తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 16 నవంబర్ 2023
Telugu Current Affairs

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 16 నవంబర్ 2023

తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 16 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

50వ వన్డే సెంచరీని నమోదు చేసిన విరాట్ కోహ్లీ

వన్డే ప్రపంచ కప్ 2023 సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. దీనితో తన ఆరాధ్యదైవమైన సచిన్ టెండూల్కర్‌ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. టెండూల్కర్ 49 సెంచరీల మార్కును చేరుకునేందుకు 452 ఇన్నింగ్స్‌లు ఆడగా,  కోహ్లి కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లో 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు నెల్కొలపాడు. విరాట్ ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో 711 పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. కోహ్లీ కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లో 101.57 సగటుతో ఈ ఘనత సాధించాడు.

టెస్ట్ మరియు ఒన్డే క్రికెట్టులొ అత్యధిక సెంచరీలు

క్రికెట్ ప్లేయర్ టెస్ట్ ఒన్డే టీ20 మొత్తం సెంచరీలు
సచిన్ టెండూల్కర్ 51 49 0 100
విరాట్ కోహ్లీ 29 50 1 80
రికి పాంటింగ్ 41 30 0 71
కుమార్ సంగక్కర 38 25 0 63
జాక్వెస్ కల్లిస్ 45 17 0 62

న్యూఢిల్లీలో సిటీ 2.0ని ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, నవంబర్ 16, 2023 న న్యూ ఢిల్లీలో సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ మరియు సస్టైన్ 2.0 (CITIIS 2. 0) ఛాలెంజ్‌ని ప్రారంభించారు. సిటీస్ 2.0 కార్యక్రమం సమగ్ర వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారిస్తుంది. నగరాలలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటుగా వాతావరణ మార్పులను తగ్గించే చర్యలు చేపట్టనుంది.

సిటీస్ 1.0 కార్యక్రమం మొదటి దశలో వెయ్యి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు, వంద కిలోమీటర్ల నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌లు, ఏడు వందల యాభై ఎకరాల గ్రీన్ ఓపెన్ స్పేస్‌లు అభివృద్ధి చేసినట్లు  హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రెండవ దశ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే నూట పన్నెండు బయోమెథనేషన్ ప్లాంట్లు, 2391 వ్యర్థాల కంపోస్ట్ ప్లాంట్లు, యాభై ఐదు వేస్ట్-టు ఎనర్జీ ప్లాంట్లు, 2281 మెటీరియల్ రికవరీ సౌకర్యాలను అభివృద్ధి చేసినట్లు మంత్రి వెల్లడించారు.

సిటీస్ 2.0 ఛాలెంజ్ పట్టణ సవాళ్లకు వినూత్నమైన మరియు స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న నగరాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం ఆరు నేపథ్య రంగాలపై దృష్టి పెడుతుంది. వాటిలో వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి నిర్వహణ, శక్తి సామర్థ్యం, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ మొబిలిటీ మరియు అర్బన్ రెసిలెన్స్ వంటివి ఉన్నాయి.

సిటీస్ 2.0 ఛాలెంజ్ భారతదేశంలోని నగరాల నుండి పెద్ద సంఖ్యలో దరఖాస్తులను ఆకర్షిస్తుంది. ఎంచుకున్న నగరాలకు వారి ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లను అమలు చేయడానికి గరిష్టంగా ₹100 కోట్ల గ్రాంట్లు అందజేయబడతాయి. స్మార్ట్ సిటీస్ మిషన్ లక్ష్యాలను సాధించడంలో ఈ కార్యక్రమం సహాపడుతుంది.

ఢిల్లీ విమానాశ్రయంలో హిడెన్ డిజేబిలిటీస్ కోసం సన్‌ఫ్లవర్ ఇనిషియేటివ్

ఢిల్లీ విమానాశ్రయం హిడెన్ డిజేబిలిటీస్ సన్‌ఫ్లవర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ చొరవ కన్పించని వైకల్యాలున్న ప్రయాణీకులకు సహాయాన్ని అందించడానికి ప్రారంభించబడింది. సంబంధిత ప్రయాణికులు విమానాశ్రయంలోని హెల్ప్ డెస్క్‌లు మరియు ఇన్ఫర్మేషన్ కౌంటర్‌ ద్వారా లాన్యార్డ్, పిన్ బ్యాడ్జ్ లేదా రిస్ట్‌బ్యాండ్ వంటి సన్‌ఫ్లవర్ గుర్తులను ధరించాల్సి ఉంటుంది. తద్వారా విమానాశ్రయ సిబ్బంది గుర్తించి, వారికీ అవసరమయ్యే  సహాయాన్ని అందిస్తారు.

హిడెన్ డిజేబిలిటీస్ సన్‌ఫ్లవర్ ఇనిషియేటివ్ అనేది 2016లో హిడెన్ డిజేబిలిటీస్ సన్‌ఫ్లవర్ ద్వారా రూపొందించబడిన అంతర్జాతీయ కార్యక్రమం. ఈ ప్రోగ్రామ్‌ను గాట్విక్ ఎయిర్‌పోర్ట్, హీత్రో ఎయిర్‌పోర్ట్ మరియు డిస్నీల్యాండ్ ప్యారిస్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 300కి పైగా విమానాశ్రయాలు మరియు సంస్థలు ఉపయోగిస్తున్నాయి. వైకల్యాలున్న వ్యక్తులకు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం.

భారత్ - శ్రీలంక జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ మిత్ర శక్తి-2023

భారతదేశం - శ్రీలంక సంయుక్త సైనిక వ్యాయామం మిత్ర శక్తి యొక్క 9వ ఎడిషన్ నవంబర్ 16 నుండి 29 వరకు ఔంధ్ (పుణె)లో నిర్వహించబడింది. మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన 120 మంది భారత బృందం దీనికి ప్రాతినిధ్యం వహిస్తోంది. శ్రీలంక వైపు నుండి 53 పదాతిదళ విభాగానికి చెందిన సిబ్బంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి చార్టర్ యొక్క VII అధ్యాయం క్రింద ఉప సంప్రదాయ కార్యకలాపాల నిర్వహణను సంయుక్తంగా రిహార్సల్ చేయడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సమయంలో ఉమ్మడి ప్రతిస్పందనలను సమన్వయం చేసుకోవడం దీని లక్ష్యం. ఇది భారత మరియు శ్రీలంక సైన్యల మధ్య రక్షణ సహకార స్థాయిని మరింత మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం రెండు పొరుగు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కూడా పెంపొందిస్తుంది.

గోమతి నగర్ & చార్‌బాగ్‌లలో 24x7 రైల్ కోచ్ రెస్టారెంట్స్

లక్నోలోని గోమతి నగర్ రైల్వే స్టేషన్‌లో 24x7 రైలు కోచ్ రెస్టారెంట్ ప్రారంభించబడింది. ఈ రెస్టారెంట్‌కు రాయల్ ట్రైన్ క్యూసిన్ రెస్టారెంట్‌ అని పేరు పెట్టారు. ఇది రైల్వే స్క్రాప్‌లతో రూపొందించబడింది. ఈ రెస్టారెంట్‌లో 70 మంది సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. కోచ్ వెలుపల దాదాపు 100 మంది కూర్చునే కేఫ్ ప్రాంతం కూడా ఉంటుంది. రెస్టారెంట్ వివిధ రకాల భారతీయ మరియు చైనీస్ వంటకాలను అందిస్తుంది.

దీనికి ముందు లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో కూడా 24X7 డైన్-ఇన్ రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రారంభించబడింది. ఇది దేశంలోనే మొదటిది. రైల్వే అధికారుల ప్రకారం చార్‌బాగ్, గోమతితో పాటుగా సిధౌలి (సీతాపూర్), గోరఖ్‌పూర్, వారణాసి జంక్షన్, వారణాసి నగరం, ఆగ్రా వంటి స్టేషన్లలో వీటిని త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

ఈ రైలు కోచ్ రెస్టారెంట్ అనేది భారతీయ రైల్వేలు మరియు ఒక ప్రైవేట్ కంపెనీ మధ్య జాయింట్ వెంచర్. ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు ఆ సంస్థలే నిర్వహిస్తాయి. భారతీయ రైల్వే స్థలం మరియు కోచ్‌ను అందిస్తుంది. రైల్ కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించడం వల్ల లక్నోలో పర్యాటకం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ రెస్టారెంట్ పర్యాటకులకు మరియు స్థానికులకు ప్రత్యేకమైన భోజన అనుభూతిని కలిగిస్తుంది.

Advertisement

Post Comment