Advertisement
ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల : 6,100 టీచర్ పోస్టులు భర్తీ
Andhra Pradesh Latest Jobs

ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల : 6,100 టీచర్ పోస్టులు భర్తీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ). 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్లు  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అదే రోజు నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

ఏపీ డీఎస్సీ 2024 పోస్టుల వారీగా ఖాళీలు

  • 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)
  • 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)
  • 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)
  • 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)
  • 42 ప్రిన్సిపాల్ పోస్టులు

ఈ భర్తీ ప్రక్రియ ఏప్రిల్ చివరి నాటికి పూర్తిచేసి నియామక పత్రాలు జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గతంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఈ పోస్టులు జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలలో భర్తీ చేస్తామని చెప్పారు.

ఏపీటెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్‌లైన్ కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈసారి డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైసింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్షలు రాసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2024 పూర్తి షెడ్యూల్

నోటిఫికేషన్ తేదీ 12 ఫిబ్రవరి 2024
దరఖాస్తు ఫీజు చివరి తేదీ 21 ఫిబ్రవరి 2024
దరఖాస్తు చివరి గడువు 22 ఫిబ్రవరి 2024
నమూనా ఎగ్జామ్ తేదీ 24 ఫిబ్రవరి 2024
హాల్ టికెట్ విడుదల 5 మార్చి 2024
డీఎస్సీ ఎగ్జామ్ తేదీలు మార్చి 15 నుండి 30 వరకు
డీఎస్సీ ప్రాధమిక కీ 31 మార్చి 2024
డీఎస్సీ తుది కీ 2 ఏప్రిల్ 2024
ఫలితాల ప్రకటన 7 ఏప్రిల్ 2024

జిల్లాల వారీగా ఏపీ డీఎస్సీ 2024 పోస్టుల ఖాళీలు

జిల్లా పేరు ఎస్జీటీ ఎస్ఏ టీజీటీ మొత్తం
శ్రీకాకుళం 104 130 49 263
విజయనగరం 103 97 84 284
విశాఖపట్నం 101 133 95 329
తూర్పు గోదావరి 108 182 102 392
పశ్చిమ గోదావరి 102 145 59 306
కృష్ణ 103 111 65 279
గుంటూరు 109 170 137 416
ప్రకాశం 111 299 93 503
నెల్లూరు 104 140 102 346
చిత్తూరు 101 97 139 337
వైఎస్సాఆర్ 105 81 103 289
అనంతపురం 107 164 115 386
కర్నూలు 1,022 550 121 1,693

Post Comment