Advertisement
పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 4 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు
Study Material Telugu Gk

పరమాణు నిర్మాణం జీకే క్విజ్ 4 | కెమిస్ట్రీ ప్రాక్టీసు ప్రశ్నలు

పరమాణు నిర్మాణం సంబంధించి జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలను సాధన చేయండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. పరమాణు నిర్మాణం అనేది న్యూక్లియస్ (కేంద్రం)తో కూడిన అణువు యొక్క నిర్మాణాన్ని సూచిస్తుంది, దీనిలో ధనాత్మకంగా చార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థంగా ఉండే న్యూట్రాన్లు ఉంటాయి. పరమాణువు యొక్క బయటి ప్రాంతాలను ఎలక్ట్రాన్ షెల్స్ అని పిలుస్తారు. వీటిలో ఋణాత్మక ఎలక్ట్రాన్‌లు ఉంటాయి

1. ఒకే ఆర్బిటాల్ లో  ఉండే రెండు ఎలక్ట్రాన్ లు .....స్పిన్ కలిగి ఉండును  ?

  1. సమ
  2. వ్యతిరేక
  3. స్పిన్ కలిగి ఉండదు
  4. పైవన్నియూ
సమాధానం
2 . వ్యతిరేక   

2. తటస్థ మాంగనీసు పరమాణువులో గల ఒంటరి ఎలక్ట్రాన్ లు మరియు లోహము యొక్క +2 స్థితిలో గల అయాన్ లోని ఒంటరి ఎలక్ట్రాన్ల నిష్పత్తి ?

  1. 1 : 1
  2. 25 : 23
  3. 5 : 3
  4. 3 : 5
సమాధానం
1 . 1 : 1   

3. ఒక p ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్ ల సంఖ్య ?

  1. 4 ఎలక్ట్రాన్లు
  2. 2 ఎలక్ట్రాన్లు సమాంతర స్పిన్ తో
  3. 6 ఎలక్ట్రాన్లు
  4. 2 ఎలక్ట్రాన్లు వ్యతిరేక స్పిన్ తో
సమాధానం
4 . 2 ఎలక్ట్రాన్లు వ్యతిరేక స్పిన్ తో   

4. మాంగనీసు పరమాణువులో 3d ఆర్బిటాల్ యందు ఐదు ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉండును...... ప్రకారము ?

  1. పౌలి వర్జన నియమము
  2. హుండ్స్ నియమము
  3. ఆఫ్ బౌ  నియమము
  4. డీ బ్రోలీ నియమము
సమాధానం
2 .హుండ్స్ నియమము   

5. ఏ పరమాణు సంఖ్యగల మూలకము గురించి ఆఫ్ బౌ సూత్రము వివరించలేక పోయింది ?

  1. 18
  2. 21
  3. 24
  4. 27
సమాధానం
3 . 24 

6. క్రోమియం ఉపయోగించుకునే ఆర్బిటాల్ సంఖ్య ?

  1. 24
  2. 4
  3. 12
  4. 15
సమాధానం
4 . 15   

7. క్రోమియం పరమాణువులో గల ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య ?

  1. 2
  2. 3
  3. 4
  4. 6
సమాధానం
4 . 6   

8. d- ఉపస్థాయిలో భేదపరిచే ఎలక్ట్రాన్ కలిగివున్న మూలకపు పరమాణు సంఖ్య  ?

  1. 13
  2. 19
  3. 20
  4. 21
సమాధానం
1 . 13   

9. పొటాషియంలో శక్తి స్థాయిల క్రమము ?

  1. 3s > 3d
  2. 4s > 3d
  3. 4s > 4p
  4. 4s > 3d
సమాధానం
2 . 4s > 3d   

10. ఒక p ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్ ల సంఖ్య ?

  1. 4 ఎలక్ట్రాన్లు
  2. 2 ఎలక్ట్రాన్లు సమాంతర స్పిన్ తో
  3. 6 ఎలక్ట్రాన్లు
  4. 2 ఎలక్ట్రాన్లు వ్యతిరేక స్పిన్ తో
సమాధానం
4 . 2 ఎలక్ట్రాన్లు వ్యతిరేక స్పిన్ తో   

11. సిలికాన్ వేలన్నీ కర్పరపు ఎలక్ట్రానిక్ విన్యాసము ఇది ఏ నియమాన్ని పాటించదు ?

  1. ఆఫ్ బౌ నియమము
  2. పౌలి వర్జన నియమము
  3. హుండ్స్ నియమము
  4. పైవన్నియు
సమాధానం
3 . హుండ్స్ నియమము    

12. ఎలక్ట్రాన్లు ఆర్బిటాళ్ళ శక్తి పెరిగే క్రమంలో నిండును యీ  సూత్రము ?

  1. ఆఫ్ బౌ నియమము
  2. పౌలి వర్జన నియమము
  3. హుండ్స్ నియమము
  4. పైవన్నియు
సమాధానం
1 . ఆఫ్ బౌ నియమము   

13. ఈ క్రింది వానిలో హైడ్రోజన్ వర్ణపటశ్రేణిలోని విలువతో సమాన పరిమాణము గల తరంగ సంఖ్య గలది ?

  1. బామర్ శ్రేణి యొక్క రేఖ అవధి
  2. లైమన్  శ్రేణి యొక్క రేఖ అవది
  3. లైమన్ శ్రేణి మొదటి రేఖ
  4. బామర్ శ్రేణి మొదటి రేఖ
సమాధానం
2 . లైమన్ శ్రేణి యొక్క రేఖ అవది 

14. లైమన్  శ్రేణిలోని సాధ్యమైన ఎక్కువ తరంగ దైర్గ్యము మరియు సాధ్యమైన తక్కువ తరంగదైర్గ్యల నిష్పత్తి ?

  1. 4/3
  2. 9/8
  3. 27/5
  4. 16/5
సమాధానం
1 . 4/3   

15. హైడ్రోజన్ పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్ . 7 వ శక్తి స్థాయిలోకి ఉద్రికము చెందినది . అయిన సాధ్యపడు ఉద్గార వర్ణపట రేఖల సంఖ్య ?

  1. 12
  2. 15
  3. 21
  4. 18
సమాధానం
3 . 21   

16. హైడ్రోజన్ పరమాణువులోని బోర్ కక్ష్య యొక్క గతిజ శక్తి  మరియు మొత్తం శక్తుల సంఖ్య ?

  1. 1/2
  2. -1/2
  3.  1
  4. -1
సమాధానం
4 . -1   

17. రెండవ మరియు మూడవ బోర్ కక్ష్యల వ్యాసార్ధల నిష్పత్తి ?

  1. 3 : 2
  2. 9 : 4
  3. 2 : 3
  4. 4 : 9
సమాధానం
4 . 4 : 9   

18. భూస్థితిలో ఉన్న హైడ్రోజన్ పరమాణువును ఉద్రిక్త స్థితికి పంపించటానికి కావలసిన కనీస శక్తి  ?

  1. 13.6 ev
  2. -13.6 ev
  3. 3.4 ev
  4. 10.2 ev
సమాధానం
4 . 10.2 ev 

19. హైడ్రోజన్ పరమాణువులోని కక్ష్య మరియు కక్ష్యలను వేరు చేయటానికి కావాల్సిన శక్తి ?

  1. 13.6 ev
  2. -13.6 ev
  3. 17.4 ev
  4. 10.2 ev
సమాధానం
4 . 10.2 ev 

20. ఒక పరమాణువులోని మొదటి మూడు కక్ష్యల వ్యాసార్ధ నిష్పత్తి  ?

  1. 1 : 2 : 3
  2. 3 : 2 : 1
  3. 1 : 4 : 9
  4. 9 : 4 : 1
సమాధానం
3 . 1 : 4 : 9 

21. వస్తు కణమునకు గల డీ బ్రోలి తరంగదైర్గ్యము ?

  1. ద్రవ్య వేగానికి విలోమానుపాతములో ఉండును
  2. శక్తికి విలోమానుపాతములో
  3. ద్రవ్య వేగానికి అనులోమానుపాతములో ఉండును
  4. శక్తికి అనులోమానుపాతములో ఉండును
సమాధానం
1 . ద్రవ్య వేగానికి విలోమానుపాతములో ఉండును   

22. పరమాణు సంఖ్య Z = 24 కలిగిన మూలకము M - కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండును ?

  1. 5
  2. 6
  3. 12
  4. 13
సమాధానం
4 . 13   

23. సీసియం అయాన్ లోని అన్ని s ఆర్బిటాళ్లలో , అన్ని p ఆర్బిటాళ్లల్లో మరియు అన్ని d  ఆర్బిటాళ్లలో ఉండే మొత్తం ఎలక్ట్రాన్ ల సంఖ్య వరుసగా ?

  1. 6 ,26 ,10
  2. 10 , 24 , 20
  3. 8 , 22 , 24
  4. 12 , 20 , 23
సమాధానం
2 . 10 , 24 , 20   

24. కింది మూలకములో M - కర్పరంలో అతి తక్కువ ఎలక్ట్రాన్ గలది ?

  1. K
  2. Mn
  3. Ni
  4. Sc
సమాధానం
1 . K 

25. ఒక మూలకము పరమాణు సంఖ్య 35. భూస్థితిలో ఆ మూలకం యొక్క అన్ని p - ఆర్బిటాళ్లలోని  ఎలక్ట్రాన్ ల సంఖ్య ?

  1. 6
  2. 11
  3. 17
  4. 23
సమాధానం
3 . 17   

26. భూస్థితిలో , ఒక మూలకము M - కర్పరంలో 13 ఎలక్ట్రాన్ లు ఉన్నవి . అయినా ఆ మూలకము ?

  1. కాపర్
  2. క్రోమియం
  3. నికెల్
  4. ఐరన్
సమాధానం
1 . కాపర్   

27. ఒక మూలకము పరమాణు సంఖ్య 25 , ఆ మూలకము భూస్థితిలో 'N ' కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్ లు ఉండును ?

  1. 13
  2. 2
  3. 15
  4. 3
సమాధానం
2 .  2 

28. ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉండి , వివిధ ద్రవ్యరాశులు ఉన్న పదార్దములు ?

  1. ఐసోటోప్ లు
  2. ఐసోబార్ లు
  3.  ఐసోటోన్ లు
  4. అల్లొట్రోప్ లు
సమాధానం
1 . ఐసోటోప్ లు   

29.17 ప్రోటాన్ లు , 18 న్యూట్రాన్లు మరియు 18 ఎలక్ట్రాన్లు ఉన్న Species యొక్క అవేశము ?

  1. + 1
  2. - 1
  3. - 2
  4. nm
సమాధానం
2 . -1   

30. పరమాణ/సంఖ్య ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఒక తటస్థ పరమాణువులో ఉండునవి ?

  1. ప్రోటాన్లు మాత్రమే
  2. ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు
  3. న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లు
  4. న్యూట్రాన్లు , ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు
సమాధానం
4 . న్యూట్రాన్లు , ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు    

Post Comment