ఏపీఆర్‌ఎస్ అడ్మిషన్ టెస్ట్ : ఏపీ రెసిడెన్సియల్ స్కూళ్లలో ప్రవేశాలు
Andhra Pradesh

ఏపీఆర్‌ఎస్ అడ్మిషన్ టెస్ట్ : ఏపీ రెసిడెన్సియల్ స్కూళ్లలో ప్రవేశాలు

గ్రామీణ మరియు గిరిజన నిరుపేద విద్యార్థులకు అన్ని వసతులతో పూర్తి స్థాయి స్కూల్ మరియు కాలేజీ విద్యను అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెసిడెన్సీ స్కూల్స్ ని అందుబాటులోకి తెచ్చించి. పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 38 సాధారణ మరియు 12 మైనారిటీ గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి.

వీటన్నింటి స్టేట్ సెకండరీ బోర్డు ఆధారిత పాఠ్యప్రణాళికతో ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల విద్యను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెసిడెన్సీ పాఠశాలలను, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలను మరియు ఇతర వెల్ఫేర్ పాఠశాలలను ఏపీ గురుకులం ఆధ్వర్యంలో నడుపుతున్నారు.

ఏపీ రెసిడెన్సీ స్కూళ్లలో 5 నుండి 10 వ తరగతి వరకు స్టేట్ సెకండరీ బోర్డు ఆధారిత స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. ఈ స్కూళ్లల్లో ప్రవేశాలు ఏటా ఏప్రిల్ మరియు జూన్ నెలలో నిర్వహిస్తారు. ప్రవేశ ప్రక్రియ దరఖాస్తుల సంఖ్యా ఆధారంగా ప్రవేశ పరీక్షా లేదా లాటరీ పద్దతిలోనిర్వహిస్తారు.

వీటికి సంబంధించిన దరఖాస్తులు గురుకుల పాఠశాలల్లో పాటుగా జిల్లా విద్య అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రవేశ ప్రక్రియ జిల్లాల వారీగా నిర్వహిస్తారు. ఒక జిల్లలో ఉండే పాఠశాలల్లో ఉండే ఖాళీలను ఆయా జిల్లాల గ్రామీణ విద్యార్థులచే భర్తీచేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

అర్హుత ఉన్న గ్రామీణ విద్యార్థులు అధికారిక వెబ్సైటు (http://aprjdc.apcfss.in లేదా http://apreis.apcfss.in.) నుండి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దార్కాహస్తు చేసే ముందు సంబంధిత వెబ్సైటు నుండి 50 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించి దానికి సంబంధించి ఏర్పడిన జర్నల్ నంబరుతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.

ఆతర్వాత దశలో దరఖాస్తు లో అడిగినా విద్యార్థి విద్య, వ్యక్తిగత మరియు చిరునామా వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. వివరాలు అన్ని పూర్తిగా పొందుపర్చక దరఖాస్తు సబ్మిట్ చేయాల్సి. సబ్మిట్ చేసాక జెనెరేట్ అయ్యే రిఫరెన్స్ నెంబర్ తో పాటుగా సబ్మిట్ చేసిన దరఖాస్తు ప్రింట్ కాపీ తీసి భద్రపర్చుకోవాలి.

విద్యార్థులు దరఖాస్తు చేసే ముందు సంబంధిత ధ్రువపత్రాలు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. అందులో ముఖ్యంగా కుల, ఆదాయ, డేట్ ఆఫ్ బర్త్, టీసీ, స్టడీ సర్టిఫికెట్స్ తయారుగా ఉంచుకోవాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి అందుబాటులో లేకపోయినా అడ్మిషన్ సమయానికి తప్పనిసరి ఒరిజినల్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తున్నందున ఆన్‌లైన్ ద్వారా పంపే దరఖాస్తులు స్వీకరించారు. అసంపూర్ణగా ఉండే దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. వీటికి సంబంధించి ఇతర వివరాల కోసం ఈ నంబర్లకు సంప్రదించండి. 9676404618, 7093323250

ap residency schools admission

ap residency schools admission 4

ap residency schools admission 4