని కోసం కొత్త అప్రెంటిస్‌షిప్ హక్కు చట్టానికి కాంగ్రెస్ హామీ. అప్రెంటీస్‌లకు సంవత్సరానికి ₹ 1 లక్ష స్టైపెండ్ అందజేత.
  • ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీక్ కేసులను పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు.
  • స్టార్టప్‌ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్కీమ్‌ పునరుద్ధరణ.
  • ప్రభుత్వ పరీక్షలు, ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు ఫీజులు రద్దు.
  • 21 ఏళ్లలోపు ప్రతిభావంతులైన మరియు వర్ధమాన క్రీడాకారులకు నెలకు ₹ 10,000 చొప్పున క్రీడా స్కాలర్‌షిప్‌ మంజూరు.
  • 2009 విద్యా హక్కు తిరిగి అమలు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్య అమలు.
  • పిల్లలందరూ కనీసం రెండు సంవత్సరాల ప్రీ-స్కూల్ విద్యను పొందేలా ప్రణాళిక. ప్రీ-ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యల ఏకీకరణ వేగవంతం.
  • రాష్ట్ర, జిల్లా మరియు తాలూకా ప్రధాన కార్యాలయాలలో అత్యాధునిక ఇంటర్నెట్-ఆధారిత పబ్లిక్ లైబ్రరీలు ఏర్పాటు.
  • కాలేజీలు, యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి పునరుద్ధరణ.
  • స్పోర్ట్స్ ఫెడరేషన్లు/సంస్థలు/అసోసియేషన్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక చట్టం.
  • 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతిభావంతులైన మరియు వర్ధమాన క్రీడాకారులకు నెలకు ₹10,000 చొప్పున క్రీడా స్కాలర్‌షిప్‌ మంజూరు.

మహాలక్ష్మి పథకం

  •  మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద భారతీయ కుటుంబానికి షరతులు లేకుండా ₹ 1 లక్ష నగదు బదిలీ.
  • 2025 నుండి మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సగం (50 శాతం) రిజర్వేషన్.
  • రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశంలోని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల సంఖ్య రెట్టింపు.
  • వలస మహిళా కార్మికుల కోసం తగినంత నైట్ షెల్టర్‌లు అందుబాటులోకి.
  • లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా సీట్ల రిజర్వేషన్లు 2029 ఎన్నికలో అమలు.
  • మహిళలకు వేతనాల్లో వివక్షను నిరోధించేందుకు 'ఒకే పని, ఒకే వేతనం' అమలు.
  • భారతీయ మహిళా బ్యాంక్ తిరిగి ఏర్పాటు.
  • వర్క్‌ప్లేస్‌లో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం 2013 మరియు గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 వంటివి పూర్తిస్థాయిలో అమలు.

రైతు సంక్షేమం

  • స్వామినాథన్ కమీషన్ సిఫార్సు చేసిన విధంగా పంటలకు కనీస మద్దతు ధరలకు చట్టపరమైన హామీ.
  • వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు.
  • రైతులు తమ ఉత్పత్తులను పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాల్లో విక్రయించేందుకు రైతుల రిటైల్ మార్కెట్‌లు ఏర్పాటు.
  • రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దేశంలోని ప్రతి జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాల, ఒక వెటర్నరీ కళాశాల ఏర్పాటు.
  • ఐదేళ్లలో వ్యవసాయరంగంలో ఆర్ అండ్ డీకి రెట్టింపు నిధులు మంజూరు.
  • సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకార సంఘాలకు డీజిల్‌పై సబ్సిడీని పునరుద్ధరణ.
  • సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు బీమా సౌకర్యం.
  • మత్స్యకార సంఘాలకు బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డ్‌లు (కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల వంటివి) జారీ.
  • మత్స్యకార సంఘాలను కుల గణనలో లెక్కించి కేంద్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు.
  • మత్స్యకార సంఘాల కోసం సహకార బ్యాంకులను ఏర్పాటు.

కార్మికుల సంక్షేమం

  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద వేతనాన్ని రోజుకు ₹400కి పెంపు.
  • పట్టణ పేదలకు పనికి హామీ ఇచ్చే పట్టణ ఉపాధి కార్యక్రమాలు ప్రారంభం.
  • గిగ్ కార్మికులు మరియు అసంఘటిత కార్మికుల హక్కులను రక్షించడానికి మరియు వారి సామాజిక భద్రత కల్పించేందుకు చట్టం.
  • గృహ సహాయకులు మరియు వలస కార్మికుల ఉపాధిని నియంత్రించడానికి చట్టం.
  • రాజ్యాంగాన్ని పరిరక్షించే రేషన్ కార్డ్ హోల్డర్ల జాబితాను అన్ని రాష్ట్రాల్లో వెంటనే అప్‌డేట్.
  • జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 పూర్తిస్థాయిలో అమలు.
  • కర్ణాటక మరియు రాజస్థాన్‌లలో చేసినట్లుగా సబ్సిడీతో కూడిన భోజనాన్ని అందించే ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు.

ప్రజాస్వామ్యా పరిరక్షణ

  • పౌరులకు రాజకీయ వేధింపుల నుండి విముక్తి హామీ.
  • మీడియా పూర్తి స్వేచ్ఛతో పనిచేసే విదంగా వాటి వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ.
  • పరువు నష్టం నేరాన్ని నేరరహితంగా మార్పు.
  • ఇంటర్నెట్ యొక్క ఏకపక్ష మరియు విచక్షణారహిత సస్పెన్షన్‌ను ఎత్తివేత.
  • టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 పునఃసమీక్ష.
  • గోప్యతా హక్కుకు అంతరాయం కలిగించే అన్ని చట్టాలపై పూర్తిస్థాయి సమీక్ష.
  • శాంతియుతంగా సమావేశమయ్యే మరియు సంఘాలను ఏర్పాటు చేసుకునే ప్రజల హక్కులకు మద్దతు.
  • ఒక దేశం ఒకే ఎన్నికలు ఆలోచన రద్దు. రాజ్యాంగం మరియు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు.
  • పార్లమెంటు ఉభయ సభలు ఏడాదికి 100 రోజులపాటు తప్పనిసరి పనిచేసేలా ఏర్పాటు.
  • భారత ఎన్నికల సంఘం, కేంద్ర సమాచార కమిషన్, మానవ హక్కుల కమిషన్, కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కార్యాలయం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు ఓబీసీల కమిషన్లు మరియు ఇతర రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తి బలోపేతం.
  • రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సవరించి, రాజకీయ ఫిరాయింపుల చట్టం పూర్తిస్థాయిలో అమలు.
  • ప్రణాళికా సంఘం పునరుద్ధరణ, చాప్టర్ VIIలో వివరించిన నవ్ సంకల్ప్ ఆర్థిక విధానాలు అమలు.
  • జైళ్లను పునరావాస కేంద్రాలుగా అభివృద్ధి.
  • ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం, ప్రభుత్వ ఆస్తుల నిర్లక్ష్య విక్రయం, పీఎం కేర్స్ స్కామ్, ఇంటెలిజెన్స్ వైఫల్యాలు మరియు ప్రధాన రక్షణ ఒప్పందాలలో అవినీతిపై పూర్తి దర్యాప్తు.
  • జాతీయ న్యాయ కమిషన్ తిరిగి ఏర్పాటు.
  • కాపీరైట్ చట్టం, 1957ని సమీక్షించి బలోపేతం.

ఆర్థిక వ్యవస్థ

  • నవ్ సంకల్ప్ ఆర్థిక విధానాలకు అనుగుణంగా 33 సంవత్సరాల తర్వాత, ఆర్థిక విధానం పునఃసమీక్ష.
  • ఉద్యోగ కల్పన, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.
  • స్వేచ్ఛా వాణిజ్యం మరియు నియమ-ఆధారిత అంతర్జాతీయ వాణిజ్యానికి మద్దతు.
  • గుత్తాధిపత్యం మరియు ఒలిగోపోలీస్ మరియు క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకం.
  • పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే వ్యాపార సంస్థలకు పూర్తి సహకారం.
  • పని ప్రదేశాలలో మరియు ఆర్థిక అవకాశాలను పొందడంలో లింగ వివక్ష మరియు లింగ అసమానత సమస్యలకు పరిష్కారం.
  • స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీతో రుణాలు.
  • వచ్చే ఐదేళ్లలో 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ.
  • అగ్నిపథ్ ప్రోగ్రామ్‌ను రద్దు. త్రివిధ దళాల్లో సాధారణ రిక్రూట్‌మెంట్‌ తిరిగి ప్రారంభం.
  • అంగన్‌వాడీ కార్యకర్తల సంఖ్యను రెట్టింపు చేసి అదనంగా 14 లక్షల ఉద్యోగాలు కల్పన.
  • కొత్త సూక్ష్మ, చిన్న కంపెనీలు మరియు వినూత్న స్టార్టప్‌లలో పెట్టుబడిని నిరోధించే "ఏంజెల్ టాక్స్" మరియు అన్ని ఇతర దోపిడీ పన్ను పథకాలు రద్దు.
  • పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తమైన జీఎస్టీ కౌన్సిల్‌ ఏర్పాటు.
  • వ్యవసాయ ఇన్‌పుట్‌లపై జిఎస్‌టి తొలగింపు.
  • జీఎస్టీ ఆదాయంలో కొంత భాగాన్ని పంచాయత్‌లు, మున్సిపాలిటీలకు కేటాయింపు.
  • ఆన్‌లైన్ వ్యాపారాల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న దుకాణదారులు మరియు చిన్న రిటైల్ వ్యాపారాలకు గణనీయమైన పన్ను మినహాయింపు.
  • వచ్చే ఐదేళ్లలో జిడిపిలో తయారీ రంగం వాటాను 14 శాతం నుంచి 20 శాతానికి పెంచేందుకు కృషి.
  • కొత్త ఎంప్లాయ్‌మెంట్-లింక్డ్ ఇన్సెంటివ్ పథకం అందుబాటులోకి.
  • రహదారి టోల్‌ వసూళ్లపై సమీక్ష.

కేంద్ర-రాష్ట్ర సంబంధాలు

  • రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లోని శాసన క్షేత్రాల పంపిణీపై సమీక్ష. జాబితా III (కాంకరెంట్ లిస్ట్) నుండి జాబితా II (స్టేట్ లిస్ట్)కి బదిలీ చేయడంపై ఏకాభిప్రాయం కోసం కృషి.
  • పన్నుల రాబడిలో రాష్ట్రాలకు సరైన వాటాను అందించడానికి, స్థూల పన్ను రాబడిలో యూనియన్ సెస్ మరియు సర్‌చార్జీలను 5 శాతానికి పరిమితం చేయడానికి చట్టం.
  • కేంద్ర పన్నుల రాబడుల పంపిణీలో రాష్ట్రాల వాటాలను నిర్ణయించడంలో జనాభా పనితీరు మరియు పన్ను ప్రయత్నాలు వంటి అంశాలను పరిగణనలోకి.
  • ఈశాన్య రాష్ట్రాల్లోని స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్‌లకు ఆర్థిక సహాయం.
  • 2014 ఫిబ్రవరి 20న వాగ్దానం చేసిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.
  • జమ్మూ కాశ్మీర్‌కు తక్షణమే పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ. లడఖ్‌లోని గిరిజన ప్రాంతాలను చేర్చేందుకు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ను సవరణ.
  • పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా మంజూరు.
  • గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్, 1991ని సవరణ.
  • ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజనను అన్ని గ్రామాలు మరియు నివాసాలకు విస్తరణ.
  • ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల లోటును అంచనా వేసి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు.
  • మణిపూర్‌లో జరిగిన ఘర్షణలో బాధితులు మరియు ప్రాణాలతో బయటపడిన వారికి తగిన పరిహారం.
  • 2013-14లో కుదిరిన ప్రాథమిక ఒప్పందం ఆధారంగా నాగా గ్రూపులతో తుది పరిష్కారం.
  • ఈశాన్య రాష్ట్రాలలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ పునరుద్ధరణ.

జాతీయ భద్రత

  • సమగ్ర జాతీయ భద్రతా వ్యూహం అమలు.
  • జాతీయ భద్రతా మండలి (ఎన్‌ఎస్‌సి) మరియు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) కార్యాలయం పార్లమెంటు సెలెక్ట్ కమిటీ పర్యవేక్షణలోకి.
  • అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేసి, ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళం ద్వారా సాధారణ రిక్రూట్‌మెంట్ అమలు.
  • చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియమించే ప్రక్రియపై సమగ్ర విధానం.
  • సాయుధ దళాలలో పోరాట మరియు నాన్-కాంబాటెంట్ పాత్రలలో మహిళలకు అవకాశం.
  • 26 ఫిబ్రవరి 2014 నాటి యుపిఎ ప్రభుత్వ ఉత్తర్వుకు అనుగుణంగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు.
  • ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాలు మరియు మత ఘర్షణలు అణచివేత.
  • డ్రగ్స్‌ అక్రమ రవాణా, విక్రయాలపై కఠినంగా చర్యలు.
  • కేంద్ర సాయుధ పోలీసు బలగాల సామర్థ్యం పెంపు.
  • మెరుగైన విదేశీ వాణిజ్యంకు మద్దతు.
  • సరిహద్దు ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు పాక్‌తో సంప్రదింపులు.

పర్యావరణ పరిరక్షణ

  • జాతీయ మరియు రాష్ట్ర వాతావరణ మార్పు ప్రణాళికలను అమలు చేయడానికి స్వతంత్ర పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ మార్పుల అథారిటీని ఏర్పాటు.
  • పునరుత్పాదక ఇంధనం, స్థిరమైన మౌలిక సదుపాయాలు మరియు గ్రీన్ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించే గ్రీన్ న్యూ డీల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్‌ ప్రారంభం.
  • వాయు కాలుష్య సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం బలోపేతం.
  • భారతదేశంలోని నదులు మరియు నీటి వనరులలోకి వ్యర్థాల విడుదలకు అడ్డుకట్ట.
  • మత్స్యకార సంఘాల జీవనోపాధిపై ప్రభావం పడకుండా తీర ప్రాంత మండలాల పరిరక్షణ.
  • 2070 నాటికి నికర జీరో లక్ష్యాన్ని సాధించడానికి గ్రీన్ ట్రాన్సిషన్ కోసం అవసరమైన నిధులు మంజూరు.
  • నగరాలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో తాగునీరు అందించేందుకు దేశవ్యాప్త ప్రణాళికను అమలు.
  • రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, 10 సంవత్సరాలలో అన్ని పట్టణాలు మరియు మున్సిపాలిటీలలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం.

Advertisement

Post Comment