ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ మరియు పీహెచ్డీల రూపంలో వివిధ డాక్టోరల్ కోర్సులను అందిస్తుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ఎంపిక చేసిన సెలక్షన్ కమీటీ వీరిని ఎంపిక చేస్తుంది. ఎంపిక ప్రక్రియ ఎంట్రన్స్ పరీక్ష మరియు పీజీ కోర్సులలో చూపిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఉన్న సీట్లలో 25 శాతం బయట రాష్ట్రాల వారికీ కేటాయిస్తారు. వీరిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) నిర్వహించే ప్రవేశ పరీక్షా మెరిట్ ఆధారంగా అవకాశం కల్పిస్తారు.
కోర్సు | సీట్లు సంఖ్యా |
ఎంఎస్సీ అగ్రికల్చర్ | 122 |
ఎంఎస్సీ హోమ్ సైన్స్ | 12 |
ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ | 16 |
ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ | 03 |
పీహెచ్డీ అగ్రికల్చర్ | 37 |
పీహెచ్డీ హోమ్ సైన్స్ | 02 |
పీహెచ్డీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ | 04 |
ఎంబీఏ అగ్రిబిజినెస్ మానేజ్మెంట్ | 16 |