Advertisement
లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్ట్రేషన్ గైడెన్స్
Entrepreneur Guide

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్ట్రేషన్ గైడెన్స్

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ (LLP) రిజిస్ట్రేషన్ యూఎస్. యూకే, ఆస్ట్రేలియా మరియు జర్మనీ దేశాల్లో వృత్తి నిపుణులు ఎక్కువ మొగ్గుచూపే కంపెనీ మోడల్. 2008 నుండి ఇండియాలో కూడా ఈ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంది. చట్టపరమైన, వృత్తి పరమైన గుర్తింపు కోరుకునే లాయర్లు, డాక్టర్లు, అకౌంటెంట్స్, టెక్ నిపుణులు వంటి సమూహాలకు లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ చక్కగా సరిపోతుంది.

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్టర్ చేసేందుకు ప్రారంభ పెట్టుబడి అవసరంలేదు. ఇద్దరు కనీస సభ్యులతో కంపెనీ ప్రారంభించొచ్చు. గరిష్ట సభ్యుల సంఖ్యా పరిమితి లేదు. ఎలా వ్యాపారం చేయాలనే నిబంధన లేదు. కొందరు అర్హుత కల్గిన వృత్తి నిపుణులు చట్టపరంగా కలిసి పనిచేసేందుకు మరియు ఉమ్మడి స్కిల్ నైపుణ్యంతో వ్యాపారం వృద్ధి పరిచేందుకు ఈ కంపెనీ ఫార్మేట్ చక్కగా పనిచేస్తుంది.

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రాధమిక నియమావళి

  • లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్టర్ చేసేందుకు కనీసం ఇద్దరు షేర్ హోల్డర్లు ఉండాలి గరిష్టంగా పరిమితి లేదు.
  • లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్టర్ చేసేందుకు ఎటువంటి కనీస పెట్టుబడి అవసరం లేదు.
  • రిజిస్టర్ కంపెనీ ఆఫీస్ కలిగి ఉండాలి. కంపెనీ ఆఫీస్ కమర్షియల్ భవనం కానవసరంలేదు. మీరు ఉండే ఇంటిని లేదా అనుమతి ధ్రువపత్రాలతో మీరుండే రెంటల్ హౌస్ కూడా ఆఫీసుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
  • లిమిటెడ్ లయబిలిటీ అగ్రిమెంట్ తప్పనిసరి.

ఎల్ఎల్పీ రేజస్ట్రేషన్ కోసం కావాల్సిన డాక్యూమెంట్స్

  • లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్టర్ చేసేందుకు షేర్ హోల్డర్లు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత మరియు నివాస ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.
  • వ్యక్తిగత గుర్తింపు కోసం విదేశీయులు/ఎన్ఆర్ఐ సభ్యులు పాన్ కార్డు మరియు పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి.
  • వ్యక్తిగత గుర్తింపు కోసం భారతీయ పౌరులు ఓటర్ కార్డు/ పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ /పాన్ కార్డు కలిగి ఉండాలి.
  • చిరునామా గుర్తింపు కోసం తాజాగా తీసుకున్న బ్యాంకు స్టేటుమెంట్, టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, కరెంటు బిల్ ఉండాలి.
  • పాస్‌పోర్ట్-సైజ్డ్ ఫొటోగ్రాఫ్ మరియు మీసొంత దస్తూరితో సంతకం (డైరెక్టర్లకు మాత్రమే) అందించాలి.
  • రిజిస్టర్ ఆఫీస్: ఆఫీసుకు సంబంధించిన ఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ కలిగివుండాలి.
  • ఇంగ్లీషులో టైపుచేసిన నోటరైజ్డ్ రెంటల్ అగ్రిమెంట్ కలిగివుండాలి.
  • భవన యాజమాని నుండి నిరభ్యంతర పత్రం (NOC) పొందిఉండాలి.
  • సొంత భవనమైతే అమ్మకపు దస్తావేజు / ఆస్తి దస్తావేజు అందజేయాలి.

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్ట్రేషన్ విధానం

ఏకరూప కంపెనీ పేరు కోసం దరఖాస్తు చేయాలి డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి (DSC)
డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ అగ్రిమెంట్
కంపెనీ PAN మరియు TAN నెంబర్ కోసం దరఖాస్తు చేయాలి ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మరియు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ

సారూప్యము లేని కంపెనీ పేరు ఎంచుకోండి

కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అతి ముఖ్యమైన భాగం మీ వ్యాపారానికి మంచి పేరు ఎంపిక చేయడం. అది అక్షర సరూపంలో కానీ, పలకడంలో కానీ ఇంకో కంపెనీ పేరును పోలి ఉండకూడదు. అందుకారణంగా మీ బిజినెస్ కు పేరు పెట్టేముందు MCA (మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్) వెబ్సైటులో  సంబంధించిన బిజినెస్ పేరు మరియు ట్రేడ్ మార్క్ సంబంధిత వివరాలు ముందుగా శోధించి పూర్తి వివరాలు సేకరించండి.

అలానే నేమ్ రిజిస్ట్రేషన్ కోసం MCA కు దరఖాస్తు చేసేటప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా 3 నుండి 4 ఆప్షనల్ నేమ్స్ సిపార్సు చేయండి. ఒక బిజినెస్ నేమ్ పాపులర్ గా ఉండటం ఎంతుయా ముఖ్యమో అది రాబోయే కాలంలో చిక్కులు తేకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం.

DSC & DIN రిజిస్ట్రేషన్

ఇంటర్నెట్ అధికారిక దరఖాస్తులు పూర్తిచేసేందుకు డైరెక్టర్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) తప్పనిసరి. ఒక సారి DSC పొందేక దాని కాలపరిమితి ఒకటి లేదా రెండేళ్లు ఉంటుంది. తర్వాత దాన్ని క్రమానుగతంగా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. DSC లేనిదే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) కు దరఖాస్తు చేయలేము. DIN లేనిదే కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగదు.

ప్రతి కంపెనీ డైరెక్టర్ DIN కలిగి ఉండటం తప్పనిసరి. DIN కంపెనీ డైరెక్టర్ సంబంధించిన వ్యక్తిగత సమాచారం కలిగి ఉంటుంది. ఇది ఫేక్ కంపెనీ రిజిస్ట్రేషన్లలు జరగకుండా ఉండేందుకు, ఫైనాన్సియల్ స్కామ్స్ జరిగేటప్పుడు ఆ డైరెక్టర్లు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా చేస్తుంది. DIN నెంబర్ కోసం సంబంధిత ధ్రువపత్రాలతో MCA వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ అగ్రిమెంట్

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ రిజిస్ట్రేషన్ చేసేముందు షేర్ హోల్డర్ల మధ్య పరస్పర విశ్వాసంతో కూడిన LLP అగ్రిమెంట్ తప్పనిసరి. ఇది షేర్ హోల్డర్ల మధ్య పరస్పర హక్కులు మరియు వారి విధులను నిర్ణయిస్తుంది. దీనికోసం MCA వెబ్సైటు ద్వారా ఫారం నెంబర్ 3 దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని MCA దరఖాస్తు చేసిన తేదీ నుండి 30 రోజుల్లోపు జారీచేస్తుంది.

కంపెనీ పాన్ & టాన్ కోసం దరఖాస్తు

ఇండియాలో బిజినెస్ చేసే ప్రతి వ్యాపార సంస్థ పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) మరియు టాన్ (టాక్స్ డెడిక్షన్ నెంబర్) నంబర్లు తప్పనిసరి కలిగి ఉండాలి.  ఆదాయ పన్ను చెల్లింపులు వాటికీ సంబందించిన రిటర్న్ లావాదేవీలు నిర్వహించేందుకు ఈ నంబర్లు అవసరం. పాన్, టాన్ నంబర్లకు దరఖాస్తు చేసే ముందు కంపెనీ పేరు తప్పనిసరి రిజిస్టర్ అయ్యి ఉండాలి. పాన్ మరియు టాన్ నంబర్లకు ఆదాయ పన్ను వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ & కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ

కంపెనీ రిజిస్ట్రేషన్ లో ఇది చివరి ప్రక్రియ. రిజిస్ట్రేషన్ కోసం అందించిన అన్ని వివరాలు సరైనవని MCA ధ్రువీకరించక ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మరియు కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ జారీ చేస్తుంది. దీనికి 15 నుండి 20 రోజులు సమయం పడుతుంది.  ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ జారీ ద్వారా మీ కంపెనీకి అధికారకంగా వ్యాపారం చేసేందుకు అనుమతి లభించినట్లు అర్ధం.

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ ప్రయోజనాలు

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షి రిజిస్టర్ చేసేందుకు కనీస మూలధనం అవసరంలేదు. తక్కువలో తక్కువగా ఇద్దరి సభ్యులతో వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. గరిష్ట సభ్యుల సంఖ్యలో పరిమితి లేకపోవటం వలన ఒకే నైపుణ్యమున్న సభ్యులు టీముగా పనిచేసి ఎక్కువ ప్రొడక్టివిటీ సృష్టించొచ్చు.

కంపెనీ నిర్వహణలో సంక్లిష్టత ఉండదు. ఇతర కార్పొరేట్ ఫార్మాలిటీస్ నుండి మినహాయింపు ఉంటుంది. కంపెనీ అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉండదు. బోర్డు మీటింగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. మిగతా వాటితో పోల్చుకుంటే LLP రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పరిమితం.

లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ ప్రతికూలతలు

LLP లో షేర్ హోల్డర్లు అందరు యజమాన్యులుగా పరిగణించబడతారు. వ్యాపారపరమైన నిర్ణయాలు ఏ ఒక్కరో స్వేచ్ఛగా తీసుకునే అవకాశం ఉండదు. LLP లో బయట పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉండదు. LLP ల్లో తప్పనిసరి ఒక భారతీయ భాగస్వామి ఉండాలి. కంపెనీ లో ఉండే భాగస్వాములు అందరు తమ వ్యక్తిగత చిరునామాలు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.

LLP తో సహా భాగస్వాములు కూడా ఏడాదికోసారి ఆదాయపన్ను రిటర్న్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని LLP లు భారీమొత్తంలో అపరాధ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. యాజమాన్య హక్కులు మార్పుకు అవకాశం ఉండదు.

ఇద్దరు సభ్యులు ఉండే LLP లలో ఒక సభ్యుడు కంపెనీ నడిపేందుకు ఆసక్తిచూపకపోతే కంపెనీ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. LLP లు రాష్ట్రాల పరిధిలో రెగ్యులేట్ చేబడటం వలన వాటికీ కార్పొరేట్ హోదా లభించదు,

Post Comment