ఐబీపీఎస్ పీవో నోటిఫికేషన్ 2022 వెలువడింది. ప్రభుత్వరంగ బ్యాంకులలో మొత్తం 6,432 ప్రొబేషనరీ ఆఫీసర్స్ & మానేజ్మెంట్ ట్రైనీస్ పోస్టుల నియామకం కోసం దరఖాస్తు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 22 ఆగష్టు 2022 లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ నెంబర్ | CRP PO/MT-XII |
పోస్టుల సంఖ్యా | 6,432 |
నోటిఫికేషన్ తేదీ | 02/08/2022 |
దరఖాస్తు తుది గడువు | 22/08/202022 |
పరీక్షా ఫీజు | 850/- |
ఐబీపీఎస్ పీవో/మానేజ్మెంట్ ట్రైనీ ఎగ్జామినేషన్ ఏడాది ఒకసారి దేశంలో ఉండే పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్ & మానేజ్మెంట్ ట్రైనీసును భర్తీచేసేందుకు నిర్వహిస్తారు. తాజా నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉండే 6 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో దాదాపు 6,432 ప్రొబేషనరీ ఆఫీసర్స్ & మానేజ్మెంట్ ట్రైనీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 21 నుండి 30 ఏళ్ళ మధ్య వయసు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ నియామక పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
డిగ్రీ అర్హుతతో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో ఎంట్రీ లెవెల్ జూనియర్ మానేజ్మెంట్ పోస్టుల్లో పాగా వేయాలనుకుంటే ఐబిపిఎస్ పీఓ పరీక్ష రాయాల్సిందే. సామాజిక హోదా, ఉద్యోగ భరోసా, విధి నిర్వహణ సవాళ్లతో కూడిన పీఓ పోస్టులకు నిరుద్యోగుల నుండి డిమాండ్ ఎక్కువ.
బ్యాంకుల సాంకేతిక, ఆర్థిక కార్యకలాపాకు మార్గనిర్దేశం వహించే పీఓలు, వ్యక్తిగత బ్యాంకింగ్ నుండి రూరల్ బ్యాంకింగ్, క్రెడిట్, ఫారెక్స్, ట్రెజరీ వంటి అనేక ముఖ్య విధులు నిర్వర్తిస్తారు. పీఓల ప్రారంభ వేతనం 27620/- నుండి ప్రారంభమౌతుంది.
డీఏ, హౌస్ రెంట్, ఇతర అలెవెన్సులు అన్ని కలుపుకుంటే యేడాదిలో గరిష్టంగా 7.5 లక్షల నుండి 12.9 లక్షల ( మెట్రో సిటీలలో) రూపాయల వరకు అందుకుంటారు. దీనితో పాటుగా నాలుగు దశలో ప్రతీ మూడేళ్లకు శాలరీ ఇంక్రిమెంట్స్ తో పాటుగా కెరీర్ పరంగా ఎదిగేందుకు ప్రొమోషన్స్ కల్పించబడతాయి.
ఐబీపీఎస్ పీవో/మానేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2022
-
ఐబీపీఎస్ పీవో రిక్రూట్మెంటులో పాల్గునే బ్యాంకులు
-
ఐబీపీఎస్ పీవో పరీక్షకు ఎవరు అర్హులు
-
ఐబీపీఎస్ పీవో షెడ్యూల్ 2022
-
ఐబీపీఎస్ పీవో దరఖాస్తు ఫీజు
-
ఐబీపీఎస్ పీవో దరఖాస్తు ప్రక్రియ
-
ఐబీపీఎస్ పీవో ఎగ్జామ్ సెంటర్లు
-
ఐబీపీఎస్ పీవో పరీక్ష నమూనా & సిలబస్
-
ఐబీపీఎస్ పీవో నియామక ప్రక్రియ & క్వాలిఫై మార్కులు
ఐబీపీఎస్ పీవో రిక్రూట్మెంటులో పాల్గునంటున్న బ్యాంకులు & ఖాళీలు
బ్యాంకు ఆఫ్ బరోడా - NA | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు - NA |
బ్యాంకు ఆఫ్ ఇండియా - 535 పోస్టులు | పంజాబ్ నేషనల్ బ్యాంకు - 500 పోస్టులు |
బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర - NA | పంజాబ్ & సింధ్ బ్యాంకు - 253 పోస్టులు |
కెనరా బ్యాంకు - 2500 పోస్టులు | యూకో బ్యాంకు - 550 పోస్టులు |
సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా - NA | యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా - 2094 పోస్టులు |
ఇండియన్ బ్యాంకు - NA | - |
కేటగిరి వారీగా ఐబీపీఎస్ పీవో పోస్టుల ఖాళీలు | ||||
SC | ST | OBC | EWS | UR |
996 | 483 | 1741 | 616 | 2596 |
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ & మెయిన్స్ 2022 షెడ్యూల్
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ షెడ్యూల్ | |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 02 ఆగష్టు 2022 |
దరఖాస్తు తుది గడువు | 22 ఆగష్టు 2022 |
కాల్ లెటర్ డౌన్‌లోడ్ | అక్టోబర్ 2022 |
ప్రిలిమినరీ పరీక్ష | అక్టోబర్ 2022 |
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు | నవంబర్ 2022 |
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ షెడ్యూల్ | |
మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ | నవంబర్ 2022 |
మెయిన్స్ పరీక్ష | నవంబర్ 2022 |
మెయిన్స్ పరీక్ష ఫలితాలు | డిసెంబర్ 2022 |
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ | జనవరి 2022 |
ఇంటర్వ్యూ ఫలితాలు | జనవరి/ఫిబ్రవరి 2022 |
ప్రోవిషనల్ అల్లొట్మెంట్ | ఏప్రిల్ 2022 |
ఐబీపీఎస్ పీవో ఎలిజిబిలిటీ
- జాతీయత: అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
- విద్య అర్హుత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. చివరి యేడాది గ్రాడ్యుయేషన్ చదువవుతున్న విద్యార్థులు కూడా అర్హులు.
- ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు
- ఇంగ్లీష్ధ నైపుణ్యం: రఖాస్తు చేసే అభ్యర్థులు ఆంగ్ల బాషా పరిజ్ఞానం కలిగివుండాలి (ఇంగ్లీష్ రాయడం, చదవటం తెలిసి ఉండాలి)
- వయోపరిమితి: ధరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయసు 21 నుండి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది
- ప్రయత్నాల సంఖ్యా: జనరల్ కేటగిరి అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సార్లు మాత్రమే పీఓ పరీక్ష రాసేందుకు అర్హులు. ఓబీసీ కేటగిరి అభ్యర్థులు గరిష్టంగా ఏడు సార్లు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వికలాంగు అభ్యర్థులకు యెటువంటి హాజరు పరిమితి లేదు.
ఐబీపీఎస్ పీవో దరఖాస్తు ఫీజు
కేటగిరి | ధరఖాస్తు ఫీజు ( ఇంటిమేషన్ చార్జీ) | |
---|---|---|
1 | ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ట్రాన్స్ జండర్ | 175/- (కేవలం ఇంటిమేషన్ చార్జీ ) |
2 | జనరల్ మరియు ఓబీసీ | 850/- (ధరఖాస్తు రుసుము+ఇంటిమేషన్ చార్జీ) |
ఐబీపీఎస్ పీవో దరఖాస్తు విధానం
డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ యందు పొందిపర్చిన విదంగా ఐబీపీఎస్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోవాలి.
అభ్యర్థి పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే సర్టిఫికేట్లు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి.
దరఖాస్తులో వ్యక్తిగత, విద్య మరియు చిరునామా వివరాలు పొదుపర్చాక, అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.
ఐబీపీఎస్ పీవో ఎగ్జామ్ సెంటర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు | తెలంగాణలో పరీక్ష కేంద్రాలు |
---|---|
ప్రిలిమినరీ పరీక్షా: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం | ప్రిలిమినరీ పరీక్షా: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం |
మెయిన్ పరీక్షా: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం | మెయిన్ పరీక్షా: హైదరాబాద్ |
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్ష విధానం
ఐబీపీఎస్ పీవో పరీక్ష ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పేర్లతో రెండు దశలలో జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మెయిన్స్ పరీక్షకు ఆహ్వానిస్తారు. మెయిన్స్ పరీక్ష యందు మెరిట్ సాధించిన అభ్యర్థులను తర్వాతి దశలో గ్రూపు డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ప్రిలిమ్స్ మినహాయించి మిగతా మూడు అంశాల్లో అభ్యర్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. కేటగిరి వారిగా మెరిట్ సాధించిన వారి షార్ట్ లిస్ట్ తయారుచేసి, ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ద్వారా కాల్ లెటర్ అందజేస్తారు.
ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ నమూనా
ఐబీపీఎస్ పీవో ప్రిలిమినరీ పరీక్షను ప్రాథమిక స్థాయిలో అభ్యర్థులను వడపోసేందుకు నిర్వహిస్తారు. 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ ఆబ్జెక్ట్ టెస్టులో మూడు సెక్షన్లలో ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ మూడు సెక్షన్లలో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాలకు సంబంధించి వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.
ఒక్కో సెక్షనకు 20 నిముషాలు చెప్పున, ఒక గంట వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కులు ఇవ్వబడతాయి. అభ్యర్థులు మూడు సెక్షన్లలో కనీస అర్హుత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కేటగిరి వారీగా ఉన్న ఖాళీలకు సుమారుగా 20 రేట్లు మెరిట్ అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
సెక్షన్ / సబ్జెక్ట్ | ప్రశ్నలు (మార్కులు) | సమయం | |
---|---|---|---|
1 | ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 30 (30 మార్కులు ) | 20 నిముషాలు |
2 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 35 (30 మార్కులు ) | 20 నిముషాలు |
3 | రీజనింగ్ ఎబిలిటీ | 35 (30 మార్కులు ) | 20 నిముషాలు |
4 | మొత్తం | 100 (100 మార్కులు ) | 60 నిముషాలు |
ఐబీపీఎస్ పీవో ప్రిలిమినరీ సిలబస్
ఇంగ్లీష్ లాంగ్వేజ్
Reading Comprehension, Idioms & Phrases, Paragraph Jumbles Tenses Rules, (Fill in the blanks)/Cloze, Test Error Detection, Rules for Tenses, Multiple Meanings(Contextual Usage), Paragraph and passage completion.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
Simplification, Profit and Loss, Mixtures and Alligations, Simple and Compound Interest, Surds and Indices, Work and Time Equations, Time and Distance Equations, Mensuration: Cylinder, Cone, Sphere and Cuboid, Data Interpretation, Ratio And Proportion, Percentages, Number Systems, Series and Sequences, Permutation and Combination, Measures of Central Tendency and Variation, Probability.
రీజనింగ్ ఎబిలిటీ
Logical Reasoning, Alphanumeric Series, Directions, Ranking, Alphabet Combination, Data Sufficiency Tests, Coded Inequalities, Seating Arrangements, Picture Series Puzzles, Tabulation, Syllogism, Relationships, Input/Output, Coding and Decoding, Assertion and Reason, Statement Argument and Assumption and Word Formation.
ఐబిపిఎస్ పీఓ మెయిన్స్ నమూనా
ఐబీపీఎస్ ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో 3 గంటల వ్యవధిలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.
నాలుగు సెక్షన్లుగా ఉండే ఈ పరీక్షలో ప్రతి సెక్షన్ యందు నిర్దిష్ట సమయంలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. రెండవ దశలో 30 నిముషాల వ్యవధితో 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ఈ రెండు టెస్టులు పూర్తి ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించబడతాయి. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కు ఇవ్వబడుతుంది.
S.NO | సెక్షన్ / సబ్జెక్ట్ | ప్రశ్నలు (మార్కులు) | సమయం |
---|---|---|---|
1 | రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 45 (60 మార్కులు ) | 60 నిముషాలు |
2 | డేటా అనాలిసిస్ & ఇంటర్ప్రెటీషన్ | 35 (60 మార్కులు ) | 45 నిముషాలు |
3 | జనరల్ అవెర్నెస్ (బ్యాంకింగ్/ఎకానమీ) | 40 (40 మార్కులు ) | 35 నిముషాలు |
4 | జనరల్ ఇంగ్లీష్ | 35 (40 మార్కులు ) | 40 నిముషాలు |
5 | మొత్తం | 155 (200 మార్కులు ) | 3 గంటలు |
రెండవ దశలో నిర్వహించే డిస్క్రిప్టివ్ టెస్ట్ సంబంధించి 50 మార్కులకు ఇంగ్లీషు భాషకు సంబంధించి లెటర్ రైటింగ్, డిస్క్రిప్టివ్ ఎస్సై రాయాల్సి. లెటర్ రైటింగ్ మరియు ఇంగ్లీషు వ్యాసం నిర్ణీత సమయంలో కంప్యూటర్ యందు టైపు చేయాల్సి ఉంటుంది.
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ సిలబస్
ఇంగ్లీష్ లాంగ్వేజ్
Reading Comprehension, Vocabulary, Grammar, Usage of English in Business, Letter Writing, Essay Writing and Verbal Ability
రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్
రీజనింగ్: Verbal and Non-Verbal Reasoning, Syllogism, Seating Arrangements(Circular and Linear), Double and Triple Lineups, Scheduling, Input/Output, Blood Relations, Ordering and Ranking, Coding and Decoding, Sufficiency of Arguments and Data, Directions and Displacement, Code Inequalities, Alphanumeric Series.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్: Internet, Memory, Keyboard Shortcuts, Computer Related Terms Abbreviations, Computer Fundamentals, Microsoft Office and Related Word Processing and Spreadsheet Applications, Computer Hardware and Software, Operating Systems and GUI Basics, Basic Computer Networking.
డేటా అనాలిసిస్ & ఇంటర్ప్రెటీషన్
Simplification, Statistics(Averages, Mean, Median etc.), Representational Statistics(Graphs and Charts), Ratio and Proportion, Percentages, Data Interpretation, Data Sufficiency, Mensuration, Geometry, Linear Equations, Quadratic Equations, Simple and Compound Interest, Speed Distance and Time, Profit Loss and Discounts, Time and Work Equations, Permutations and Combinations, Age Calculation, Equations Systems of Equation in Two Variables, Number Systems, Mixtures and Alligations.
జనరల్ అవెర్నెస్ (బ్యాంకింగ్/ఎకానమీ)
Banking Awareness: Financial Knowledge Basic Economics
Current Affairs: Current Events of National and International Importance with focus on financial news Static
GK: General Knowledge on various topics of importance to financial institutions
ఐబీపీఎస్ పీవో గ్రూపు డిస్కషన్ & ఇంటర్వ్యూ
ఎగ్జామినేషన్ | మార్కులు | |
---|---|---|
1 | గ్రూపు డిస్కషన్ | 20 |
2 | ఇంటర్వ్యూ | 30 |
మొత్తం మార్కులు | 50 |
ఐబీపీఎస్ పీవో నియామక విధానం
ఐబీపీఎస్ పీవో నియామక ప్రక్రియ ప్రిలిమ్స్ పరీక్ష (ఫేజ్ 1) మినహాయిస్తే, మెయిన్స్ (ఫేజ్ 2), గ్రూపు డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ (ఫేజ్ 3)లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
ఫేజ్ 2 జరిగే మెయిన్స్ గరిష్ట మార్కులను 75 కు, ఫేజ్ 3 జరిగే గ్రూపు డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ల గరిష్ట మార్కులను 25 మార్కులకు నార్మలైజషన్ చేసి తుది గరిష్ట మార్కులను వందకు సరిజేస్తారు. ఈ మార్కులకు సాధించిన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా చేసుకుని కేటగిరి వారీగా తుది ఎంపిక చేపడతారు.
నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ | గరిష్ట మార్కులు | నార్మలైజ్డ్ మార్కులు | |
1 | మెయిన్స్ | 225 | 75 |
2 | గ్రూపు డిస్కషన్ & ఇంటర్వ్యూ | 50 | 25 |
మొత్తం | 275 | 100 |
I have learn several excellent stuff here.