జేఈఈ మెయిన్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్ష యొక్క మొదటి సెషన్ పరీక్షను జనవరి 24, 2024 నుండి 1 ఫిబ్రవరి 2024 తేదీల మధ్య నిర్వహించనున్నారు. రెండో విడుత పరీక్షలను ఏప్రిల్ 2024 లో జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. రెండు సషన్లలో దేనిలో అత్యధిక మార్కులు సాధిస్తే దానినే పరిగణలోకి తీసుకుంటారు.
మొదటి విడుత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 0 నవంబర్ 2023 నుండి 30 నవంబర్ 2023 తేదీ లోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది పరీక్షలను ఇంగ్లీష్, హిందీ తెలుగుతో పాటుగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిచేందుకు సిద్ధమవుతున్నారు.
జేఈఈ మెయిన్ పరీక్షలు ఉదయం మరియు మధ్యాహ్నం షిఫ్టులలో జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్య, మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల మధ్య నిర్వహిస్తారు. పరీక్ష ఎప్పటిలానే రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్ I ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి, పేపర్ II ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ కోర్సులకు సంబంధించి జరుగుతుంది.
దేశంలో నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో ఆదరణ పరంగా, క్లిష్టత పరంగా జేఈఈ మెయిన్ ప్రధమ స్థానంలో ఉంటుంది. దేశంలో ఉన్న ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్ఐటీలలో చేరేందుకు జేఈఈ మెయిన్ పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ప్రధానంగా బీఈ/బీటెక్, బ్యాచలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్ఐటీలలో మాత్రమే కాకుండా జేఈఈ మెయిన్ అర్హుతతో దేశంలో ఉండే అన్ని ప్రముఖ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ పొందొచ్చు. అలానే జేఈఈ అడ్వాన్సడ్ రాయాలనుకునే వారు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ప్రవేశ పరీక్ష గురించి సవివరంగా తెలుసుకుందాం.
జేఈఈ మెయిన్ 2024
Exam Nmae | JEE MAIN 2024 |
Exam Type | Entrance Exam |
Admission For | BE/BTech, B.Plan, B.Arch |
Exam Date | 24 Jan to 1 Feb 2024 |
Exam Duration | 3 hours |
Exam Level | National |
జేఈఈ మెయిన్ 2024 సమాచారం
-
జేఈఈ మెయిన్ ఎలిజిబిలిటీ
-
జేఈఈ మెయిన్ 2024 షెడ్యూల్
-
జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫీజు
-
జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేయండి
-
జేఈఈ మెయిన్ పరీక్ష నమూనా
-
జేఈఈ మెయిన్ ర్యాంకింగ్ విధానం
జేఈఈ మెయిన్ 2024 షెడ్యూల్
జేఈఈ మెయిన్ 2023 మొదటి సెషన్ షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 1 నవంబర్ 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 30 నవంబర్ 2023 |
ఎగ్జామ్ సెంటర్ల ప్రకటన | జనవరి 2024 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | 21 జనవరి 2024 |
పరీక్ష తేదీ | 24 జనవరి నుండి 1 ఫిబ్రవరి 2024 |
ఫలితాలు | 12 ఫిబ్రవరి 2024 |
జేఈఈ మెయిన్ 2024 రెండవ సెషన్ షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభ తేదీ | 02 ఫిబ్రవరి 2024 |
దరఖాస్తు చివరి తేదీ | 2 మార్చి 2024 |
పరీక్షాకేంద్రాల ప్రకటన | 20 మార్చి 2024 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | 27 మార్చి 2024 |
పరీక్ష తేదీ | 1 -15 ఏప్రిల్ 2024 |
ఫలితాలు | 25 ఏప్రిల్ 2024 |
కౌన్సిలింగ్ | ఆగష్టు 2024 |
జేఈఈ మెయిన్ ఎలిజిబిలిటీ
- మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు మరియు సంబంధిత బోర్డుల నుండి చివరి సంత్సరం చదువుతున్నవారు జేఈఈ మెయిన్స్ రాసేందుకు అర్హులు.
- అలానే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ అఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ చేసినవారు, నేషన్ డిఫన్స్ అకాడమీ యొక్క రెండేళ్ల జాయింట్ సర్వీస్ వింగ్ కోర్సు పూర్తిచేసినవారు, హయ్యర్ సెకండరీ ఒకేషనల్ కోర్సు పూర్తిచేసినవారు మరియు AICTE లేదా రాష్ట్ర సాంకేతిక విద్యాసంస్థల నుండి మూడేళ్ళ డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారు కూడా ఈ పరీక్షకు హాజరవ్వొచ్చు.
- జేఈఈ పరీక్ష హాజరయ్యేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. 10+2 లేదా ఇంటర్మీడియట్ పూర్తియిన ఏడాది నుండి వరుసగా మూడేళ్లు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం ఉంది.
జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఫీజు
పరీక్ష పేపర్ | రిజర్వేషన్ కేటగిరి | మహిళలు | పురుషులు |
---|---|---|---|
ఇంజనీరింగ్ (పేపర్ I) or ఆర్కిటెక్చర్/ ప్లానింగ్ (పేపర్ II/III) | ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, ట్రాన్స్ జండర్ | 500/- | 500/- |
జనరల్ మరియు ఓబీసీ | 800/- | 1,000/- | |
ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ / ప్లానింగ్ రెండు పేపర్లకు కలిపి | ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి, ట్రాన్స్ జండర్ | 1,000/- | 1,000/- |
జనరల్ మరియు ఓబీసీ | 1,600/- | 2,000/- |
జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్
జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మొబైల్, కంప్యూటర్ లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవ సెంటరుకి వెళ్లి సంబంధిత జేఈఈ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అవసరమయ్యే సర్టిఫికెట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. అభ్యర్థి రిజస్టర్ అయ్యేందుకు డీజీ లాకర్, పాసుపోర్టు, ఏబీసీ, ఆధార్ లేదా పాన్ కార్డు ఐడీ లలో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి. అభ్యర్థి ఎగ్జామ్ సమయంలో ఫోటోగ్రాఫ్‌తో చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఐడీ ద్వారా ప్రామాణీకరించుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు అభ్యర్థి అవసరమైన వివరాలను పొందుపర్చాలి. రెండవ దశలో లాగిన్ అకౌంటుకు పాస్‌వర్డ్‌ని సృష్టించుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. తర్వాత దశలో వ్యక్తిగత వివరాలను విజయవంతంగా సమర్పించిన తర్వాత, అప్లికేషన్ నంబర్ జనరేట్ చేయబడుతుంది. ఇది దరఖాస్తు ఫారమ్ యొక్క మిగిలిన దశలను పూర్తి చేయడానికి ఉపయోగించబడుతుంది.
అలానే అన్ని భవిష్యత్ సమాచార/కరస్పాండెన్స్ కోసం ఈ నెంబర్ అవసరం పడుతుంది. ఈ అప్లికేషన్ నంబర్ జేఈఈ (మెయిన్) - 2024 రెండు సెషన్లకు కూడా ఉపయోగపడుతుంది. చివరి దశలో అభ్యర్థి సంబంధిత లాగిన్ వివరాలతో తిరిగి లాగిన్ అయ్యి పరీక్ష సంబంధిత వివరాలు నింపాల్సి ఉంటుంది.
- మొదటి అంచెలో మీ సంబంధిత సమాచారం అంతా నింపాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీ కుటుంబ వివరాలు, చిరునామా, కులం, విద్య అర్హుతలు, పరీక్ష సెంటర్, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్ వంటి సమాచారమంతా సంబంధిత గడుల్లో నింపాలి.
- రెండవ అంచెలో మీరు సంతకం చేసిన ఫోటో తో పాటు, మీరు ఇచ్చిన సమాచారానికి సంబంధించిన డాక్యూమెంట్స్ అన్ని స్కాన్ చేసి jpg ఫైల్ ఫార్మేట్ లో 50kb నుండి 300kb సైజు లో అప్లోడ్ చేయాలి.
- మూడవ అంచెలో ప్రవేశ రుసుమును చెల్లించి దరఖాస్తు చివరి అంకాన్ని పూర్తిచేయాలి.
- నాల్గువ అంచెలో దరఖాస్తు పూర్తి అయినట్లు చూపించక దాన్ని ప్రింట్ తీసి భద్రపరుసుకోవాలి.
అవసరమయ్యే డాకుమెంట్స్
- డీజీ లాకర్ ఐడీ/ పాసుపోర్టు ఐడీ/ ఏబీసీ ఐడీ/ ఆధార్ లేదా పాన్ కార్డు ఐడీ
- టెన్త్ మార్కులిస్ట్
- ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (అవసరమయ్యే వారికీ)
- పిడబ్ల్యుడి సర్టిఫికెట్ (అవసరమయ్యే వారికీ)
- స్క్రైబ్ అనుమతి లెటర్ (అవసరమయ్యే వారికీ)
- గెజిటెడ్ నోటిఫికేషన్ లెటర్ (పది మరియు ఇంటర్ సర్టిఫికెట్స్ పైన పేరు సరికానప్పుడు)
- డీఎస్ సర్టిఫికెట్ (అవసరమయ్యే వారికీ)
జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నమూనా
జేఈఈ మెయిన్స్ బహుళ ఐచ్చిక(మల్టిపుల్ ఛాయస్) విధానంలో జరుగుతుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో పార్ట్ 3 డ్రాయింగ్ టెస్ట్ మినహా మిగతా అన్ని పేపర్లు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) విధానం ద్వారా జరుపబడతాయి.
ప్రతి ఏడాది ఏదో ఒక కొత్తదనం తో దర్శినం ఇచ్చే జేఈఈ మెయిన్స్..ఈ ఏడాది మూడు పేపర్ల విధానంతో మన ముందుకు వచ్చింది. ప్రతి ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ కోర్సుల కోసం జరిగే పేపర్ 2 ను ఈ ఏడాది రెండుగా విభజించి, ఆర్కిటెక్చర్ పేపరును 2A గా, బీ ప్లానింగ్ ను పేపర్ 2B గా జరుపుతున్నారు. పూర్తి సమాచారం కింది పట్టికలు ద్వారా సవివరంగా తెలుసుకుందాం.
బీఈ/బీటెక్ (పేపర్ 1)
బీఈ/బీటెక్ అడ్మిషన్ కోసం జరిగే పేపర్ I, 3 గంటల నిడివితో, 90 ప్రశ్నలతో, 300 మార్కులకు జరుగుతుంది. ప్రశ్న పత్రం రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్ A లో 20 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు, సెక్షన్ B లో 10 న్యూమరికల్ వేల్యూ తో కూడిన ప్రశ్నలు ఇవ్వబోతున్నారు.
సెక్షన్ B లో అందుబాటులో ఉన్న ప్రశ్నలలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు తొలగిస్తారు. ప్రశ్నలు 10+2 స్థాయిలో సీబీఎస్ఈ సిలబస్ నుండి ఇస్తారు. పూర్తి వివరాలు ఈ కింది పట్టికలో చూద్దాం.
సబ్జెక్టు | సెక్షన్ A | సెక్షన్ B | మార్కులు |
---|---|---|---|
మాథ్స్ | 20 | 10* | 100 మార్కులు |
ఫిజిక్స్ | 20 | 10* | 100 మార్కులు |
కెమిస్ట్రీ | 20 | 10* | 100 మార్కులు |
మొత్తం | 60 ప్రశ్నలు | 30 ప్రశ్నలు | 100 మార్కులు |
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (పేపర్ 2A)
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం జేఈఈ మెయిన్స్ లో పేపర్ 2A గా జరిగే ఈ పరీక్ష మూడు భాగాల్లో జరుగుతుంది. భాగం 1, 2 లు ఆన్‌లైన్ విధానంలో జరగగా, మూడవ భాగంలో ఉన్న డ్రాయింగ్ టెస్ట్ రాత పరీక్ష విధానంలో జరుగుతుంది.
77 ప్రశ్నలు ఉండే ఈ పరీక్ష 3 గంటల నిడివితో 400 మార్కులకు జరుగుతుంది. పార్ట్ 1 లో మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. ఇవి రెండు సెక్షన్లుగా, సెక్షన్ A లో 20 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు, సెక్షన్ B లో 10 న్యూమరికల్ వేల్యూ తో కూడిన ప్రశ్నలు ఇవ్వబోతున్నారు. సెక్షన్ B లో అందుబాటులో ఉన్న ప్రశ్నలలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది.
పార్ట్1,2 లలో ప్రతి ప్రశ్నకు 4మార్కులు కేటాయించారు. పార్ట్ 3 లో డ్రాయింగ్ టెస్ట్ లో భాగంగా 2 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఒక్కో ప్రశ్నకు 50 మార్కులు. పూర్తి వివరాలు కింది పట్టికలో చూద్దాం.
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్యా | మార్కులు |
---|---|---|
మాథ్స్ (పార్ట్ 1) | 20+10* | 100 |
ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్ 2) | 50 | 200 |
డ్రాయింగ్ టెస్ట్ (పార్ట్ 3) | 2 | 100 |
మొత్తం | 82 | 400 |
బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (పేపర్ 2B)
గత ఏడాది వరకు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ని పేపర్ 2 లో భాగంగా జరిపేవారు. ఈ ఏడాది దీన్ని పేపర్ 2 నుండి వేరుచేసి విడిగా పేపర్ 2B గా నిర్వహిస్తున్నారు. ప్లానింగ్ కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్షకు మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్, ప్లానింగ్ కు సంబంధించే టాపిక్స్ ని సిలబస్ గా నిర్ణహించారు.
3 గంటల నిడివితో 400 మార్కులకు జరిగే ఈ పరీక్ష లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 1 లో గణితం నుండి మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. ఇవి రెండు సెక్షన్లుగా, సెక్షన్ A లో 20 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు, సెక్షన్ B లో 10 న్యూమరికల్ వేల్యూ తో కూడిన ప్రశ్నలు ఇవ్వబోతున్నారు.
సెక్షన్ B లో అందుబాటులో ఉన్న ప్రశ్నలలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే, 50 ప్రశ్నలు ఆప్టిట్యూడ్ నుండి మిగతా 25 ప్రశ్నలు ప్లానింగ్ సంబంధితా సిలబస్ నుండి ఇవ్వబడతాయి.
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్యా | మార్కులు |
---|---|---|
మాథ్స్ (పార్ట్ 1) | 20+10* | 100 |
ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్ 2) | 50 | 200 |
ప్లానింగ్ సంబంధిత | 25 | 100 |
మొత్తం | 105 | 400 |
మార్కుల ఇచ్చే విధానం: ఈ మూడు పేపర్లు మూడు విధాలుగా ఉన్నా మార్కుల స్కీం ఒకే విధంగా ఉంటుంది. పేపర్ 2 భాగంగా డ్రాయింగ్ విభాంగంలో ఇచ్చే రెండు ప్రశ్నలు మినహా మిగతా అన్ని ప్రశ్నలకు 4 మార్కుల విధానమే ఉంటుంది. పట్టికల్లో *(స్టార్) మార్క్ ఉన్న ప్రశ్నలు న్యూమరికాల్ విభాగం నుండి వస్తాయి.
జేఈఈ మెయిన్ రిజర్వేషన్ కోటాలు
జనరల్ కోటాలో వెనకబడిన విభాగం (EWS) | 10% |
షెడ్యూల్డ్ కాస్ట్ (SC) | 15% |
షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) | 7.5% |
ఇతర వెనకబడిన తరగతులు (OBC) | 27% |
శారీరిక వైకల్యం (PWD) | 5% |
శారీరక వైకల్యం (PWD) కోటా కు ప్రతి రిజర్వేషన్ కెటగిరి నుండి 5% రిజర్వేషన్ వాటా ఇవ్వబడుతుంది.
జేఈఈ మెయిన్ ర్యాంకింగ్ విధానం
దేశ వ్యాప్తంగా జరిగే జేఈఈ మెయిన్ యొక్క ర్యాంకులు ఆల్ ఇండియా ర్యాంకింగ్ పద్దతిలో ప్రకటిస్తారు. జనవరి మరియు ఏప్రిల్లో రెండువిడుతల పరీక్ష ముగిసాక అభ్యర్థి ఫైనల్ ర్యాంక్ విడుదల చేస్తారు. రెండు విడతలలో సంబంధిత ప్రతి సబ్జెక్టులలో అభ్యర్థి చూపే ప్రతిభ ఆధారంగా నాటా స్కోర్ లెక్కిస్తారు. ఈ రెండిటిలో ఉత్తమ స్కోర్ సాధించిన విడతను పరిగణలోకి తీసుకుని అభ్యర్థి ర్యాంకు ను ప్రకటిస్తారు.
బీఈ/బీటెక్ కోసం జరిగే పేపర్ 1 లో అభ్యర్థుల స్కోర్ సమమయ్యేటప్పుడు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఇదే వరుస ప్రాధాన్యత లో ఎక్కువ స్కోర్ సాధించిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికి సమమైతే తక్కువ నెగిటివ్ మార్కులు వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలా కూడా సాధ్యం కాకుంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి ర్యాంకింగ్ ప్రకటిస్తారు.
- పేపర్ 1 లో సబ్జెక్టుల ప్రాధాన్యత క్రమం : మ్యాథ్స్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ
- పేపర్ 2 లో సబ్జెక్టుల ప్రాధాన్యత క్రమం : మ్యాథ్స్ , ఆప్టిట్యూడ్, డ్రాయింగ్ టెస్ట్
- పేపర్ 3 లో సబ్జెక్టుల ప్రాధాన్యత క్రమం : మ్యాథ్స్ , ఆప్టిట్యూడ్, ప్లానింగ్
గమనిక: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకు యొక్క ప్రాధాన్యత NITలు, IIITలు, CFTIలు, మరియు SFI యూనివర్సిటీ లో జరిపే అడ్మిషన్లకు మాత్రమే ఉంటుంది. మిగతా కాలేజీలలో, రాష్ట్రాల వారీగా ఉండే కాలేజీలలో దీని ప్రాధాన్యత మారుతుంటుంది.