తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 12 జులై 2023 కరెంట్ అఫైర్స్ అంశాలు తెలుగులో చదవండి. ఇవి వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
ఎస్‌బిఐ కార్డ్ ఎండీ మరియు సీఈఓగా అభిజిత్ చక్రవర్తి
ఎస్‌బిఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్‌బిఐ కార్డ్), అభిజిత్ చక్రవర్తిని దాని కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించినట్లు నివేదించబడింది. ప్రస్తుతం ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చక్రవర్తి ఆగస్టు 11న ఈ పదవి నుంచి వైదొలగనున్న రామమోహన్‌రావు అమర స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. వచ్చే రెండేళ్ల కాలానికి ఆయన ఈ హోదాలో ఉండనున్నారు.
జమ్మూ మరియు కాశ్మీర్‌లో మొబైల్ దోస్త్ యాప్ ప్రారంభం
జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వం మొబైల్ దోస్త్ యాప్‌ను జూలై 11, 2023న ప్రారంభించింది. ఈ యాప్ పౌర-కేంద్రీకృత సేవల కోసం సింగిల్-స్టాప్ వేదికను అందిస్తుంది. దీనితో సహా అనేక రకాల ప్రభుత్వ సేవలకు ప్రాప్యతను కల్పిస్తుంది.
జనన మరణాల నమోదు, డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన రిజిస్ట్రేషన్, పాస్పోర్ట్ అప్లికేషన్, ఆస్తి నమోదు, స్కాలర్‌షిప్‌లు, నిరుద్యోగ ప్రయోజనాలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి మొదలగు సేవలు దీని ద్వారా పౌరులు పొందొచ్చు.
ఆండ్రాయిడ్ మరియు iOS డివైజ్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి యాప్ అందుబాటులో ఉంది. యాప్‌ను ఉపయోగించడానికి, వినియోగదారులు ఖాతాను సృష్టించి, వారి ప్రాథమిక వివరాలను అందించాలి. వారు ఖాతాను సృష్టించిన తర్వాత, వారికి అవసరమైన సేవలను యాక్సెస్ చేయవచ్చు.
మొబైల్ దోస్త్ యాప్ జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క డిజిటల్ పరివర్తనలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది పౌరులు ప్రభుత్వ సేవలను పొందడాన్ని సులభతరం చేస్తుంది మరియు ప్రభుత్వ కార్యకలాపాల సామర్థ్యాన్ని మరియు పారదర్శకతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
భూటాన్ వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రకటించిన జపాన్
భూటానీస్ వైద్య విద్యార్థుల కోసం జపాన్ మొట్టమొదటిసారి మెడికల్ స్కాలర్‌షిప్‌లు ప్రకటించింది. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ చదవడానికి జపాన్ వెళ్లే భూటానీస్ విద్యార్థులకు ఇవి అందించబడతాయి. జూలై 2023లో భూటాన్‌లోని రాయల్ సివిల్ సర్వీస్ కమిషన్ మరియు జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ వెల్ఫేర్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భూటాన్‌కు జపాన్ వైద్య స్కాలర్‌షిప్‌లను అందించడం ఇదే మొదటిసారి.
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక అయినా విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు మరియు ప్రయాణ ఖర్చులను కవర్ చేస్తారు. విద్యార్థులకు నెలవారీ స్టైఫండ్ కూడా అందజేయనున్నారు. కనీస జీపీఎ 3.0తో 12వ తరగతి పూర్తి చేసిన భూటాన్ పౌరులకు స్కాలర్‌షిప్‌లు తెరవబడతాయి.
స్కాలర్‌షిప్‌ల ఎంపిక ప్రక్రియను భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ వెల్ఫేర్ నుండి నిపుణుల బృందం ఇంటర్వ్యూ చేస్తుంది. విద్యార్థుల అకడమిక్ పనితీరు, పాఠ్యేతర కార్యకలాపాలు మరియు ఇంటర్వ్యూ స్కోర్‌ల ఆధారంగా తుది ఎంపిక చేయబడుతుంది.
భారతదేశపు ఐఫోన్ తయారీదారునిగా టాటా గ్రూప్
టాటా గ్రూప్ భారతదేశపు మొట్టమొదటి ఐఫోన్ తయారీదారుగా అవతరిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికీ ర్ణాటకలో విస్ట్రాన్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయనున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఐఫోన్ 14 మోడల్‌ను అభివృద్ధి చేస్తుంది. దాదాపు 10,000 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. టాటా 2023 ద్వితీయార్థంలో ఫ్యాక్టరీలో ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.
భారత తయారీ రంగానికి ఇది ఒక ముఖ్యమైన పరిణామం. ఒక భారతీయ కంపెనీ ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి. భారతదేశంలో ఐఫోన్లను తయారు చేసేందుకు టాటా ఆసక్తి చూపడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కలిగి ఉంది. రెండవది, భారతదేశంలో దుకాణాలు ఏర్పాటు చేసే తయారీదారులకు భారత ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది.
టాటా గ్రూప్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మరియు గౌరవనీయమైన సంస్థ. ఇది రిటైల్బ రంగంలో బలమైన ట్రాక్ రికార్డును కలిగి ఉంది. ఈ సంస్థ దేశంలోని అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటి. ఇది ఐఫోన్ తయారీ వ్యాపారంలో విజయం సాధించడానికి టాటాకు విశ్వాసం మరియు వనరులను అందిస్తుంది.
పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ప్రవీణ్ కుమార్‌కు కాంస్యం
భారత ఆటగాడు ప్రవీణ్ కుమార్ పారిస్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల హైజంప్ T64 ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. ప్రవీణ్ 2.01 మీటర్ల సీజన్ బెస్ట్ జంప్‌తో భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించాడు. దీనితో ప్రవీణ్ కుమార్ 2024 పారిస్ పారాలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. 2021లో టోక్యో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో రజతం గెలిచిన తర్వాత, ఒక ప్రధాన అంతర్జాతీయ పోటీలో కుమార్‌కి ఇది రెండో పతకం. కుమార్ భారతదేశంలోని నోయిడాకు ప్రాంతానికి చెందిన పారా హైజంప్ ప్లేయర్. ఈయన కుడి కాలులో పుట్టుకతో వచ్చే అవయవ లోపంతో జన్మించాడు. 2016 లో తన హై జంపింగ్ కెరీర్ ప్రారంభించాడు. కొద్దీ కాలంలోనే ప్రపంచంలోని అత్యుత్తమ హైజంపర్లలో ఒకడు అయ్యాడు.
అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ సమావేశంలో పాల్గొన్న రాజీవ్ కుమార్
జులై 12-13 తేదీలలో కొలంబియాలోని కార్టేజీనాలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ (A-WEB) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ యొక్క 11వ సమావేశంలో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా 119 ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా అంశాలుగా 2023-2024 పనుల ప్రణాళిక, ఎన్నికల భద్రత మరియు సమగ్రత, ఎన్నికల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించడం, ఎన్నికల సంఘాల సామర్థ్యం పెంపు వంటి అంశాలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నికల సంఘాల మధ్య సహకారాన్ని మరియు ఉత్తమ పద్ధతులను పంచుకోవడంలో ఎ-వెబ్ యొక్క ప్రాముఖ్యతను సీఈసీ కుమార్ హైలైట్ చేశారు. డిజిటల్ యుగంలో ఎన్నికల భద్రత మరియు సమగ్రతకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడానికి ఎన్నికల సంఘాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.
ఈ సమావేశంలో సీఈసీ కుమార్ కూడా రెండు ప్రతిపాదనలు లేవనెత్తారు. అందులో మొదటి ప్రతిపాదన ఎ-వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయడం, రెండవ ప్రతిపాదన ప్రజాస్వామ్య ప్రక్రియలలో గణనీయమైన కృషి మరియు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టే ఎన్నికల సంఘాల కోసం ఎ-వెబ్ గ్లోబల్ అవార్డులను ఏర్పాటు చేయడం. ఈ రెండు ప్రతిపాదనలను ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది.
ఆసియా పసిఫిక్ గ్రూప్‌లో పరిశీలకుల హోదా పొందిన మొదటి అరబ్ దేశంగా యూఏఈ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా/పసిఫిక్ గ్రూప్ ఆన్ మనీ లాండరింగ్ (ఏపీజీ)లో పరిశీలకుల హోదా పొందిన మొదటి అరబ్ దేశంగా నిలిచింది. ఏపీజీ అనేది మనీలాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడానికి పనిచేసే ప్రాంతీయ సంస్థ.
ఈ నెలలో కెనడాలోని వాంకోవర్‌లో జరిగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్-స్టైల్ రీజినల్ బాడీ మరియు ఏపీజీ ప్లీనరీలో యూఏఈ నుండి ఒక ప్రతినిధి బృందం పరిశీలకుల హోదాతో పాల్గొంటోంది.
యుఎఇకి పరిశీలకుల హోదాను మంజూరు చేయడం ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది ఏపీజీ యొక్క పనిలో పాల్గొనడానికి మరియు మనీలాండరింగ్ మరియు ఉగ్రవాద ఫైనాన్సింగ్‌పై ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడానికి యూఏఈని అనుమతిస్తుంది.
లిథువేనియాలో భారత తదుపరి రాయబారిగా దేవేష్ ఉత్తమ్
లిథువేనియాలో భారత తదుపరి రాయబారిగా దేవేష్ ఉత్తమ్ నియమితులయ్యారు. ఉత్తమ్ 2003 బ్యాచుకు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న దౌత్యవేత్త. ఉత్తమ్ బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌తో సహా భారతదేశంలో మరియు విదేశాలలో వివిధ హోదాల్లో పనిచేశాడు.
ఉత్తమ్ ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఈయన విదేశీ విధానంలో ఎక్సలెన్స్ కోసం ఇండియన్ ఫారిన్ సర్వీస్ అవార్డు కూడా అందుకున్నారు.
రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా ఐరోపాలోని బాల్టిక్ ప్రాంతంలో ఉన్న ఒక దేశం. ఇది మూడు బాల్టిక్ దేశాలలో ఒకటి. బాల్టిక్ సముద్రం యొక్క తూర్పు ఒడ్డున ఉంటుంది. లిథువేనియా ఉత్తరాన లాట్వియా, తూర్పు మరియు దక్షిణాన బెలారస్, దక్షిణాన పోలాండ్ మరియు నైరుతిలో రష్యాతో భూ సరిహద్దులను పంచుకుంటుంది. దీని రాజధాని నగరం విల్నియస్, అధికారిక కరెన్సీ యూరో, అధికారిక భాష లిథువేనియన్, ప్రస్తుతం ఈ దేశ ప్రధాని మంత్రిగా ఇంగ్రిడా షిమోనిటే ఉన్నారు.
ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలపై 28% జీఎస్టీ
జూలై ప్రారంభంలో జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో, ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు మరియు గుర్రపు పందాలలో బెట్టింగ్‌ల ముఖ విలువపై గరిష్టంగా 28 శాతం పన్ను విధించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని కౌన్సిల్ నిర్ణయించింది. ఆన్‌లైన్ గేమింగ్‌ను స్కిల్ గేమ్‌గా లేదా ఛాన్స్ గేమ్‌గా పన్ను విధించాలా అనే అంశంపై సుదీర్ఘ చర్చ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరిగా ఆన్‌లైన్ గేమింగ్‌ను ఛాన్స్ గేమ్‌గా పన్ను విధించాలని నిర్ణయించింది.
ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్ను విధించాలనే నిర్ణయం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పన్ను చాలా ఎక్కువగా ఉందని మరియు ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ వృద్ధిని అణిచివేస్తుందని కొందరు నమ్ముతున్నారు. అయితే మరికొందరు పన్ను న్యాయమైనదని మరియు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న ఈ పరిశ్రమ నియంత్రణకు ఇది సహాయపడుతుంది నమ్ముతున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్ను పరిశ్రమపై ఎలా ప్రభావం చూపుతుందో కాలమే చెబుతుంది.
ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో జీఎస్టీ కౌన్సిల్ కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నైపుణ్యం-ఆధారిత గేమ్‌లు మరియు అవకాశాల ఆటలతో సహా అన్ని రకాల ఆన్‌లైన్ గేమింగ్‌లకు ఈ పన్ను వర్తించబడుతుంది. ఆటగాడు గెలిచినా ఓడినా అనే దానితో సంబంధం లేకుండా పందెం యొక్క పూర్తి ముఖ విలువపై పన్ను విధించబడుతుంది. ఆన్‌లైన్ గేమింగ్ హోస్ట్ చేయబడిన రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ పన్ను వసూలు చేయబడుతుంది. అక్టోబర్ 1, 2023 నుండి ఈ పన్ను విధానం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
మలేషియాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రాంతీయ కార్యాలయం
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జూలై 11, 2023న మలేషియాలోని కౌలాలంపూర్‌లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయం మలేషియా ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ సెంటర్ యందు ఏర్పాటు చేసారు. ఇది ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో హెచ్ఎఎల్ యొక్క కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుంది.
కొత్త కార్యాలయం భారతదేశం మరియు మలేషియా మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని సులభతరం చేయనుంది. ఈ ప్రాంతంలో హెచ్ఎఎల్ ఉత్పత్తులు మరియు సేవలను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. ఇది భారతదేశం నుండి రక్షణ ఎగుమతులను పెంచుతుందని మరియు భారతీయ కంపెనీలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు భారత మరియు మలేషియా ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులతో పాటు హెచ్ఎఎల్ మరియు ఎమ్ఐఏసీ ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశం మరియు మలేషియా మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంలో కొత్త కార్యాలయం యొక్క ప్రాముఖ్యతను సింగ్ హైలైట్ చేశారు. రక్షణ ప్రాజెక్టులపై ఇరుదేశాలు సహకరించుకునేందుకు, మలేషియాకు భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు ఈ కార్యాలయం వేదికను కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మలేషియా రక్షణ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ కూడా పాల్గొన్నారు.
పెరూలో గ్విలియన్ బారే సిండ్రోమ్ వ్యాప్తిపై ఆరోగ్య అత్యవసర పరిస్థితి
పెరూ ప్రభుత్వం గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాప్తిపై ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వచ్చే 90 రోజులు దేశవ్యాప్త ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితి అమలు చేయనున్నట్లు నివేదించింది. ఈ ఏడాది జూన్ నుండి ఆ దేశంలో 182 జీబీఎస్ కేసులు నమోదైన తర్వాత, జూలై 8, 2023న ఈ డిక్లరేషన్ చేయబడింది. గ్విలియన్ - బారే సిండ్రోమ్ అనేది అరుదైన నరాల సంబంధిత రుగ్మత.
ఈ ఆరోగ్య అత్యవసర ప్రకటన ఆ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి తక్షణ చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. దేశంలో ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ లభ్యతను పెంచడం, జీబీఎస్ వ్యాధికి అత్యంత ప్రభావవంతమైన చికిత్సను అభివృద్ధి చేయడం. కొత్త కేసుల కోసం నిఘా పెంచడం. ప్రజల్లో జీబీఎస్ లక్షణాలపై అవగాహన పెంచడం కోసం ఇది సహాయపడుతుంది.
థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్
థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి ప్రయుత్ చాన్-ఓ-చా జూలై 11, 2023న రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. థాయ్ పార్లమెంట్ కొత్త ప్రధానిని ఎన్నుకోవడానికి రెండు రోజుల ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. యువ తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రయుత్ తెలిపారు. తాను రాజకీయాలతో విసిగిపోయానని, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని కూడా చెప్పారు.
ఇటీవలే జరిగిన ఆ దేశ సార్వత్రిక ఎన్నికల్లో అతని పలాంగ్ ప్రచారత్ పార్టీ మెజారిటీ సీట్లను కోల్పోయిన తర్వాత ప్రయుత్ నుండి ఈ ప్రకటన వెలువడింది. ఈ ఎన్నికలను ప్రయుత్ పాలనపై రెఫరెండంగా భావించారు. అయితే థాయ్ ప్రజలు అతని నాయకత్వంపై విసిగిపోయారని ఫలితాలు తీరు ద్వారా తెలుస్తుంది. ప్రయుత్ రిటైర్మెంట్ థాయ్ రాజకీయాల్లో పెను పరిణామం. దాదాపు తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయన నిష్క్రమణతో దేశంలో అధికార శూన్యత ఏర్పడుతుంది.