పాఠశాల విద్యకు సంబంధించి ఇండియా మరియు గల్ఫ్ దేశాల్లో మెరిట్‌నేషన్ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్ విద్యా వేదిక. ఇది కేజీ నుండి 10+2 వరకుసీబీఎస్‌ఈ మరియు ఐసీఎస్‌ఈ సిలబస్ ఆధారిత ఆన్‌లైన్ కంటెంట్ అందిస్తుంది.
వీటిలో పాటుగా జేఈఈ మరియు నీట్ ప్రవేశ పరీక్షల కోసం పూర్తిస్థాయి ఆన్‌లైన్ కోచింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఇండియాలో 2014 నుండి మెరిట్‌నేషన్ ఆన్‌లైన్ లైవ్ స్కూల్ ఎడ్యుకేషన్ తరగతులను ఆఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు లక్ష గంటలకు పైగా లైవ్ తరగతులను విద్యార్థులకు డెలివరీ చేసింది. ఐదు లక్షలకు పైగా విద్యార్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు.
హై క్వాలిటీ ఆన్‌లైన్ కంటెంట్ అందించే లెర్నింగ్ వేదికల్లో మెరిట్‌నేషన్ టాప్ 10 లో ఉంటుంది. మల్టీమీడియా ఆధారిత వీడియో కంటెంట్, క్లాస్ పూర్తియ్యాక నిర్వహించే అసైన్‌మెంట్ & హోంవర్క్, లైవ్ చాట్ సబ్జెక్టు సహాయంతో వీరు నివహించే ఆన్‌లైన్ క్లాసులు నిజమైన ఇంటరాక్టివ్ తరగతి గది అనుభవన్నీ విద్యార్థులకు అందిస్తున్నాయి.
ఉచిత ఎన్‌సిఈఆర్‌టి సొల్యూషన్స్, సబ్జెక్ట్ వారీగా సినాప్సెస్ మరియు చాప్టర్ వారీగా రివిజన్, అపరిమిత సబ్జెక్టు సలహాలు అందించడం ద్వారా మిగతా వేదికల కంటే మెరిట్‌నేషన్ ముందు వరుసలో ఉంటుంది. ఆన్‌లైన్ లెర్నింగ్ ఇష్టపడే వారికీ ఈ వేదిక అందించే విద్య సేవలు తప్పక మొప్పిస్తాయని చెప్పవచ్చు.