Advertisement
యూపీఎస్సీ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్ 2022
Latest Jobs UPSC

యూపీఎస్సీ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్ 2022

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 2022 వెలువడింది. జియోలజీ సంబంధిత డిగ్రీలలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసందుకు అర్హులు.

తాజా నోటిఫికేషన్ ద్వారా జియాలజిస్ట్, జియోఫిజిస్ట్, కెమిస్ట్ మరియు జూనియర్ హైడ్రోజియాలజిస్ట్ కేటగిర్లకు సంబంధించి 282 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారితంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు కింద తెలుసుకుందాం.

నోటిఫికేషన్ నెంబర్ 02/2023-GEOL
పోస్టుల సంఖ్యా 282
నోటిఫికేషన్ తేదీ 21.09.2022
దరఖాస్తు తుది గడువు 11.10.2022
పరీక్షా ఫీజు 200/-
పరీక్ష తేదీ 19.02.2023
అడ్మిట్ కార్డు 26.01.2023

యూపీఎస్సీ సీజీఎస్ఈ పోస్టుల సంఖ్యా

జాబ్  కేటగిరి ఖాళీల సంఖ్యా
జియాలజిస్ట్  గ్రూప్ A 216 పోస్టులు
జియోఫిజిస్ట్ గ్రూప్ A 21 పోస్టులు
కెమిస్ట్ గ్రూప్ A 16 పోస్టులు
సైంటిస్ట్ బి (హైడ్రాలజీ) గ్రూప్ ఎ
సైంటిస్ట్ బి (కెమికల్) గ్రూప్ ఎ
సైంటిస్ట్ బి (జియోఫిజిక్స్) గ్రూప్ ఎ
26 పోస్టులు
01 పోస్టులు
02 పోస్టులు

జియాలజి (భూగర్భ శాస్త్రం) మరియు దాని అనుబంధ శాఖలో పనిచేసే జియో - సైంటిస్ట్ లను నియమించేందుకు కంబైన్డ్ జియో - సైంటిస్ట్ ఎగ్జామినేషను యుపిఎస్‌సి నిర్వహిస్తుంది. ఈ నియామక పరీక్షా ద్వారా జియోలోజిస్టు, జియోఫిజిస్ట్, జియోకెమిస్ట్ మరియు జూనియర్ హైడ్రోజియాలజిస్ట్ వంటి భూగోళ శాస్త్రజ్ఞులను భర్తీచేస్తారు.

వీరు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గనుల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ మరియు జల వనరుల మంత్రిత్వ శాఖల పరిధిలో విధులు నిర్వర్తిస్తారు. కంబైన్డ్ జియో - సైంటిస్ట్ ఎగ్జామినేషన్ ఏటా జనవరి లేదా ఫిబ్రవరి లో నిర్వహిస్తారు.

ఈ పరీక్ష మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్షా నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ లో అర్హుత సాధించిన అభ్యర్థులకు జూన్ లేదా జులై నెలల్లో మెయిన్స్ పరీక్షా జరుపుతారు. మెయిన్స్ లో మెరిట్ సాధించిన వారికీ సెప్టెంబర్ లేదా అక్టోబరులో వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి నియామకం చేపడతారు.

జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ

  • జాతీయత: ఇండియా, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • 1962 కు ముందు ఇండియాకు వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భారత్ లో శాశ్వతంగా స్థిరపడేందుకు వచ్చిన పాకిస్తాన్, శ్రీలంక, బర్మా మరియు కెన్యా, ఉగాండా, జాంబియా దెసలకు చెందిన వారుకూడా అర్హులు.
  • వయోపరిమితి:  అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 3 నుండి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది.
 జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - జియోలోజిస్ట్ (గ్రూప్ ఏ)
జియోలోజిస్ట్ (గ్రూప్ ఏ) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి జియోలాజికల్ సైన్స్ లేదా జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీ లేదా భూగర్భ అన్వేషణ లేదా ఖనిజ అన్వేషణ లేదా ఇంజనీరింగ్ జియాలజీ లేదా మెరైన్ జియాలజీ లేదా ఎర్త్ సైన్స్ అండ్ రిసోర్సెస్ నిర్వహణ లేదా ఓషనోగ్రఫీ మరియు తీర ప్రాంత అధ్యయనం లేదా పెట్రోలియం జియోసైన్స్ లేదా పెట్రోలియం అన్వేషణ లేదా జియోకెమిస్ట్రీ లేదా జియోలాజికల్ టెక్నాలజీ లేదా జియోఫిజికల్ టెక్నాలజీ లలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతయి ఉండాలి
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - జియోఫీజిస్ట్ (గ్రూప్ ఏ)
 జియోఫీజిస్ట్ (గ్రూప్ ఏ) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ లేదా M.Sc. (జియోఫిజిక్స్) లేదా ఇంటిగ్రేటెడ్ M.Sc. (భూగర్భ అన్వేషణ) లేదా M.Sc (అప్లైడ్ జియోఫిజిక్స్) లేదా M.Sc. (మెరైన్ జియోఫిజిక్స్) లేదా M.Sc. (టెక్.) (అప్లైడ్జియోఫిజిక్స్) లలో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - జియోకెమిస్ట్ (గ్రూప్ ఏ)
 జియోకెమిస్ట్ (గ్రూప్ ఏ) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీ లేదా ఎనలిటికల్ కెమిస్ట్రీ నుండి మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

జియో సైంటిస్ట్‌ దరఖాస్తు విధానం

కంబైన్డ్ జియో - సైంటిస్ట్ పరీక్షకు పోటీపడే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభించే ముందు కావాల్సిన సమాచారమంతా అందుబాటులో ఉంచుకోండి. ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ద్వారా అందించే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత మీరే వహించాలి. వయస్సు ధ్రువపత్రం, విద్యా అర్హత ధ్రువపత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఇడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ మరియు  అవసరమైన వారు వయసు సడలింపు ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి.

యూపీఎస్సీ పరీక్షకు సంబంధించిన సమస్త సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ ఫోన్లకు పంపిస్తుంది. ఇమెయిల్ మరియు మొబైల్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే.

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు
హైదరాబాద్ బెంగుళూరు చెన్నై
దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 200/-
ఎస్సీ, ఎస్టీ మరియు అంగవైకుల్యపు అభ్యర్థులు దరఖాస్తు ఫీజు లేదు

కంబైన్డ్ జియో - సైంటిస్ట్ ఎగ్జామినేషన్ మూడు దశలలో జరుగుతుంది. మొదటి దశలో ఆబ్జెక్టివ్ పద్దతిలో 400 మార్కులకు ప్రిలిమినరీ పరీక్షా నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 లో 2గంటల వ్యవధితో 100 మార్కులకు జనరల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు.

పేపర్ 2 లో 2గంటల వ్యవధితో 300 మార్కులకు  పోస్టు సంబంధిత స్పెషలైజ్డ్ సబ్జెక్టును ఉద్దేశించి జరుగుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది.

జియోలాజిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నమూనా

స్ట్రీమ్ I : జియోలాజిస్ట్ & జూనియర్ హైడ్రోలాజిస్ట్
సబ్జెక్టు సమయం మార్కులు
పేపర్ 1 :  జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2 :  జియాలజి /హైడ్రో జియాలజి 2 గంటలు 300
స్ట్రీమ్-II : జియోఫీజిస్ట్
పేపర్ 1 :  జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2 :  జియో ఫిజిక్స్ 2 గంటలు 300
స్ట్రీమ్ -III : కెమిస్ట్
పేపర్ 1 :  జనరల్ స్టడీస్ 2 గంటలు 100
పేపర్ 2 : కెమిస్ట్రీ 2 గంటలు 300

జియో సైంటిస్ట్‌ మెయిన్స్ ఎగ్జామ్ నమూనా

ప్రిలిమ్స్ యందు మెరిట్ సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు. మెయిన్స్ పరీక్షా మూడు పేపర్లలో 600 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 3 గంటల వ్యవధితో 200 మార్కులకు ఇవ్వబడుతుంది. మెయిన్స్ పరీక్షా పూర్తి డిస్క్రిప్టివ్ పద్దతిలో జరుగుతుంది. ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ఏయే పోస్టులకు దరఖాస్తు చేశారో, ఆయా పోస్టులకు సంబంధించి అన్ని పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

స్ట్రీమ్ -I : జియోలాజిస్ట్
సబ్జెక్టు ఎగ్జామ్ నిడివి మార్కులు
Paper-I : Geology 3 Hours 200 Marks
Paper-II : Geology 3 Hours 200 Marks
Paper-III : Geology 3 Hours 200 Marks
Total Marks 600 Marks
స్ట్రీమ్ -II : జియోఫీజిస్ట్
Paper-I : Geophysics 3 Hours 200 Marks
Paper-II : Geophysics 3 Hours 200 Marks
Paper-III : Geophysics 3 Hours 200 Marks
Total Marks 600 Marks
స్ట్రీమ్-III : కెమిస్ట్
Paper-I : Chemistry 3 Hours 200 Marks
Paper-II : Chemistry 3 Hours 200 Marks
Paper-III : Chemistry 3 Hours 200 Marks
Total Marks 600 Marks
స్ట్రీమ్-IV : జూనియర్ హైడ్రోలాజిస్ట్
Paper-I : Geology 3 Hours 200 Marks
Paper-II : geology 3 Hours 200 Marks
Paper-III : Hydrogeology 3 Hours 200 Marks
Total Marks 600 Marks

ఇంటర్వ్యూ : మెయిన్స్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఖాళీ పోస్టుల సంఖ్యా ఆధారంగా వ్యక్తిగత ఇంటర్వ్యూ కి ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ టెస్ట్ 200 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్స్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

Post Comment