పదేళ్ల వృత్తి జీవితం పూర్తిచేసుకున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGBT) మరియు జూనియర్ స్కూల్ ఇనస్పెక్టర్లకు ఉద్యోగపరమైన పదోన్నతి కల్పించేందుకు ప్రొఫెషనల్ అడ్వాన్సమెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది అంతర్గత శాఖా పరమైన పరీక్ష.
ఈ పరీక్షకు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే హాజరయ్యేందుకు అర్హులు. ఈ పరీక్షా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ (BSE) నిర్వహిస్తుంది. అర్హుత ఉన్న ఉపాధ్యాయులు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోండి.
ప్రొఫెషనల్ అడ్వాన్సమెంట్ టెస్టుతో పాటుగా గ్రేడ్ II పండిట్స్, పిఈటీలు మరియు స్పెషల్ టీచర్లయినా డ్రాయింగ్ టీచర్లు, క్రాఫ్ట్ టీచర్లు, టైలరింగ్ మరియు మ్యూజిక్ టీచర్ల ప్రదోన్యతి కోసం ఆటోమేటిక్ అడ్వాన్సమెంట్ స్కీం ఎగ్జామినేషన్ (AASE) నిర్వహిస్తారు. ఇక గ్రేడ్ I పండిట్స్ పదోన్యత కోసం సింపుల్ ఓరియెంటేషన్ (SOT) నిర్వహిస్తారు.
Exam Name | TS PAT/SOT/AASE |
Exam Type | Eligibility |
Eligibility For | Teaching Promotion |
Exam Date | - |
Exam Duration | 1 To 3 Hours |
Exam Level | TS (Departmental) |
ప్రొఫెషనల్ అడ్వాన్సమెంట్ టెస్ట్ షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభం | |
దరఖాస్తు గడువు | |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | |
పరీక్ష తేదీ | |
ఫలితాలు |
దరఖాస్తు & ఎగ్జామ్ ఫీజు
అర్హుత ఉండే ఉపాధ్యాయులు తెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైటు (www.bse.telangana.gov.in) ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దశలోపూర్తిచేసిన దరఖాస్తుని ప్రింట్ తీసి దగ్గరలో ఉండే జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా గోడువు లోపు సమర్పించాలి.
- దరఖాస్తు రుసుము : 200/-
- పరీక్షా కేంద్రాలు తెలంగాణ అన్ని జిల్లాల పరిధిలో అందరి అభ్యర్థులకు అందుబాటులో ఉండే ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు
ప్రొఫిషనల్ అడ్వాన్సమెంట్ టెస్ట్ నమూనా
పేపర్ | సబ్జెక్టు / సిలబస్ | పరీక్ష వ్యవధి |
---|---|---|
పేపర్ I | లాంగ్వేజ్ మెథడ్స్ మ్యాథమెటిక్స్ |
2 గంటలు |
పేపర్ II | జనరల్ సబ్జక్ట్స్ సోషల్ స్టడీస్ జనరల్ సైన్స్ |
2 గంటలు |
సింపుల్ ఓరియెంటేషన్ టెస్ట్ నమూనా
పేపర్ | సబ్జెక్టు / సిలబస్ | పరీక్ష వ్యవధి |
---|---|---|
పేపర్ I | లాంగ్వేజ్ మెథడ్స్ | 2 గంటలు |
గ్రేడ్ II లాంగ్వేజ్ పండిట్స్ : ఆటోమేటిక్ అడ్వాన్సమెంట్ స్కీం ఎగ్జామినేషన్ నమూనా
పేపర్ | సబ్జెక్టు / సిలబస్ (తెలుగు/ఉర్దూ/హిందీ/సంస్కృతం) | పరీక్ష వ్యవధి |
---|---|---|
పేపర్ I | లాంగ్వేజ్ మెథడ్స్ సైకాలజీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ |
3 గంటలు |
స్పెషల్ టీచర్స్ : ఆటోమేటిక్ అడ్వాన్సమెంట్ స్కీం ఎగ్జామినేషన్ నమూనా
పేపర్ | సబ్జెక్టు / సిలబస్ | పరీక్ష వ్యవధి |
---|---|---|
పేపర్ I | సైకాలజీ & అడ్మినిస్ట్రేషన్ | 2 గంటలు |
పేపర్ II | జనరల్ మెథడ్స్ స్పెషల్ మెథడ్స్ |
60 నిముషాలు |
ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్: ఆటోమేటిక్ అడ్వాన్సమెంట్ స్కీం ఎగ్జామినేషన్ నమూనా
పేపర్ | సబ్జెక్టు / సిలబస్ | పరీక్ష వ్యవధి |
---|---|---|
పేపర్ I | ఫీజికల్ ఎడ్యుకేషన్ | 3 గంటలు |