బీడీ, సినీమా, మైనింగ్ కార్మికుల పిల్లలకు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్
Scholarships

బీడీ, సినీమా, మైనింగ్ కార్మికుల పిల్లలకు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్

వార్షిక కుటుంబ ఆదాయం లక్ష లోపు ఉండే బీడీ, సినీ, ఐరన్ ఒర్/మాంగినీస్ ఒర్, క్రోమ్ ఒర్ (IOMC) మరియు లైమ్ స్టోన్, డోలమైట్ (LSDM) వంటి మైనింగ్ స్థావరాల్లో పనిచేసే కార్మికుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం విద్య సాయం (ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్) అందిస్తుంది. క్లాస్ I నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు అందరు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులు. ఈ స్కాలర్షిప్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ & ఎంప్లాయిమెంట్ ద్వారా అందిస్తారు.

Advertisement
స్కాలర్షిప్ పేరు ఫైనాన్సియల్ అసిస్టెన్స్ ఫర్ బీడీ, సినీ, మైనింగ్ వర్కర్ చిల్డ్రన్స్
ఎవరు అర్హులు వార్షిక కుటుంబ ఆదాయం లక్ష లోపు ఉండే విద్యార్థులకు
దరఖాస్తు ముగింపు తేదీ 31-01-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 07-02-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 07-02-2022

ఎవరు అర్హులు

వార్షిక కుటుంబ ఆదాయం లక్ష లోపు ఉండే బీడీ, సినీ, మైనింగ్ కార్మికుల పిల్లలు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులు. దరఖాస్తు చేసే విద్యార్థులు ప్రధాన అకాడమిక్ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సప్లమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన వారు అనర్హులు. ఒక సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు, అవే సబ్జెక్టులలో పీజీ చేసిన విద్యార్థులకే ఈ పథకం వర్తిస్తుంది. ఉదాహరణకు బీఏ తర్వాత ఎంకామ్ చేసిన లేదా బీకామ్ తర్వాత ఎంఏ చేసిన లేదా బీఎస్సీ తర్వాత ఎంబీఏ చేసిన ఈ పథకం వర్తించదు.

ఈ పథకంకు అర్హుత పొందిన వారు ఇంకో ప్రభుత్వ పరమైన స్కాలర్షిప్ లబ్దిదారుడై ఉండకూడదు. ఈ స్కాలర్షిప్ ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్య సంస్థల్లో చదువుకునే విద్యార్థులకే అందిస్తారు. కనీస అకాడమిక్ హాజరు లేని విద్యార్థులకు స్కాలర్షిప్ అందించారు. ఈ స్కాలర్షిప్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు వరకు అమలుచేసారు.

ఈ స్కాలర్షిప్'కు అర్హులైన విద్యార్థులు, దరఖాస్తు చేసే ముందు ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్, మొబైల్ నెంబర్, ఫోటో, తల్లి/తండ్రి జాబ్ ఐడీ కార్డు, ఆదాయ ధ్రువపత్రం, బ్యాంకు పాసుబుక్ మొదటి పేజీ జిరాక్స్, ఆధార్ కార్డు మరియు విద్యార్థి అకాడమిక్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో, సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. సక్రమంగా ఉండే దరఖాస్తులను వెరిఫికేషన్ చేసి, అర్హుల బ్యాంకు అకౌంటులో స్కాలర్షిప్ లేదా స్టైపెండ్ జమ చేస్తారు.

Name of Scheme Benifits
Financial Assistance for Education and Assistance under Skill Development (ITI) CLASS BOYS GIRLS
I to IV (for purchase of dress/books etc.) 250/- 250/-
V to VIII 940/- 500/-
IX 1140/- 700
X 1840/- 1400/-
PUC I & II 2440/- 2000/-
ITI 10.000/- 10,000/-
Degree Course 3,000/- 3,000/-
Professional Courses (BE / MBBS / BSc.- Agri) 15,000/- 15,000/-

Advertisement

Post Comment