ఇండియన్ రైల్వే హాస్పిటల్స్ మరియు ఇతర రైల్వే జోనల్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే పారామెడికల్ సిబ్బందిని నియమించేందుకు ఆర్‌ఆర్‌బి ఈ పారామెడికల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్లు, హెల్త్ అండ్ మలేరియా ఇన్సపెక్టర్స్, డయాలిసిస్ టెక్నిషియన్స్ వంటి వివిధ పారామెడికల్ స్టాఫ్ ను భర్తీచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల బట్టి 7th వేతన స్కేల్ ప్రకారం లెవెల్ 3 నుండి 7 వరకు ప్రారంభ వేతనం అందిస్తారు.
నియామక బోర్డు | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
నియామక పరీక్షా | పారామెడికల్ ఎగ్జామినేషన్ |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష |
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ | టెక్నికల్ డిగ్రీ /ప్రొఫిషనల్ కోర్సులు |
వయో పరిమితి | 18 - 30 ఏళ్ళ మధ్య |
సిలబస్ | క్లిక్ చేయండి |
పారామెడికల్ విభాగం & ప్రారంభ వేతనాలు | |||
---|---|---|---|
పోస్టు పేరు | 7th పే స్కేల్ లెవెల్ | ప్రారంభ వేతనం | మెడికల్ ప్రమాణాలు |
డైటీషియన్ | 7 | 44900/- | C2 |
స్టాఫ్ నర్స్ | 7 | 44900/- | C1 |
డెంటల్ హైజినిస్ట్ | 6 | 35400/- | C2 |
డైయాలిసిస్ టెక్నిషియన్ | 6 | 35400/- | B1 |
ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్ | 6 | 35400/- | C1 |
హెల్త్ & మలేరియా ఇన్సపెక్టర్స్ గ్రేడ్ III | 6 | 35400/- | C1 |
ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ III | 6 | 35400/- | B1 |
ఆప్టోమెట్రిస్ట్ | 4 | 25500/- | B1 |
పెర్ఫ్యూజనిస్ట్ | 6 | 35400/- | B1 |
ఫిజియోథెరపిస్ట్ | 6 | 35400/- | C1 |
ఫార్మాసిస్ట్ గ్రేడ్ III | 5 | 29200/- | C2 |
రేడియోగ్రాఫర్ | 5 | 29200/- | B1 |
స్పీచ్ థెరపిస్ట్ | 5 | 29200/- | B1 |
ఎగ్ టిక్నిషియన్ | 4 | 25500/- | C1 |
లేడీ హెల్త్ విజిటర్ | 4 | 25500/- | C1 |
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II | 3 | 21700/- | B1 |
ఆర్‌ఆర్‌బి పారామెడికల్ ఎలిజిబిలిటీ
- జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. 1 జనవరి 1962 ముందు భారత్ వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. భారతీయ మూలాలు కలిగి పాకిస్తాన్, బర్మా, శ్రీలంకా, తూర్పు ఆఫ్రికా దేశాలు కెన్యా, ఉగాండా, యునైటెడ్ రిపబ్లిక్ టాంజానియా (పూర్వం టాంగన్యికా మరియు జాంజిబార్), జాంబియా, మాలావి, జైర్, ఇథియోపియా మరియు వియత్నాం దేశాల నుండి శాశ్వతంగా భారత్ లో స్థిరపడేందుకు వచ్చే భారతీయ సంతతి కూడా అర్హులు.
- వయోపరిమితి: వివిధ పోస్టులను అనుసరించి 18 నుండి 35 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
- విద్య అర్హుత : ఇంటర్మీడియట్ / గ్రాడ్యుయేషన్/నర్సింగ్, DLMT, ఫీజియోథెరపీ Etc ఉత్తీర్ణతయినా అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
- ఫీజికల్ ప్రమాణాలు: ఆర్‌ఆర్‌బి రిక్రూట్మెంట్ బోర్డు నియామక నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.
దరఖాస్తు ఫీజు | |
---|---|
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 500/- |
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు | 250/- |
ఆర్‌ఆర్‌బి పారామెడికల్ దరఖాస్తు విధానం
అర్హుత ఉన్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా బోర్డు అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి.
పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి. అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.
ఈ పరీక్షకు సంబంధించిన తేదీ, సమయం, పరీక్షా కేంద్రం మరియు ఇతర వివరాలను అర్హుత ఉన్న అభ్యర్థులకు ఆర్‌ఆర్‌బి నేరుగా అందజేస్తుంది
జోన్స్ వారీగా ఆర్‌ఆర్‌బి సమాచారం | |
---|---|
Ahmedabad www.rrbahmedabad.gov.in Phone : 079-22940858 | Jammu Srinagar www.rrbjammu.nic.in Phone : 0191-2476757 |
Ajmer www.rrbajmer.gov.in Phone: 0145 – 2425230 | Kolkata www.rrbkolkata.gov.in Phone: 033 – 25430108 |
Allahabad www.rrbald.nic.in Phone : 0532-2224531 | Malda www.rrbmalda.gov.in Phone : 03512-264567 |
Bangalore www.rrbbnc.gov.in Phone: 080 – 23330378 | Mumbai www.rrbmumbai.gov.in Phone : 022-23090422 |
Bhopal www.rrbbpl.nic.in Phone : 0755-2746660 | Muzaffarpur www.rrbmuzaffarpur.gov.in Phone : 0621-2213405 |
Bhubaneswar www.rrbbbs.gov.in Phone : 0674-2303015 | Patna www.rrbpatna.gov.in Phone: 0612-2677680 |
Bilaspur www.rrbbilaspur.gov.in Phone : 07752-247291 | Ranchi www.rrbranchi.gov.in Phone : 0651-2462429 |
Chandigarh www.rrbcdg.gov.in Phone: 0172 – 2730093 | Secunderabad www.rrbsecunderabad.nic.in Phone : 040-27821663 |
Chennai www.rrbchennai.gov.in Phone : 044-28275323 G | Siliguri www.rrbsiliguri.org Phone : 0353-2663840 |
orakhpur www.rrbgkp.gov.in Phone : 0551-2201209 | Guwahati www.rrbguwahati.gov.in Phone: 0361 – 2540815 |
Thiruvanthapuram www.rrbthiruvananthapuram.gov.in Phone : 0471-2323357 |
ఆర్‌ఆర్‌బి పారామెడికల్ ఎగ్జామ్ నమూనా
ఆర్‌ఆర్‌బి పారామెడికల్ సిబ్బంది నియామకం కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్షా మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. దరఖాస్తు చేసే ఆశావాహుల సంఖ్యా ఎక్కువ ఉంటె మరో సీబీటీ నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తుంది.
కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ : పరీక్షా ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్దతిలో జరుగుతుంది. ప్రోఫిసినల్ ఎబిలిటీ, జనరల్ అవెర్నెస్, జనరల్ అర్థమెటిక్ & జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ మరియు జనరల్ సైన్స్ అంశాలకు సంబంధించి 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. పరీక్షా వ్యవధి 90 నిముషాలు ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నలకు 1 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 0.25 మార్కులు తొలగిస్తారు.
ఈ పరీక్షలో కేటగిరి వారీగా అర్హుత మార్కులు కేటాయిస్తారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు 40% కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓబీసీ మరియు ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 25% అర్హుత మార్కులు పొందడం తప్పనిసరి.
సిలబస్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
---|---|---|---|
ప్రోఫిసినల్ ఎబిలిటీ | 70 | 70 | 90 నిముషాలు |
జనరల్ అవెర్నెస్ | 10 | 10 | |
జనరల్ అర్థమెటిక్ & జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ | 10 | 10 | |
జనరల్ సైన్స్ | 10 | 10 |
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఎంపిక విధానం
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఖాళీ ఉన్న పోస్టుల సంఖ్యకు 50% అదనపు అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది.
వివిధ దశల్లో సీబీటీకి హాజరైన అభ్యర్థుల మార్కులను నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి కేటగిరి వారి మెరిట్ లిస్టును తయారు చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం చివరి షార్ట్ లిస్ట్ రూపొందించి ఎంపికైన జాబితాను విడుదల చేస్తారు.