ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ). 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అదే రోజు నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ డీఎస్సీ 2024 పోస్టుల వారీగా ఖాళీలు
- 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)
- 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)
- 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)
- 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)
- 42 ప్రిన్సిపాల్ పోస్టులు
ఈ భర్తీ ప్రక్రియ ఏప్రిల్ చివరి నాటికి పూర్తిచేసి నియామక పత్రాలు జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గతంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ పోస్టులు జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలలో భర్తీ చేస్తామని చెప్పారు.
ఏపీటెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్‌లైన్ కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈసారి డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైసింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్షలు రాసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2024 పూర్తి షెడ్యూల్
నోటిఫికేషన్ తేదీ | 12 ఫిబ్రవరి 2024 |
దరఖాస్తు ఫీజు చివరి తేదీ | 21 ఫిబ్రవరి 2024 |
దరఖాస్తు చివరి గడువు | 22 ఫిబ్రవరి 2024 |
నమూనా ఎగ్జామ్ తేదీ | 24 ఫిబ్రవరి 2024 |
హాల్ టికెట్ విడుదల | 5 మార్చి 2024 |
డీఎస్సీ ఎగ్జామ్ తేదీలు | మార్చి 15 నుండి 30 వరకు |
డీఎస్సీ ప్రాధమిక కీ | 31 మార్చి 2024 |
డీఎస్సీ తుది కీ | 2 ఏప్రిల్ 2024 |
ఫలితాల ప్రకటన | 7 ఏప్రిల్ 2024 |
జిల్లాల వారీగా ఏపీ డీఎస్సీ 2024 పోస్టుల ఖాళీలు
జిల్లా పేరు | ఎస్జీటీ | ఎస్ఏ | టీజీటీ | మొత్తం |
---|---|---|---|---|
శ్రీకాకుళం | 104 | 130 | 49 | 263 |
విజయనగరం | 103 | 97 | 84 | 284 |
విశాఖపట్నం | 101 | 133 | 95 | 329 |
తూర్పు గోదావరి | 108 | 182 | 102 | 392 |
పశ్చిమ గోదావరి | 102 | 145 | 59 | 306 |
కృష్ణ | 103 | 111 | 65 | 279 |
గుంటూరు | 109 | 170 | 137 | 416 |
ప్రకాశం | 111 | 299 | 93 | 503 |
నెల్లూరు | 104 | 140 | 102 | 346 |
చిత్తూరు | 101 | 97 | 139 | 337 |
వైఎస్సాఆర్ | 105 | 81 | 103 | 289 |
అనంతపురం | 107 | 164 | 115 | 386 |
కర్నూలు | 1,022 | 550 | 121 | 1,693 |