దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ మరియు దాని అనుబంధ శాఖల్లో జూనియర్ అసోసియేట్ సిబ్బంది నియామక ప్రకటన వెలువడింది. తాజా నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 5,008 జూనియర్ అసోసియేట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 20 నుండి 28 ఏళ్ళ మధ్య వయసు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు 27 సెప్టెంబర్ 2022 లోపు దరఖాస్తు చేసుకోండి.
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ ఎగ్జామ్ తొలిసారి ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఇంగ్లీష్, ఉర్దూ మరియు తెలుగు భాషల్లో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పోస్టులు రాష్ట్రాల వారి ఖాళీలు ఆధారంగా ఆయా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక రాతపరీక్షలో (ప్రిలిమినరీ & మెయిన్) సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.
జూనియర్ అసోసియేట్లు ప్రాథమిక స్థాయిలో ఖాతాదార్లకు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించడం, ఖజానా లావాదేవీలలో సహాయం అందించడం, డీడీలు, చెక్ బుక్స్ జారీచేయటం అవసమయ్యే సమయాల్లో క్యాషీయర్లుగా కూడా విధులు నిర్వహించవల్సి ఉంటుంది.
ఇతర బ్యాంకు జూనియర్ అస్సోసియేట్స్ హోదాతో పోల్చుకుంటే ఎస్‌బీఐ క్లరికల్ సిబ్బంది కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఎంపికైన మూడేళ్ల తర్వాత పనితీరు ఆధారంగా ప్రమోషన్ ప్రకియలో జూనియర్ అసోసియేట్ నుండి జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్లకు ప్రారంభ జీతం యేటా రూ. 655/- ఇంక్రిమెంటుతో 19,900 /- రూపాయిలు అందిస్తారు. మెట్రో నగరాలలో సిబ్బంది ప్రారంభ వేతనం 29 వేల వరకు లభిస్తుంది. ప్రతి మూడేళ్లకు ఇంక్రిమెంట్ పెంపు ఉంటుంది. వీటితో పాటుగా సాధారణ అలోవెన్సులు ప్రొత్సాకాలు ఉండనే ఉంటాయి.
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ షెడ్యూల్ 2022
నోటిఫికేషన్ నెంబర్ | CRPD/CR/2022-23/15 |
పోస్టుల సంఖ్యా | 5,008 |
దరఖాస్తు ప్రారంభం | 07/09/2022 |
దరఖాస్తు తుది గడువు | 27/09/2022 |
ప్రిలిమినరీ కాల్ లెటర్ | నవంబర్ 2022 |
ప్రిలిమినరీ ఎగ్జామ్ | నవంబర్ 2022 |
ప్రిలిమినరీ ఫలితాలు | డిసెంబర్ 2022 |
మెయిన్స్ కాల్ లెటర్ | జనవరి 2023 |
మెయిన్స్ ఎగ్జామ్ | ఫిబ్రవరి 2023 |
తుది ఫలితాలు | మార్చి/ఏప్రిల్ 2023 |
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ ఖాళీలు
దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీలు 8593
అమరావతి సర్కిల్లో ఖాళీలు 0 | ||||
---|---|---|---|---|
SC | ST | OBC | EWS | UR |
హైదరాబాద్ సర్కిల్లో ఖాళీలు 225 పోస్టులు | ||||
---|---|---|---|---|
SC | ST | OBC | EWS | UR |
36 | 16 | 60 | 22 | 91 |
ఎస్‌బీఐ క్లర్క్ / జూనియర్ అసోసియేట్ ఎలిజిబిలిటీ
- విద్య అర్హుత: ఎస్‌బీఐ క్లరికల్ ఎగ్జామినేషన్ కు ధరఖాస్తు చేసే అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ లేదా దానికి సరితూగే డిగ్రీని పూర్తిచేసి ఉండాలి.
- ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు
- అదే విధంగా మాజీ సైనిక ఉద్యోగులు, త్రివిధ దళాల్లో15 ఏళ్ళ లోపు సర్వీస్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- ఇంగ్లీష్ధ నైపుణ్యం: రఖాస్తు చేసే అభ్యర్థులు ఆంగ్ల బాషా పరిజ్ఞానం కలిగివుండాలి (ఇంగ్లీష్ రాయడం, చదవటం తెలిసి ఉండాలి)
- వయోపరిమితి: ధరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయసు 20 నుండి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ దరఖాస్తు ఫీజు
కేటగిరి | ధరఖాస్తు ఫీజు ( ఇంటిమేషన్ చార్జీ) | |
1 | ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ట్రాన్స్ జండర్ | 0/- (కేవలం ఇంటిమేషన్ చార్జీ ) |
2 | జనరల్ మరియు ఓబీసీ | 750/- (ధరఖాస్తు రుసుము+ఇంటిమేషన్ చార్జీ) |
ఎస్‌బీఐ క్లర్క్ / జూనియర్ అసోసియేట్ ఎలిజిబిలిటీ
- విద్య అర్హుత: ఎస్‌బీఐ క్లరికల్ ఎగ్జామినేషన్ కు ధరఖాస్తు చేసే అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ లేదా దానికి సరితూగే డిగ్రీని పూర్తిచేసి ఉండాలి.
- ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు
- అదే విధంగా మాజీ సైనిక ఉద్యోగులు, త్రివిధ దళాల్లో15 ఏళ్ళ లోపు సర్వీస్ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- ఇంగ్లీష్ధ నైపుణ్యం: రఖాస్తు చేసే అభ్యర్థులు ఆంగ్ల బాషా పరిజ్ఞానం కలిగివుండాలి (ఇంగ్లీష్ రాయడం, చదవటం తెలిసి ఉండాలి)
- వయోపరిమితి: ధరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థుల వయసు 20 నుండి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ దరఖాస్తు ఫీజు
కేటగిరి | ధరఖాస్తు ఫీజు ( ఇంటిమేషన్ చార్జీ) | |
1 | ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ట్రాన్స్ జండర్ | 0/- (కేవలం ఇంటిమేషన్ చార్జీ ) |
2 | జనరల్ మరియు ఓబీసీ | 750/- (ధరఖాస్తు రుసుము+ఇంటిమేషన్ చార్జీ) |
ఎస్‌బీఐ క్లర్క్ & జూనియర్ అసోసియేట్ దరఖాస్తు ప్రక్రియ
అర్హుత ఉన్న అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ యందు పొందిపర్చిన విదంగా ఎస్‌బీఐ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి.
పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పరీక్ష కేంద్రల ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.
ఎస్‌బీఐ క్లర్క్ & జూనియర్ అసోసియేట్ ఎగ్జామ్ సెంటర్లు
ఆంధ్రప్రదేశ్ లో పరీక్షా కేంద్రాలు | తెలంగాణ పరీక్షా కేంద్రాలు |
ప్రిలిమినరీ పరీక్ష: అనంతపూర్, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం | ప్రిలిమినరీ పరీక్ష: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్. |
మెయిన్ పరీక్ష: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం | మెయిన్ పరీక్ష: హైదరాబాద్ |
ఎస్‌బీఐ క్లర్క్ & జూనియర్ అసోసియేట్ ఎగ్జామ్ నమూనా
ఎస్‌బీఐ క్లరికల్ నియామక పరీక్ష మూడు దశలలో నిర్వహించబడుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవ దశలో మెయిన్స్ ఎగ్జామినేషన్, మూడవ దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో నిర్వహించబడుతుంది.
ఎస్‌బీఐ క్లర్క్ & జూనియర్ అసోసియేట్
ప్రిలిమినరీ పరీక్ష
ప్రాథమిక స్థాయిలో అభ్యర్థులను వడపోసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు ఆన్లైన్ జరిగే ఈ ఆబ్జెక్ట్ టెస్టులో మూడు సెక్షన్లలో ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ మూడు సెక్షన్లలో జనరల్ ఇంగ్లీష్, న్యూమరికాల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి వంద ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
ఒక్కో సెక్షన్ కు 20 నిముషాలు చెప్పున, ఒక గంట వ్యవధిలో 100 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు, తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కు ఇవ్వబడతాయి. అభ్యర్థులు మూడు సెక్షన్లలో కనీస అర్హుత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కేటగిరి వారీగా ఉన్న ఖాళీలకు సుమారుగా 20 రేట్లు మెరిట్ అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
S.NO | సెక్షన్ / సబ్జెక్ట్ | ప్రశ్నలు (మార్కులు) | సమయం |
---|---|---|---|
1 | ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 30 (30 మార్కులు ) | 20 నిముషాలు |
2 | న్యూమరికాల్ ఎబిలిటీ | 35 (30 మార్కులు ) | 20 నిముషాలు |
3 | రీజనింగ్ ఎబిలిటీ | 35 (30 మార్కులు ) | 20 నిముషాలు |
4 | మొత్తం | 100 (100 మార్కులు ) | 60 నిముషాలు |
ఎస్‌బీఐ క్లర్క్ & జూనియర్ అసోసియేట్
మెయిన్స్ పరీక్ష
ప్రిలిమినరీ ఎగ్జామ్ యందు మెరిట్ సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా పూర్తి ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించబడుతుంది. ఐదు సెక్షన్లలో 200 మార్కులకు జరిగే ఈ పరీక్షను 2 గంటల 40 నిముషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతి సెక్షనుకు నిర్దిష్ట సమయం ఇవ్వబడవుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1/4 వంతు ఋణాత్మక మార్కు ఇవ్వబడుతుంది.
S.NO | సెక్షన్ / సబ్జెక్ట్ | ప్రశ్నలు (మార్కులు) | సమయం |
---|---|---|---|
1 | జనరల్/ఫైనాన్సియల్ అవేర్నెస్ | 50 (50 మార్కులు ) | 35 నిముషాలు |
2 | జనరల్ ఇంగ్లీష్ | 40 (40 మార్కులు ) | 35 నిముషాలు |
3 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 (50 మార్కులు ) | 45 నిముషాలు |
4 | రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 50 (60 మార్కులు ) | 45 నిముషాలు |
5 | మొత్తం | 190 (200 మార్కులు ) | 2 గంటల 40 నిముషాలు |
ఇంటర్వ్యూ మరియు కాల్ లెటర్
మెయిన్స్ యందు మెరిట్ సాధించిన అభ్యర్థులను కేటగిరి వారీగా అవరోహణ క్రమంలో ఉంచుతారు. కేటగిరి వారీగా ఉన్న ఖాళీలను అనుచరించి ప్రతి పోస్టుకు గరిష్టంగా ముగ్గురు మెరిట్ అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. నియామక పరీక్ష యొక్క కనీస అర్హుత మార్కులను ఆయా టెస్టుల యందు అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా బ్యాంకు నిర్ణహిస్తుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఉంటుంది. పది మార్కుల షీటుపై ఉన్న బాషాను ప్రామాణికంగా తీసుకుని, ఇంటర్వ్యూ సమయంలో లేదా తుది ఎంపిక ముందు అభ్యర్థులకు అధికారిక లేదా స్థానిక బాషా ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. అధికారిక లేదా స్థానిక బాషా యందు ప్రావిణ్యం లేని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు.
ఓబీసీ కేటగిరిలో ఇంటర్వ్యూ కి అర్హుత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో నాన్ క్రిమీ లేయర్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఓబీసీ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది లేకుంటే. లేకుంటే సదురు అభ్యర్థిని జనరల్ కేటగిరిగా భావిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ లో చూపించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. కాల్ లెటర్ హార్డ్ కాపీని తపాలా ద్వారా మీ అడ్రసుకు పంపిస్తారు.
ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ ఇతర వివరాలు
నోటిఫికేషన్ | సిలబస్ |
మాక్ టెస్ట్ | దరఖాస్తు చేయండి |