ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేషన్ పరిధిలో అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ మరియు కమ్యూనిటీ సైన్స్ విభాగాల్లో వివిధ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు అందిస్తుంది. ఈ కోర్సులు కనిష్టంగా 4 ఏళ్ళ నుండి గరిష్టంగా 7 ఏళ్ళ కాలవ్యవధితో ఉంటాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
బీఎస్సీ ఆనర్స్ మినహాయిస్తే మిగతా అన్ని కోర్సులకు ఎంసెట్ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. బీఎస్సీ ఆనర్స్ మరియు కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు ఇంటర్మీడిట్ లేదా డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతాయి.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు | అందుబాటులో ఉన్న సీట్లు |
బీఎస్సీ (Hons) అగ్రికల్చర్ | 560 |
బి.టెక్ ఫుడ్ టెక్నాలజీ | 70 |
బి.టెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ | 110 |
బీఎస్సీ (Hons) కమ్యూనిటీ సైన్స్ | 83 |
- బీఎస్సీ (Hons) అగ్రికల్చర్ సంబంధించి 20% సీట్లు AGRICET ద్వారా వచ్చే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ స్టూడెంట్స్ కు కేటాయిస్తారు.
- బి.టెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి 15% సీట్లు AGRIENGGCET ద్వారా వచ్చే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ విద్యార్థులకు కేటాయిస్తారు.
- బీఎస్సీ (Hons) కమ్యూనిటీ సైన్స్ సంబంధించి 10% సీట్లు డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్ విద్యార్థులకు కేటాయిస్తారు.
ఎలిజిబిలిటీ
- బీఎస్సీ ఆనర్స్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్సెస్ మినహా మిగతా అన్ని కోర్సులకు ఎంసెట్ అర్హుత తప్పనిసరి.
- బీఎస్సీ ఆనర్స్ కోర్సులకు ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ పూర్తిచేసిన వారు అర్హులు.
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యార్థులకు అగ్రిసెట్ అర్హుత తప్పనిసరి.
- అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 17 ఏళ్ళు గరిష్టంగా 22 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 3ఏళ్ళు సడలింపు ఉటుంది.
సీట్లు కేటాయింపు
అందుబాటులో ఉండే సీట్లలో 85 శాతం సీట్లు 42:22 నిష్పత్తిలో ఆంధ్ర యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి ఉండే విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్లు ఏయూ, ఎస్వియూ మరియు ఉస్మానియా పరిధి విద్యార్థులు అన్ రిజర్వడ్ కేటగిరిలో ప్రవేశం పొందొచ్చు. ప్రతి కోర్సులో 33% సీట్లు మహిళలకు కేటాయిస్తారు. బీఎస్సీ (Hons) అగ్రికల్చర్, బి.టెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బి.టెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులలో 40 శాతం సీట్లు గ్రామీణ వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చే విద్యార్థులకు కేటాయిస్తారు.
కేటగిరి వారి రిజర్వేషన్లు | |
రిజర్వేషన్ కేటగిరి | రిజర్వేషన్ కోటా |
బీసీ | 29% |
ఎస్సీ | 15% |
ఎస్టీ | 06% |
ఫస్ట్ సెమిస్టరు ఫీజు వివరాలు | ||
బీఎస్సీ ఆనర్స్ & బీటెక్ అగ్రికల్చర్ | బీటెక్ ఫుడ్ టెక్నాలజీ & కమ్యూనిటీ సైన్సెస్ | |
ట్యూషన్ ఫీజు | 4,500/- | 4,500/- |
స్పెషల్ ఫీజు | 7,650/- | 8,250/- |
లైబ్రరీ డిఫాజిట్ (రిఫండబుల్ ) | 1,200/- | 1,200/- |
లేబరేటరీ డిఫాజిట్ (రిఫండబుల్ ) | 1,200/- | 1,200/- |
హాస్టల్ డిఫాజిట్ (రిఫండబుల్ ) | 4,500/- | 4,500/- |
మెస్ అడ్వాన్స్ (రిఫండబుల్ ) | 4,500/- | 4,500/- |
హాస్టల్ ఎస్టేబిలేషమేంట్ చార్జీలు | 3,600/- | 3,600/- |
హాస్టల్ రూమ్ రెంట్ | 1,200/- | 1,200/- |
సీటు రద్దు ఫీజు | 2,600/- (ఎస్సీ, ఎస్టీ లకు 1,300/-) |