శ్రీ రామస్వామి మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించే ఎస్ఆర్ఎం జేఈఈఈ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఇంజనీరింగ్ మరియు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
బిట్స్ పిలానీ, వెల్లూరు ఇనిస్టిట్యూట్ తర్వాత తెలుగు విద్యార్థులు అధిక ప్రధాన్యత ఇచ్చే ప్రైవేటు యూనివర్సిటీల జాబితాలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంతర్జాతీయ వసతులతో నాణ్యమైన సాంకేతిక విద్యని అందించటంతో పాటుగా, తమ విద్యార్థులకు ఉన్నత కొలువులు కల్పించడంలో ఇతర యూనివర్సిటీలతో పోటీపడుతోంది.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 80 శాతం విద్యార్థులు బయట రాష్ట్రాలు, బయట దేశాల నుండి వచ్చిన వారే ఉన్నారంటే, ఈ యూనివర్సిటీ ఉన్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. ఎస్ఆర్ఎంకు దేశవ్యాప్తంగా చెన్నై, అమరావతి, హర్యానా మరియు సిక్కిం నగరాల యందు క్యాంపస్లు ఉన్నాయి. అన్ని క్యాంపసులలో కలిపి మొత్తం 7000 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎస్ఆర్ఎం జేఈఈఈ 2023
Exam Name | SRM JEEE 2023 |
Exam Type | Entrance |
Admission For | BE/B.Tech |
Exam Date | 21 April 2023 |
Exam Duration | 2.30 Hours |
Exam Level | University Level |
ఎస్ఆర్ఎం జేఈఈఈ 2023
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు
- మెకానికల్ & సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- నానో టెక్నాలజీ ఇంజనీరింగ్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- రోబోటిక్స్ & ఆటోమోషన్
- ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- కెమికల్ ఇంజనీరింగ్
- బయోటెక్నాలజీ
- బయోమెడికల్ ఇంజనీరింగ్
- బయో ఇన్ఫోమాటిక్స్ ఇంజనీరింగ్
ఎస్ఆర్ఎం జేఈఈఈ 2023 షెడ్యూల్
ఫేజ్ I | ఫేజ్ II | ఫేజ్ III | |
---|---|---|---|
ఎగ్జామ్ తేదీ | 21, 22, 23 ఏప్రిల్ 2023 | 10, 11 జూన్ 2023 | 22, 23 జులై 2023 |
దరఖాస్తు తుది గడువు | 16 ఏప్రిల్ 2023 | 05 జూన్ 2023 | 17 జులై 2023 |
ఎస్ఆర్ఎం జేఈఈ ఎలిజిబిలిటీ
- భారతీయులు, NRO లు, PIO లేదా OCI కార్డులు కలిగినవారు SRMJEEE రాసేందుకు అర్హులు.
- ఫిజిక్స్,కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ/బయోటెక్నాలజీ ల్లో 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయిఉండాలి.
- అభ్యర్థి గరిష్ట వయోపరిమితి 21 ఏళ్ళు.
- దేశ్యవ్యాప్తంగా అన్ని బోర్డుల నుండి ఇంటర్మీడియట్ లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు, ఐఐటీ-జేఈఈ లో మొదటి 1000 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, తమిళనాడులో అన్ని జిల్లాల నుండి మొదటి ర్యాంకు సాధించిన విద్యారులకు, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులకు ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా srm అడ్మిషన్లు కల్పిస్తుంది.
ఎస్ఆర్ఎం జేఈఈ ఎగ్జామ్ ఫీజు
ఎగ్జామ్ ఫీజు ఆన్‌లైన్ | 1200/- |
ఎస్ఆర్ఎం జేఈఈ దరఖాస్తు ప్రక్రియ
ఎస్ఆర్ఎం జేఈఈఈ దరఖాస్తు ప్రక్రియ ఈ ఏడాది ఆన్‌లైన్ మాత్రమే అందుబాటులో ఉంది. అభ్యర్థి ఇమెయిల్ మరియు విద్యా, వ్యక్తిగత వివరాలు పొందుపర్చి, దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఎస్ఆర్ఎం జేఈఈఈ మూడు ఫేజుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎన్ని ఫేజుల్లో పరీక్షకు హాజరు అవ్వాలనుకుంటే అన్ని సార్లు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమకు అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రం మరియు అనుకూలంగా షిఫ్ట్ లేదా స్లాట్ ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థికి చెందిన అడ్మిట్ కార్డు, రిజల్ట్, కౌన్సిలింగ్ తేదీలు వంటి అన్ని సమాచారాలు మొబైల్ లేదా ఇమెయిల్ ద్వారా యూనివర్సిటీ పంపిస్తుంది కాబట్టి దరఖాస్తు సమయంలో సరైన వివరాలు అందించండి. అందుబాటు తేదీల్లో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరయ్యే ముందు దాని పైనున్న నియమ నిబంధనలు ఒకసారి పరీశీలించండి.
ఎస్ఆర్ఎం జేఈఈ ఎగ్జామ్ సెంటర్లు
- ఆంధ్రప్రదేశ్ : అమరావతి, అనంతపూర్, గుంటూరు, ఏలూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తణుకు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
- తెలంగాణ : హైదరాబాద్. సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్.
ఎస్ఆర్ఎం జేఈఈ ఎగ్జామ్ నమూనా
ఎస్ఆర్ఎం జేఈఈ పరీక్ష రిమోట్ ప్రొక్టార్డ్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్ష 2గంటల 30 నిముషాల నిడివితో నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 125 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ లలో ఒక్కొక్క సబ్జెక్టు నుండి 35 ప్రశ్నలు, మ్యాథ్స్/బయాలజీ ల నుండి 40 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుండి 5 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ నుండి 10 ప్రశ్నలు చెప్పున మొత్తం 125 ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష విధానం | రిమోట్ ప్రొక్టార్డ్ ఆన్‌లైన్ మోడ్ | ||||
పరీక్ష సమయం | 2.30 గంటలు | ||||
ప్రశ్నపత్రం | ఆబ్జెక్టివ్ (మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు) | ||||
సబ్జెక్టులు | ఫిజిక్స్ | కెమిస్ట్రీ | మ్యాథ్స్/బయాలజీ | ఇంగ్లీష్ | ఆప్టిట్యూడ్ |
ప్రశ్నల సంఖ్యా | 35 | 35 | 40 | 5 | 10 |
స్కోరింగ్ విధానం | సరైన ప్రశ్నకు 1 మార్కు , ఋణాత్మక మార్కులు లేవు | ||||
మొత్తం మార్కులు | 125 |