అగ్రికల్చర్ పీజీ కోర్సులు ఇన్ ఎన్జీ రంగా యూనివర్సిటీ
Universities

అగ్రికల్చర్ పీజీ కోర్సులు ఇన్ ఎన్జీ రంగా యూనివర్సిటీ

ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరిధిలో ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఎంఎస్సీ కమ్యూనిటీ సైన్స్ విభాగాల్లో వివిధ మాస్టర్ డిగ్రీ కోర్సులు అందిస్తుంది. ఈ కోర్సులు అన్ని 4  ఏళ్ళ కాలవ్యవధితో ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లేదా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి సంబంధిత బ్యాచిలర్ డిగ్రీలల్లో ఉత్తీర్ణతయి ఉండాలి.

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ పీజీ ప్రోగ్రామ్స్

ఎంఎస్సీ అగ్రికల్చర్

ఎంఎస్సీ అగ్రికల్చర్ పరిధిలో అగ్రోనోమి, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఏంటోమోలోజి, అగ్రికల్చర్ ఎక్సటెన్షన్, జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, క్రోఫ్ ఫీజియోలజీ, సాయిల్ సైన్స్, సీడ్ సైన్స్ & టెక్నాలజీ, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, అగ్రోనోమి వాటర్ మానేజ్మెంట్ మరియు అగ్రికల్చర్ మేటీఓరోలోజి కోర్సులు అందిస్తుంది.

ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు 4 ఏళ్ళ బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ CA & Bm పూర్తిచేసి ఉండాలి. అకాడమిక్ స్కోర్ మరియు ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులలో 30:70 వెయిటేజీ ఆధారంగా తుది అడ్మిషన్ కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. పరీక్ష అంశాలు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ సిలబస్ నుండి ఇవ్వబడతాయి.

ఎంఎస్సీ మోలెక్యూలర్ బయాలజీ & బయో టెక్నాలజీ

మోలెక్యూలర్ బయాలజీ & బయో టెక్నాలజీ. ఈ రెండు కోర్సుల్లో చేరేందుకు 4 ఏళ్ళ బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్, సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ మరియు బ్యాచిలర్ ఆఫ్ CA & Bm కోర్సుల్లో ఉత్తీర్ణతయి ఉండాలి. అకాడమిక్ స్కోర్ మరియు ప్రవేశ పరీక్షా లో సాధించిన మార్కులలో 30:70 వెయిటేజీ ఆధారంగా తుది అడ్మిషన్ కల్పిస్తారు. ప్రవేశ పరీక్షా డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. పరీక్షా అంశాలు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ సిలబస్ నుండి ఇవ్వబడతాయి.

ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్

ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఈ కోర్సుల్లో చేరేందుకు 4 ఏళ్ళ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీవీఎస్సీ లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ లేదా బీటెక్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ & టెక్నాలజీ / ఎన్విరాన్మెంటల్ స్టడీస్ or బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫారెస్ట్రీ / బి.ఎస్.సి. CA&BM లేదా BFSc కోర్సులల్లో ఏదోకటి ఉత్తీర్ణత అయి ఉండాలి.

అకాడమిక్ స్కోర్ మరియు ప్రవేశ పరీక్షా లో సాధించిన మార్కులలో 30:70 వెయిటేజీ ఆధారంగా తుది అడ్మిషన్ కల్పిస్తారు. ప్రవేశ పరీక్షా డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. పరీక్షా అంశాలు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ సిలబస్ నుండి ఇవ్వబడతాయి.

ఎంఎస్సీ హోమ్ సైన్స్ (మహిళలు)

ఫుడ్ అండ్ న్యూట్రషన్, హ్యూమన్ డెవలప్మెంట్ & ఫామిలీ స్టడీస్, ఫామిలీ రిసోర్స్ మానేజ్మెంట్, హోమ్ సైన్స్ ఎక్సటెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మానేజ్మెంట్. ఈ కోర్సుల్లో చేరేందుకు బీఎస్సీ హోమ్ సైన్స్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ లేదా బీఎస్సీ ఆనర్స్ లలో ఉత్తీర్ణత అయి ఉండాలి.

అకాడమిక్ స్కోర్ మరియు ప్రవేశ పరీక్షా లో సాధించిన మార్కులలో 30:70 వెయిటేజీ ఆధారంగా తుది అడ్మిషన్ కల్పిస్తారు. ప్రవేశ పరీక్షా డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. పరీక్షా అంశాలు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ సిలబస్ నుండి ఇవ్వబడతాయి.

ఎంబీఏ అగ్రిబిజినెస్ మానేజ్మెంట్

ఈ కోర్సులో చేరేందుకు 4 ఏళ్ళ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీవీఎస్సీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ మరియు బి.ఎస్.సి. CA&BM కోర్సులలో ఉత్తీర్ణత అయి ఉండాలి. అడ్మిషన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అవకాశం కల్పిస్తారు. రాతపరీక్ష క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికాల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్ మరియు కరెంటు అఫైర్స్ అంశాలపై జరుగుతుంది.

ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్

సాయిల్ & వాటర్ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మ్ మిషినరీ, పవర్ ఇంజనీరింగ్, ఇరిగేషన్, డ్రైనేజ్ ఇంజనీరింగ్. ఈ కోర్సులలో చేరేందుకు 4 ఏళ్ళ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉండాలి. అకాడమిక్ స్కోర్ మరియు ప్రవేశ పరీక్షా లో సాధించిన మార్కులలో 30:70 వెయిటేజీ ఆధారంగా తుది అడ్మిషన్ కల్పిస్తారు. ప్రవేశ పరీక్షా డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. పరీక్షా అంశాలు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ సిలబస్ నుండి ఇవ్వబడతాయి.

ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ & ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ

ఈ కోర్సులలో చేరేందుకు 4 ఏళ్ళ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ పూర్తిచేసి ఉండాలి. అకాడమిక్ స్కోర్ మరియు ప్రవేశ పరీక్షా లో సాధించిన మార్కులలో 30:70 వెయిటేజీ ఆధారంగా తుది అడ్మిషన్ కల్పిస్తారు. ప్రవేశ పరీక్షా డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. పరీక్షా అంశాలు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ సిలబస్ నుండి ఇవ్వబడతాయి.

సిలబస్ పార్ట్ I సిలబస్ పార్ట్ II

Post Comment