కోర్టు ఉత్తర్వులను వేగంగా పంపించేందుకు ఫాస్టర్ సాఫ్ట్‌వేర్ ప్రారంభం
కోర్టు ఉత్తర్వులను వేగంగా పంపించేందుకు సీజేఐ ఎన్వీ రమణ, FASTER “ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్” అను నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ మోడ్‌లో వేగంగా మరియు సురక్షితంగా న్యాయ సమాచార బదిలీ చేయడానికి, న్యాయపరమైన ఉత్తర్వులను త్వరగా కమ్యూనికేట్ చేయడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ సాఫ్ట్‌వేర్ ముఖ్యమైన కోర్టు అధికారులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
డోపింగ్ నిరోధకతకు సంబంధించి అరుదైన రిఫరెన్స్ మెటీరియల్స్ విడుదల
దేశంలో డోపింగ్ నిరోధక పరీక్షలను బలోపేతం చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అరుదైన రిఫరెన్స్ మెటీరియల్స్ (ఆర్‌ఎం) ప్రారంభించారు. నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ 15వ గవర్నింగ్ బాడీ సమావేశంలో కేంద్ర మంత్రి ఈ ఆర్‌ఎంను విడుదల చేసారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని WADA- గుర్తింపు పొందిన లాబొరేటరీలలో యాంటీ-డోపింగ్ విశ్లేషణకు అవసరమైన రసాయనాల యొక్క స్వచ్ఛమైన రూపంగా ఉండనుందని వెల్లడించారు.
దీనిని గౌహతిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) మరియు సీఎస్ఐఆర్, అలానే జమ్మూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (IIIM) ల సహాయంతో నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ అభివృద్ధి చేసింది. ఇది వరకు భారతదేశం కెనడా మరియు ఆస్ట్రేలియా నుండి దీనిని దిగుమతి చేసుకునేది.
చైనా కొత్త ఉపగ్రహం గాఫెన్-3 03 ప్రయోగం విజయవంతం
07 ఏప్రిల్ 2022 న వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి కొత్త భూ-పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. గాఫెన్-3 03 పేరుతో లాంగ్ మార్చ్-4సీ రాకెట్ ద్వారా ప్రయోగించబడిన ఈ ఉపగ్రహం విజయవంతంగా అనుకున్న కక్ష్యలోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. గాఫెన్-3, గాఫెన్-3 02, గాఫెన్-3 03 పేర్లతో చైనా వరుసగా ప్రయోగిస్తున్న ఈ ఉపగ్రహాల ద్వారా భూ-సముద్ర రాడార్ ఉపగ్రహ కూటమిని ఏర్పరుస్తున్నట్లు తెలుస్తుంది.
వీటి ద్వారా ఇది సముద్ర విపత్తు నివారణ, సముద్ర పర్యావరణ పర్యవేక్షణ, సముద్ర పరిశోధన, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, వ్యవసాయం మరియు వాతావరణ మార్పులు, సముద్ర హక్కులు వంటి వివిధ ప్రయోజనాలను పొందనున్నారు.
ఇండియన్ స్పేస్-టెక్ స్టార్టప్ - పిక్సెల్ యొక్క మొదటి శాటిలైట్ లాంచ్
ఇండియన్ స్పేస్‌టెక్ స్టార్టప్- పిక్సెల్, 'శకుంతల' పేరుతో అత్యధిక రిజల్యూషన్ హైపర్‌స్పెక్ట్రల్‌తో కూడిన తన మొదటి వాణిజ్య ఉపగ్రహాన్ని ప్రారంభించింది. బెంగుళూరు కేంద్రంగా ఉన్న ఈ భారతీయ ఇండియన్ స్పేస్‌టెక్ సంస్థ, ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌క్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా తమ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ సంస్థలు అవైస్ అహ్మద్ మరియు క్షితిజ్ ఖండేల్వాల్'లు ఫిబ్రవరి 2019 లో స్థాపించారు. పిక్సెల్ 2020లలో 30+ భూ పరిశీలన సూక్ష్మ-ఉపగ్రహాల సముదాయాన్ని సూర్య-సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.